Hyundai Exter facelift : 2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వేరియంట్లు- వాటి ధరలు..

2026 Hyundai Exter : హ్యుందాయ్ మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ 'ఎక్స్‌టర్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ 2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Mar 21, 2026, 10:40:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత మార్కెట్​లోని మైక్రో ఎస్‌యూవీ విభాగంలో తన పట్టును మరింత పెంచుకునేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది. సరికొత్త 2026 ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ డిజైన్, ఫీచర్లు, భద్రత పరంగా 25కు పైగా అప్‌డేట్స్‌తో వచ్చింది. ఇంజిన్ పరంగా పాత మోడల్ తరహాలోనే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్..
2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్..

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2026: వేరియంట్ వారీగా ధరల పట్టిక (ఎక్స్-షోరూమ్)

కొత్త ఎక్స్‌టర్ పెట్రోల్ (మాన్యువల్, ఏఎంటీ), సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది.

వేరియంట్ట్రాన్స్​మిషన్​ధర (ఎక్స్​షోరూం) రూ.
ఈఎక్స్​ఎంటీ5.79 లక్షలు
ఎస్​ఎంటీ6.23 లక్షలు
ఎస్​+ఎంటీ7.21 లక్షలు
ఎస్​ఎక్స్​ఎంటీ7.95 లక్షలు
ఎక్స్​ఎక్స్​ (ఓ)ఎంటీ8.35 లక్షలు
ఎస్​ఏఎంటీ6.90 లక్షలు
ఎస్​+ఏఎంటీ8.05 లక్షలు
ఎస్​ఎక్స్​ఏఎంటీ8.54 లక్షలు
ఎస్​ఎక్స్​ (ఓ)ఏఎంటీ9.07 లక్షలు
ఎస్​ఎక్స్​ (ఓ) కనెక్ట్​ఏఎంటీ9.41 లక్షలు

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​ సీఎన్జీ వేరియంట్ల ధరలు..

వేరియంట్ట్రాన్స్​మిషన్ధర (ఎక్స్​షోరూం) రూ.
ఈఎక్స్​ఎంటీ6.99 లక్షలు
ఎస్​ ఎంటీ7.43 లక్షలు
ఎస్​+ ఎంటీ8.26 లక్షలు
ఎస్​ఎక్స్​ ఎంటీ8.93 లక్షలు
ఎస్​ఎక్స్​ (ఓ)ఎంటీ9.40 లక్షలు

2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్​- డిజైన్ మార్పులు:

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​ బాహ్య రూపంలో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్‌ను చేర్చారు. ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ థీమ్, కొత్త సీట్ డిజైన్, మెటల్ పెడల్స్, 'డీ-కట్' స్టీరింగ్ వీల్‌తో క్యాబిన్ మరింత ప్రీమియంగా మారింది.

2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్​- అత్యాధునిక ఫీచర్లు:

సెగ్మెంట్-ఫస్ట్: ఇన్-బిల్ట్ డాష్‌క్యామ్ .

కనెక్టివిటీ: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు.

కంఫర్ట్​: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ డిస్‌ప్లే, వెనుక ప్రయాణికుల కోసం టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్.

సీఎన్జీ స్పెషల్: సీఎన్‌జీ వెర్షన్‌లో ఇప్పుడు 'డ్యూయల్ సిలిండర్' సెటప్ ఇచ్చారు. స్పేర్ టైర్‌ను కారు అడుగు భాగానికి మార్చడం వల్ల డిక్కీలో 225 లీటర్ల ఖాళీ స్థలం (బూట్​ స్పేస్​) లభిస్తుంది.

కలర్స్: గోల్డెన్ బ్రాంజ్, టైటానియం బ్లాక్ మ్యాట్ అనే రెండు కొత్త రంగులను పరిచయం చేశారు.

2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్​- భద్రత..

భద్రత విషయంలో హ్యుందాయ్ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్ ఎస్​యూవీ​ రాజీ పడలేదు. ఈ కారులో మొత్తం 45కు పైగా సేఫ్టీ ఫీచర్లు ఉండగా, అందులో 30 ఫీచర్లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఇచ్చారు.

6 ఎయిర్‌బ్యాగ్‌లు (అన్ని వేరియంట్లలో).

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ).

హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్​ఏసీ) వంటివి కొన్ని ఉదాహరణలు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More