వింటర్ ఒలింపిక్స్‌లో 'కండోమ్' సంక్షోభం.. మూడు రోజుల్లోనే 10,000 ఉఫ్!
మిలన్-కోర్టినా వింటర్ ఒలింపిక్స్ విలేజ్‌లో సరఫరా చేసిన 10,000 కండోమ్ ప్యాకెట్లు మూడు రోజుల్లోనే అయిపోయాయి! దీనితో నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడగా, అథ్లెట్లు తమకు ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు.
సాధారణంగా ఒలింపిక్ క్రీడలంటే రికార్డులు, పతకాల గురించి మాట్లాడుకుంటారు. కానీ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో మాత్రం 'కండోమ్స్' కొరత హాట్ టాపిక్‌గా మారింది. పోటీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే అథ్లెట్ల విలేజ్‌లో స్టాక్ నిండుకోవడంతో నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరీ ముఖ్యంగా 3 రోజుల్లోనేే 10,000కుపైగా కండోమ్ ప్యాకెట్లు అయిపోయినట్టు తెలుస్తోంది.

వింటర్ ఒలింపిక్స్- నిర్వాహకుల అంచనాలు మిస్..
వింటర్ ఒలింపిక్స్ కోసం నిర్వాహక కమిటీ ప్రారంభంలో 10,000 కండోమ్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. అయితే, క్రీడాకారుల నుంచి వీటికి ఊహించని స్థాయిలో డిమాండ్ రావడంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయిందని తెలుస్తోంది.
"సరఫరా చేసిన స్టాక్ మూడు రోజుల్లోనే అయిపోయింది. కొత్త స్టాక్ వస్తుందని వారు హామీ ఇచ్చారు కానీ, అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు," అని ఒక అథ్లెట్ ఇటాలియన్ పత్రిక లా స్టాంపాతో పేర్కొన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌తో పోల్చితే..
నిజానికి గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో దాదాపు 3,00,000 కండోమ్స్ (ఒక్కో అథ్లెట్‌కు రోజుకు రెండు చొప్పున) పంపిణీ చేశారు. కానీ వింటర్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఆ స్థాయిని అంచనా వేయడంలో విఫలమై, కేవలం 10,000 లోపే సిద్ధం చేయడం ఈ సంక్షోభానికి కారణమైంది.
ఆరోగ్య అవగాహనే లక్ష్యం..
ఒలింపిక్ విలేజ్‌లో ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేయడం అనేది కొత్త విషయం కాదు. దీనిపై లోంబార్డీ రీజియన్ గవర్నర్ అటిలియో ఫోంటానా స్పందిస్తూ.. "1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. లైంగిక సంక్రమణ వ్యాధుల (ఎస్టీడీ) పట్ల యువతకు, అథ్లెట్లకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు," అని స్పష్టం చేశారు.
మరోవైపు స్పానిష్ ఫిగర్ స్కేటర్ ఒలివియా స్మార్ట్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో పసుపు రంగు లోంబార్డీ లోగో ఉన్న కండోమ్స్ చూపిస్తూ "నాకు ఇవి దొరికాయి.. ఇక్కడ కావాల్సినవన్నీ ఉన్నాయి," అంటూ వ్యాఖ్యానించారు.
విలేజ్‌లో ఇతర సదుపాయాలు..
కండోమ్స్ కొరత మినహాయిస్తే, అథ్లెట్ల కోసం విలేజ్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. అవి..
భారీ జిమ్, టేబుల్ ఫుట్‌బాల్, ఎయిర్ హాకీ గేమింగ్ జోన్.
సంగీత ప్రియుల కోసం పియానో.
ఫ్రీ డ్రింక్ మెషీన్లు (కోకాకోలా, స్మూతీలు వంటివి ఉచితంగా లభిస్తాయి).
ప్రస్తుతానికి అదనపు కండోమ్ స్టాక్‌ను అత్యవసరంగా తెప్పించేందుకు నిర్వాహక కమిటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


