Shlokas for Kids Focus: పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోసం శక్తివంతమైన శ్లోకాలు ఇవిగో!
Shlokas for Kids Focus: పిల్లలు చేత రోజు శ్లోకాలు చదివించడం వలన అనేక లాభాలని పొందడానికి వీలవుతుంది. కొన్ని శ్లోకాలు పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. ఇవి నిజానికి బ్రెయిన్ ఎక్సర్సైజ్ల మాదిరి పనిచేస్తాయి. పిల్లలు చేత రోజు ఉదయం పూట ఈ శ్లోకాలను చెప్పించండి. మేధస్సును పెంచుకుంటారు.
డిజిటల్ యుగంలో పిల్లల ఏకాగ్రత నిలకడగా ఉండటం లేదు. స్మార్ట్‌ఫోన్‌లు, వీడియో గేమ్స్ కారణంగా నలిగిపోతున్న చిన్నారుల మెదడుకు కావాల్సింది కేవలం వినోదం కాదు, ప్రశాంతత మరియు పదునైన జ్ఞాపకశక్తి. భారతీయ సంప్రదాయంలో శతాబ్దాల కాలంగా కొనసాగుతున్న శ్లోక పఠనం కేవలం భక్తి మార్గం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణమైన 'బ్రెయిన్ ఎక్సర్‌సైజ్'. పిల్లల చేత ప్రతిరోజూ శ్లోకాలు చెప్పించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.

శ్లోక పఠనం: మేధస్సుకు పదును పెట్టే సాధనం
పిల్లలు చేత శ్లోకాలను లయబద్ధంగా చదవడం వల్ల పిల్లల్లో ఉచ్చారణ దోషాలు తొలగిపోవడమే కాదు. ఏకాగ్రత అసాధారణంగా పెరుగుతుంది. ఏదైనా విషయాన్ని త్వరగా గ్రహించి, ఎక్కువ కాలం గుర్తుంచుకునే సామర్థ్యం కూడా ఏర్పడుతుంది.
పిల్లల దైనందిన జీవితంలో భాగం చేయాల్సిన కొన్ని అద్భుతమైన శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి:
1.సరస్వతీ శ్లోకం:
"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||"
ఈ శ్లోకంతో రోజును ప్రారంభించడం వల్ల చదువుపై ఆసక్తి పెరుగుతుంది. సరస్వతీ దేవి అనుగ్రహంతో విద్యార్థులలో ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
2. మేధస్సు పెరగడానికి - గాయత్రీ మంత్రం:
"ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ||"
ఈ మంత్రాన్ని పిల్లలు రోజూ చదివితే ఇది మెదడులోని కణాలను ఉత్తేజితం చేసి, ఏకాగ్రతను బాగా పెంచుతుంది.
3. వినాయక శ్లోకం:
"వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ||"
ఏ పని ప్రారంభించినా విఘ్నేశ్వరుడిని మొదట ఆరాధిస్తాము. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఏదైనా కష్టమైన పనిని చేసేటప్పుడు భయం కలగకుండా ధైర్యాన్ని ఇస్తుంది.
4. గురు మంత్రం:
"గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వరః |
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||"
ఈ శ్లోకం ద్వారా పిల్లలకు గురువుల పట్ల, పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది. సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఇతరులకు ఎలా గౌరవం ఇవ్వాలి అనే ప్రాథమిక విలువలను వారు చిన్నతనం నుంచే నేర్చుకుంటారు.
పిల్లలకు చిన్నప్పటి నుంచే వీటిని నేర్పడం ద్వారా వారిలో ధైర్యం, క్రమశిక్షణ, మరియు పదునైన మేధస్సు రూపుదిద్దుకుంటాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి కూర్చుని ఈ శ్లోకాలను పఠిస్తే, ఇల్లంతా సానుకూల శక్తితో నిండి పోతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


