Cars with ventilated seats : ఇండియాలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్న చౌకైన 5 కార్లు ఇవే..
భారతదేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా వెంటిలేటెడ్ సీట్లు ఉన్న కార్లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. రూ. 8.20 లక్షల ప్రారంభ ధరకే ఈ ప్రీమియం ఫీచర్‌ను అందిస్తున్న అత్యంత చౌకైన టాప్ 5 కార్ల వివరాలు ఇక్కడ చూద్దాము..
ఒకప్పుడు ఎండాకాలంలోనే ఎక్కువ వేడి ఉండేది. కానీ ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడకపోవడంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షా కాలంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇది వాహనదారులకు పెద్ద మైనస్‌గా మారింది. ఎండ తీవ్రత, చెమటతో ఎక్కువ దూరాలు నడపడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇప్పుడు వెంటిలేటెడ్ సీట్లు ఉన్న కార్లవైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? బడ్జెట్ ధరలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్న కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. వెంటిలేటెడ్ సీట్లు ఉన్న టాప్-5 చౌకైన కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి.

వెంటిలేటెడ్ సీట్లు ఉన్న చౌకైన కార్లు ఇవి..
1.టాటా ఏరిస్
సరికొత్త రూపంతో మార్కెట్లోకి అడుగుపెట్టిన 'టాటా ఏరిస్' వెంటిలేటెడ్ సీట్ల విభాగంలో సరికొత్త విప్లవాన్ని తెచ్చింది. ఇదివరకు ఉన్న టాటా టిగోర్‌ను పూర్తిగా ఆధునీకరించి, కొత్త పేరుతో టాటా మోటార్స్ దీనిని ప్రవేశపెట్టింది. రూ. 8.20 లక్షల ఆకర్షణీయమైన ప్రారంభ ధరతోనే ఈ కారులో వెంటిలేటెడ్ సీట్ల సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ ప్రీమియం ఫీచర్ టాటా ఏరిస్ అగ్రశ్రేణి ‘అకంప్లిష్డ్’ ట్రిమ్‌లోని నాలుగు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. వాటి ధరలు..
- టాటా ఏరిస్ అకంప్లీష్డ్ 1.2ఎల్ పెట్రోల్ ఎంటీ- రూ. 8.19లక్షలు
- అకంప్లీష్డ్ 1.2ఎల్ పెట్రోల్ ఏఎంటీ- రూ. 8.7 లక్షలు
- అకంప్లీష్డ్ 1.2ఎల్ పెట్రోల్- సీఎన్జీ ఎంటీ- రూ. 9.19లక్షలు
- అకంప్లీష్డ్ 1.2ఎల్ పెట్రోల్- సీఎన్జీ ఏఎంటీ- రూ. 9.74లక్షలు
2. రెనాల్ట్ కైగర్..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో వెంటిలేటెడ్ సీట్లు కలిగిన అత్యంత చౌకైన ఎస్‌యూవీగా రెనాల్ట్ కైగర్ గుర్తింపు పొందింది. రెనో సంస్థ తమ టాప్-ఎండ్ 'ఎమోషన్' వేరియంట్లో ఈ వెసులుబాటును కల్పించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులు మొత్తం ఆరు కాన్ఫిగరేషన్లలో ఈ ఫీచర్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. వీటి ధరలు రూ. 8.5లక్షల నుంచి రూ. 10.4లక్షల వరకు ఉంటాయి.
3. మారుతీ సుజుకీ బలెనో
ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ మార్పులతో వచ్చిన మారుతీ సుజుకీ బలెనో, వెంటిలేటెడ్ సీట్లు ఉన్న దేశంలోనే అత్యంత చౌకైన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. లీటరుకు గరిష్ఠంగా 24.77 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ కారు, వెంటిలేటెడ్ సీట్లు ఉన్న కార్లలో అత్యంత ఇంధన సమర్థవంతమైనదిగా నిలిచింది. ఈ ఫీచర్ ఉన్న బలెనో వేరియంట్ల ప్రారంభ ధర రూ. 9.10 లక్షల నుంచి రూ. 9.99లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఆల్ఫా, ఆల్ఫా (ఓ) ట్రిమ్‌లలోని నాలుగు విభిన్న కాన్ఫిగరేషన్లలో ఇది అందుబాటులో ఉంది.
4. మారుతి సుజుకీ బ్రెజ్జా..
ఇటీవల వచ్చిన ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌తో మారుతీ సుజుకీ బ్రెజా కూడా ఈ ప్రత్యేక సీట్ల జాబితాలో చేరింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విశేష ఆదరణ పొందిన ఈ వాహనం రేంజ్-టాపింగ్ 'జెడ్ఎక్స్ఐ+' ట్రిమ్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ను ఇచ్చారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.42 లక్షల నుంచి రూ. 13.7లక్షల వరకు ఉంటుంది.
4. సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్..
టాటా కర్వ్‌కు పోటీగా వచ్చిన సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్, మిడ్‌సైజ్ కార్ల విభాగంలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్న అత్యంత చౌకైన కారు. ఈ ఎస్‌యూవీ-కూపే టాప్-ఎండ్ 'మాక్స్' ట్రిమ్‌లో మాత్రమే ఈ వెసులుబాటును అమర్చారు. మూడు వేరియంట్లలో లభించే బసాల్ట్ ఎక్స్ ప్రారంభ ధర రూ. 11.34 లక్షలు (ఎక్స్-షోరూమ్). మూడు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఫీచర్ గరిష్ఠ ఎక్స్‌షోరూం ధర రూ. 13.89లక్షలు.
మరి వీటిల్లో మీరు ఏ వెంటిలేటెడ్ సీట్లు ఉన్న కారును కొంటున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


