Women Sleep Health : ఆడవారిలోని జీవక్రియలు మగవారికి భిన్నంగా ఉంటాయి. అడవాళ్ల ఆరోగ్యంపై పలు అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇందులో భాగంగా నిద్ర విషయంలోనూ తేడాలుంటాయి. మహిళలతో పోల్చితే మగవారు వేగంగా నిద్రపోతారని.. మగవారితో పోలిస్తే ఆడవారు త్వరగా నిద్రపోలేరంట..! ఆడవారిలో నిద్ర నాణ్యత కూడా తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇదే అంశాన్ని ప్రముఖ నిద్ర నిపుణులు, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ జె. అలెన్ విశ్లేషిస్తూ… మహిళల నిద్రకు ఆటంకం కలిగించే ఆసక్తికరమైన కారణాలను పంచుకున్నారు. హార్మోన్ల హెచ్చుతగ్గుల నుంచి వారు మోసే 'మెంటల్ లోడ్' వరకు నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరించారు.
1. హార్మోన్ల వ్యవస్థ….
మహిళల శరీరంలో హార్మోన్ల వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే రెండు హార్మోన్లు నిద్ర చక్రాన్ని శాసిస్తాయి. "మగవారిలో నిద్రకు సంబంధించిన హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. కానీ ఆడవారిలో ప్రతి నెలా వచ్చే రుతుచక్రం వల్ల ఈ హార్మోన్లు మారుతుంటాయి" అని డాక్టర్ అలెన్ వివరించారు. నెలసరి రావడానికి ముందు ప్రొజెస్టెరాన్ స్థాయిలు హఠాత్తుగా తగ్గిపోతాయి. దీనివల్ల గాఢ నిద్ర ఉండదు… మధ్య మధ్యలో మెలకువ వస్తుంటుంది. అలాగే మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం వల్ల సరిగా నిద్రపోలేరు. ఫలితంగా వారు రాత్రంతా నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
2. మానసిక ఒత్తిడి - ఆందోళన…
మగవారితో పోలిస్తే ఆడవారిలో ఆందోళన , కుంగుబాటు వంటి సమస్యలు వచ్చే అవకాశం రెట్టింపుగా ఉంటుంది. ఇది నేరుగా వారి నిద్ర నాణ్యతపై దెబ్బకొడుతుంది. ఆందోళన వల్ల నిద్ర సరిగ్గా పట్టదు, నిద్ర లేకపోవడం వల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. ఇదొక విషవలయంలా మారుతుంది. "ఒకే రకమైన ఒత్తిడి ఎదురైనప్పుడు మగవారు 10 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకోగలరు. కానీ మహిళల మెదడు మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి ఆలోచనల వలయంలో చిక్కుకుంటుంది," అని డాక్టర్ క్రిస్టోఫర్ స్పష్టం చేశారు.
3. బాధ్యతల భారం…
మన సమాజంలో పిల్లల సంరక్షణ లేదా ఇంటి పనుల బాధ్యత అధికంగా మహిళలపైనే ఉంటుంది. రాత్రిపూట పాప ఏడుస్తుందేమోనని ఒక చెవి అప్రమత్తంగా ఉంచడం, రేపటి పిల్లల స్కూల్ షెడ్యూల్స్, భోజనాల గురించి ఆలోచించడం వంటివన్నీ వారి మెదడును శాంతింపజేయవు. దీనివల్ల వారి మెదడు 'సెమీ-అలెర్ట్' స్థితిలో ఉండిపోతుంది. ఫలితంగా వారు గాఢ నిద్రకు దూరం కావాల్సి వస్తుంది.
{{/usCountry}}మన సమాజంలో పిల్లల సంరక్షణ లేదా ఇంటి పనుల బాధ్యత అధికంగా మహిళలపైనే ఉంటుంది. రాత్రిపూట పాప ఏడుస్తుందేమోనని ఒక చెవి అప్రమత్తంగా ఉంచడం, రేపటి పిల్లల స్కూల్ షెడ్యూల్స్, భోజనాల గురించి ఆలోచించడం వంటివన్నీ వారి మెదడును శాంతింపజేయవు. దీనివల్ల వారి మెదడు 'సెమీ-అలెర్ట్' స్థితిలో ఉండిపోతుంది. ఫలితంగా వారు గాఢ నిద్రకు దూరం కావాల్సి వస్తుంది.
{{/usCountry}}భారతీయ కుటుంబాల్లో చూసుకుంటే…. ఉద్యోగం చేసే మహిళలకు ఈ భారం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆఫీసు పనులతో పాటు ఇంటి నిర్వహణ బాధ్యతలు తోడవడంతో వారి మెదడు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. అందుకే, మహిళలకు నిద్ర లేకపోవడమనేది కేవలం ఒక అలవాటు కాదు, అది వారి జీవనశైలి, శారీరక మార్పులతో ముడిపడి ఉన్న తీవ్రమైన అంశమని మనం గుర్తించాలని డాక్టర్ క్రిస్టోఫర్ జె. అలెన్ చెబుతున్నారు.