...
...
Next Story

Kia Carens Clavis EV లో 2026 అప్‌డేట్- ఇప్పుడు సరికొత్త 6 సీటర్ వెర్షన్‌లో! ఫీచర్లు అదుర్స్..

Kia Carens Clavis EV : కియా కేరెన్స్ క్లావిస్​ ఈవీలో 2026 అప్‌డేట్​ని సంస్థ ప్రవేశపెట్టింది. ఇప్పుడు సరికొత్త 6 సీటర్ వెర్షన్‌లో కూడా ఈ ఎలక్ట్రిక్​ కారు రానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Mar 20, 2026, 05:29:35 IST
Advertisement

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కియా ఇండియా.. తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ 'కేరెన్స్ క్లావిస్ ఈవీ' (Carens Clavis EV)లో 2026 మోడల్ ఇయర్ అప్‌డేట్‌ను ఇటీవలే విడుదల చేసింది. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి మరింత సౌకర్యాన్ని అందించేలా, ఈ కొత్త వెర్షన్‌లో సరికొత్త సీటింగ్ ఆప్షన్లను, అత్యాధునిక ఫీచర్లను కియా జోడించింది.

కియా కేరెన్స్​ క్లావిస్​ ఈవీ- ధర, వేరియంట్లు..

కియా కేరెన్స్​ క్లావిస్ ఈవీలో 2026 అప్డేట్స్​..
కియా కేరెన్స్​ క్లావిస్ ఈవీలో 2026 అప్డేట్స్​..

ఈ అప్‌డేటెడ్ ఎలక్ట్రిక్ ఎంపీవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇప్పటివరకు కేవలం 7-సీటర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కారు, ఇప్పుడు రెండో వరుసలో 'కెప్టెన్ సీట్లు' కలిగిన 6-సీటర్ లేఅవుట్‌లో కూడా లభిస్తుంది.

కియా కేరెన్స్​ క్లావిస్​ ఈవీ- వేరియంట్ల వారీగా మార్పులు..

కొత్త 6-సీటర్ వెర్షన్ ఇప్పుడు HTX (E), HTX, HTX+, GTX, GTX+, X-Line వంటి ప్రధాన ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కోరుకునే వారి కోసం 7-సీటర్ ఆప్షన్‌ను హై-ఎండ్ వేరియంట్లయిన GTX, GTX+, X-Line లలో కొనసాగించారు.

బ్యాటరీ

సీటింగ్​

వేరియంట్

ధర రూ.

Standard Range
(42 kWh)

7-Seater

HTK+

1,799,000

HTX E

1,999,000

HTX

2,049,000

6-Seater

HTX E

1,999,000

HTX

2,049,000

Extended Range
(51.4 kWh)

7-Seater

HTX E ER

2,199,000

HTX ER

2,249,000

GTX*

2,299,000

HTX+ ER

2,449,000

GTX+

2,499,000

X-Line

2,499,000

6-Seater

HTX E ER

{{/usCountry}}

HTX ER

2,249,000

GTX*

2,299,000

HTX+ ER

2,449,000

GTX+

2,499,000

X-Line

2,499,000

అంతేకాకుండా, ఎక్స్‌టెండెడ్ రేంజ్ వేరియంట్లలో కియా కొత్తగా ‘GT-Line’, 'X-Line' ట్రిమ్స్‌ను ప్రవేశపెట్టింది.

GT-Line: ఇందులో కొత్త అలాయ్ వీల్స్, లైమ్ కలర్ బ్రేక్ కాలిపర్స్, మెటల్ పెడల్స్ వంటి స్పోర్టీ లుక్ ఇచ్చే మార్పులు చేశారు.

X-Line: ఇది ప్రత్యేకమైన 'డార్క్ గన్ మెటల్' ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్, అరోరా బ్లాక్ పెరల్ రంగుల్లో క్లాసీగా కనిపిస్తుంది.

కియా కేరెన్స్​ క్లావిస్​ ఈవీ- బ్యాటరీ, రేంజ్ సామర్థ్యం..

సాంకేతికంగా ఈ ఎలక్ట్రిక్​ కారులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది పాత మోడల్ తరహాలోనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది:

51.4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 490 కి.మీ (ఏఆర్​ఏఐ సర్టిఫైడ్) వరకు ప్రయాణించవచ్చు.

42 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ: ఇది దాదాపు 404 కి.మీ రేంజ్ ఇస్తుంది.

ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ 99 కేడబ్ల్యూ, 126 కేడబ్ల్యూ అవుట్‌పుట్ సామర్థ్యంతో 255 ఎన్​ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ద్వారా కేవలం 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.

అదిరిపోయే ఫీచర్లు.. పక్కా సేఫ్టీ!

2026 అప్‌డేట్‌లో భాగంగా కియా ఈ కారులో 'డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్'ను అదనంగా చేర్చింది. హై-ఎండ్ వేరియంట్లయిన GTX+ మరియు X-Line లలో 'డిజిటల్ కీ', బ్యాటరీ హీటర్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

వీటితో పాటు:

డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే సెటప్

85కు పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు

6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్)

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ)

హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ప్రమాణాలు ఇందులో ఉన్నాయి.

మొత్తానికి, లగ్జరీ, స్పేస్ కోరుకునే ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఈ 2026 కేరెన్స్ క్లావిస్ ఈవీ ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe