భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం ‘హోండా’.. ఎంతో కాలంగా వేచి చూస్తున్న 2026 ‘హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్’ వర్షన్‌ను ఇటీవలే మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 11.80 లక్షల నుంచి రూ. 18.40 లక్షల శ్రేణిలో ఈ మోడల్ లభిస్తోంది. స్ట్రక్చర్, వెలుపలి కొలతల్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, ఇంటీరియర్, ఫీచర్ల పరంగా వినియోగదారులు ఆశించిన కీలక అప్‌డేట్లను హోండా అందించింది.

మీరు కొత్త హోండా ఎలివేట్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ కార్లలో ఉన్న టాప్-3 ప్లస్ పాయింట్లు, 2 ప్రధాన లోపాలు ఏంటో ఇక్కడ వివరంగా చూద్దాము..
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్: టాప్-3 ప్లస్ పాయింట్లు..
1. ముందు, వెనుక వరుసలకు వెంటిలేటెడ్ సీట్లు
పాత ఎలివేట్ మోడల్‌లో తీవ్రంగా లోపించిన ఫీచర్లలో వెంటిలేటెడ్ సీట్లు ఒకటి. భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో డ్రైవర్లకు, ప్రయాణికులకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన హోండా, కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఏకంగా ముందు వరుసతో పాటు వెనుక సీట్లకు కూడా వెంటిలేషన్ సదుపాయాన్ని అందించి కాంపిటీటర్లకు సవాలు విసిరింది.
2. పవర్డ్ ఫ్రంట్ సీట్లు
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కార్లు కొనుగోలు చేసే వినియోగదారులు ఎలక్ట్రానిక్ అడ్జెస్టెబుల్ సీట్లను కోరుకుంటారు. ఈ విభాగంలో ఉన్న ఇతర ప్రత్యర్థి కార్లలో ఈ ఫీచర్ ఇప్పటికే ఉండటంతో, పాత ఎలివేట్ కొంత వెనుకబడింది. అయితే తాజా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డ్రైవర్, కో-ప్యాసింజర్ సీట్లను ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేసుకునే 'పవర్డ్ ఫ్రంట్ సీట్స్' సదుపాయాన్ని జోడించి ఆ లోటును భర్తీ చేశారు.
3. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్లు
{{/usCountry}}3. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్లు
{{/usCountry}}ఆధునిక కార్లలో కస్టమర్లు ఆశించే హైటెక్ ఫీచర్లను హోండా ఇందులో పొందుపరిచింది. ఇందులో 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి ఇరుకైన ప్రదేశాల్లో కారును పార్క్ చేయడానికి, ట్రాఫిక్‌లో ప్రయాణించడానికి డ్రైవర్‌కు ఎంతో సులువుగా ఉంటాయి.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్: 2 ప్రధాన లోపాలు..
1. డిజైన్ పరంగా కొత్తదనం లేకపోవడం
ఎక్స్‌టీరియర్ పరంగా చూస్తే ఈ హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో చెప్పుకోదగ్గ విప్లవాత్మక మార్పులేవీ కనిపించవు. అదే బాక్సీ షేప్ డిజైన్‌ను యథాతథంగా కొనసాగించారు. ఫ్రంట్ గ్రిల్‌లో స్వల్ప మార్పులు చేయడంతో పాటు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్ హౌసింగ్‌లను మాత్రమే కొద్దిగా రీ-డిజైన్ చేశారు. పాత మోడల్‌కి, దీనికి పెద్దగా తేడా గుర్తించడం కష్టమే.
2. పాత ఇంజిన్.. ఆప్షన్ల కొరత
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మెకానికల్ విభాగంలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇది కేవలం 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తోంది. ఈ ఇంజిన్ 119 బీహెచ్పీ పవర్, 145 ఎన్ఎం టార్క్‌ను మాత్రమే విడుదల చేస్తుంది.
ఈ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా నెక్సాన్ వంటి ప్రత్యర్థులు టర్బో-పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆప్షన్లను ఇస్తున్నాయి. మరోవైపు మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటివి అత్యధిక మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్ సాంకేతికతను కలిగి ఉన్నాయి. హోండాలో కేవలం ఒక్క పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే ఉండటం కొనుగోలుదారులకు కొంత నిరాశ కలిగించే అంశం.