2026 రెనాల్ట్ డస్టర్ కొనాలా? టాటా సియెర్రా తీసుకోవాలా? ఏది బెస్ట్?
2026 రెనాల్ట్ డస్టర్ వర్సెస్ టాటా సియెర్రా.. దిగ్గజ కార్ల మధ్య అసలైన పోటీ! ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి? ఏది బెస్ట్? ఏది కొనాలి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
భారత రోడ్లపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రెండు ఐకానిక్ కార్లు ఇప్పుడు సరికొత్త హంగులతో మళ్లీ ప్రజలకు చేరువయ్యాయి. అప్పట్లో రారాజుగా వెలిగిన 'టాటా సియెర్రా' ఇప్పటికే డెలివరీలతో సందడి చేస్తుండగా, ఎంతో మందికి ఇష్టమైన ‘డస్టర్’కి సంబంధించిన ధరలను మార్చ్‌లో ప్రకటించి, ఏప్రిల్ 2026 నుంచి డెలివరీలను ప్రారంభించనుంది రెనాల్ట్ సంస్థ. ఈ రెండు కాంపాక్ట్ ఎస్‌యూవీల మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఈ పోలిక ద్వారా తెలుసుకోండి..

రెనాల్ట్ డస్టర్ వర్సెస్ టాటా సియెర్రా- డైమెన్షన్స్..
రెనాల్ట్ డస్టర్ పొడవులో స్వల్పంగా మెరుగ్గా ఉన్నప్పటికీ, మిగతా అన్ని విషయాల్లో టాటా సియెర్రానే పైచేయి సాధించింది.
| రెనాల్ట్ డస్టర్ వర్సెస్ టాటా సియెర్రా- డైమెన్షన్స్ | |||
|---|---|---|---|
| 2026 Renault Duster | Difference | Tata Sierra | |
| Length | 4,346 mm | 6 mm | 4,340 mm |
| Width | 1,815 mm | 26 mm | 1,841 mm |
| Height | 1,703 mm | 12 mm | 1,715 mm |
| Wheelbase | 2,657 mm | 73 mm | 2,730 mm |
| Boot space | 518-litres | 104 litres | 622-litres |
పొడవు: డస్టర్ (4346 ఎంఎం)- సియెర్రా కంటే 6 ఎంఎం ఎక్కువ.
వెడల్పు- ఎత్తు: టాటా సియెర్రా 26 ఎంఎం ఎక్కువ వెడల్పు, 12 ఎంఎం ఎక్కువ ఎత్తుతో మంచి రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది.
వీల్‌బేస్: సియెర్రా వీల్‌బేస్ (2730 ఎంఎం) డస్టర్ కంటే 73 ఎంఎం ఎక్కువ. దీనివల్ల లోపల కాలు పెట్టుకునే స్థలం (లెగ్‌రూమ్) ఎక్కువగా ఉంటుంది.
బూట్ స్పేస్: లగేజీ పెట్టుకోవడానికి సియెర్రాలో అదనంగా 104 లీటర్ల స్థలం (మొత్తం 622 లీటర్లు) అందుబాటులో ఉంది.
రెనాల్ట్ డస్టర్ వర్సెస్ టాటా సియెర్రా- ఇంజిన్, పవర్‌ట్రెయిన్..
సాంకేతికపరంగా ఈ రెండు ఎస్‌యూవీలు భిన్నమైన వ్యూహాలతో వస్తున్నాయి.
| రెనాల్ట్ డస్టర్ వర్సెస్ టాటా సియెర్రా- ఇంజిన్ | ||||||
|---|---|---|---|---|---|---|
| 2026 Renault Duster | Tata Sierra | |||||
| Engine | 1.0-litre turbo-petrol | 1.3-litre turbo-petrol + mild-hybrid | 1.8-litre naturally aspirated petrol + strong-hybrid | 1.5-litre naturally aspirated petrol | 1.5-litre turbo-petrol | 1.5-litre diesel |
| Transmission | 6-speed MT | 6-speed MT, 6-speed DCT | 8-speed DHT | 6-speed MT, 7-speed DCT | 6-speed AT | 6-speed MT, 6-speed AT |
| Power | 99 bhp | 160 bhp | TBA | 104 bhp | 158 bhp | 116 bhp |
| Torque | 160 Nm | 280 Nm | TBA | 145 Nm | 255 Nm | 260 Nm (MT), 280 Nm (AT) |
రెనాల్ట్ డస్టర్: ఇందులో డీజిల్ ఇంజిన్ లేదు. కానీ, మూడు పెట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’, 'మైల్డ్ హైబ్రిడ్' టెక్నాలజీతో ఇది వస్తోంది. మైలేజీ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
టాటా సియెర్రా: సియెర్రాలో కూడా మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి (పెట్రోల్, డీజిల్). అయితే, ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీ లేదు. డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వారికి సియెర్రానే ఏకైక ఛాయిస్.
ఒక్క మాటలో చెప్పాలంటే..
మీకు అదిరిపోయే మైలేజీ, హైబ్రిడ్ టెక్నాలజీ కావాలనుకుంటే రెనాల్ట్ డస్టర్ కోసం వేచి చూడొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా, క్యాబిన్‌లో ఎక్కువ స్థలం, పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్, ఇప్పటికే అందుబాటులో ఉన్న కారు కావాలంటే టాటా సియెర్రా బెస్ట్ ఛాయిస్ అవుతుందని అంటున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


