New Smartphone : ఒప్పో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్- 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో! ధర..

Oppo a6k 5g price : ఒప్పో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అదే ఒప్పో ఏ6కే 5జీ. భారీ బ్యాటరీ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్​గా మారనుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలపై పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 8, 2026, 12:26:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో.. తన పాపులర్ ఏ-సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది. చైనాలో తాజాగా విడుదలైన 'ఒప్పో ఏA6కే' ఇప్పుడు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ చూస్తుంటాం, కానీ ఇందులో ఏకంగా 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఒప్పో ఏ6కే స్మార్ట్​ఫోన్..
ఒప్పో ఏ6కే స్మార్ట్​ఫోన్..

ఒప్పో ఏ6కే- అదిరిపోయే బ్యాటరీ.. వేగవంతమైన ఛార్జింగ్

స్మార్ట్​ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నిరాటంకంగా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 45డబ్ల్యూ సూపర్​ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల అంత పెద్ద బ్యాటరీని కూడా త్వరగానే ఛార్జ్ చేయవచ్చు.

ఒప్పో ఏ6కే- డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్..

ఒప్పో ఏ6కేలో 6.75 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్​ని సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను వాడారు. ఇది 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో ఈ ఫోన్ లభిస్తుంది.

ఒప్పో ఏ6కే- కెమెరా, డిజైన్..

ఒప్పో ఏ6కే స్మార్ట్​ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

మెయిన్ కెమెరా: 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (ఆటో ఫోకస్ సౌకర్యం ఉంది).

సెకండరీ కెమెరా: 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్.

సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.

ఈ ఫోన్ కేవలం ఫీచర్ల పరంగానే కాకుండా దృఢత్వం పరంగా కూడా మెరుగ్గా ఉంది. దీనికి ఐపీ69, ఐపీ68, ఐపీ66 రేటింగ్స్ ఉన్నాయి. అంటే నీరు, దుమ్ము నుంచి ఈ ఫోన్‌కు గట్టి రక్షణ లభిస్తుంది.

Realme C100 : 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్- ధర ఎంతంటే..

ఒప్పో ఏ6కే ధర ఎంత?

ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో విడుదలయ్యింది. అక్కడ దీని ప్రారంభ ధర 1,999 యువాన్లు (సుమారు రూ. 27,000).

8 జీబీ + 256 జీబీ: రూ. 27,000 (సుమారు)

12 జీబీ + 512 జీబీ: రూ. 32,000 (సుమారు)

ఈ ఫోన్ డాన్ గోల్డ్, సీషెల్ వైట్, ట్విలైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఇక భారత మార్కెట్​లోకి ఇది ఎప్పుడు వస్తుందనే దానిపై ఒప్పో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ భారత్‌లో విడుదలైతే, భారీ బ్యాటరీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని టెక్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. ఒప్పో ఏ6కే బ్యాటరీ ప్రత్యేకత ఏంటి?

ఈ ఫోన్‌లో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. సాధారణ స్మార్ట్‌ఫోన్స్ కంటే ఇది 40% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనివల్ల లాంగ్ ట్రిప్స్‌లో ఉన్నప్పుడు లేదా గేమింగ్ ఆడేటప్పుడు ఛార్జింగ్ సమస్య ఉండదు.

2. ఈ ఫోన్ వాటర్ ప్రూఫ్​తో వస్తుందా?

అవును. దీనికి ఐపీ69 రేటింగ్ ఉంది. అంటే అధిక పీడనం ఉన్న నీటి ధారలను కూడా ఇది తట్టుకోగలదు. నీటిలో పడినా ఫోన్ పాడయ్యే అవకాశం చాలా తక్కువ.

3. ఇది 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుందా?

అవును. ఇది 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

4. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా?

అవును. 45డబ్ల్యూ సూపర్ ఊక్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More