2026 Tata Tiago EV : కొత్త టియాగో ఈవీకి పాత మోడల్‌కి తేడా ఏంటి? ఇవి తెలుసుకోండి..
2026 Tata Tiago EV vs old : పట్టణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీగా పేరు తెచ్చుకున్న టాటా టాయాగో ఈవీ.. ఇప్పుడు మరికొన్ని అధునాతన అప్‌గ్రేడ్స్‌తో ప్రజల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌కి పాత మోడల్‌కి మధ్య ఉన్న వ్యత్యాసాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారతదేశంలో అత్యంత సరసమైన ధరలో లభించే పాపులర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ‘టాటా టియాగో ఈవీ’ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ మే 28న జరగనున్న అధికారిక లాంచ్‌కు ముందే టాటా మోటార్స్ ఈ కారుకు సంబంధించిన పెట్రోల్, ఈవీ వెర్షన్ల టీజర్ వీడియోలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2026 టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్ మరింత షార్ప్‌గా, క్యాబిన్ లోపల అత్యంత ప్రీమియం ఫీచర్లతో ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ కారు కొనేముందు తెలుసుకోవాల్సిన ఆ 6 ముఖ్యమైన మార్పుల వివరాలు ఇవే!

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త 2026 టాటా టియాగో ఈవీలో వచ్చిన టాప్ 6 ప్రధాన మార్పులు..
1. సరికొత్త ఫ్రంట్ ఫేసియా..
కొత్త టియాగో ఈవీలో వచ్చిన అతిపెద్ద మార్పు కారు ముందు భాగంలోనే కనిపిస్తుంది. ఇది మునుపటి కంటే చాలా క్లీన్, మోడ్రన్ లుక్‌ను కలిగి ఉంది.
ఈ ఎలక్ట్రిక్ కారులో ఇందులో బాడీ కలర్డ్ క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ అందించారు.
మునుపటి కంటే సన్నగా ఉండే సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, వాటితో పాటు ఐబ్రో-షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్ కారుకు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. బంపర్‌ను కూడా వర్టికల్ స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో రీడిజైన్ చేశారు.
2. సైడ్, రేర్ ప్రొఫైల్‌లో మార్పులు..
కారు పక్క భాగం, వెనుక భాగంలో కూడా సూక్ష్మమైన, ఆకర్షణీయమైన మార్పులు చేశారు.
సైడ్ ప్రొఫైల్: కొత్త డిజైన్ ఉన్న అల్లాయ్ వీల్స్, బ్లాక్ వీల్ ఆర్చ్ సరౌండ్స్ (టియాగో ఎన్ఆర్జీ లాగా), గ్లోస్-బ్లాక్ ఓఆర్వీఎంలు, షార్క్-ఫిన్ యాంటెన్నా, డోర్లపై ప్రత్యేకమైన 'Tata.ev' బ్రాండింగ్ ఇచ్చారు.
వెనుక ప్రొఫైల్: వెనుక వైపు వర్టికల్ లైట్ ఎలిమెంట్స్ ఉన్న రీడిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. టెయిల్‌గేట్ అంతటా విస్తరించి ఉండే దట్టమైన గ్లోస్-బ్లాక్ కనెక్టెడ్ స్ట్రిప్, స్పోర్టీ బంపర్ కారుకు సరికొత్త రూపాన్ని తెచ్చాయి.
3. ప్రీమియం ఇంటీరియర్ క్యాబిన్..
టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం ఇప్పుడు మరింత విలాసవంతంగా మారింది. ఇది పాత బ్లాక్-గ్రే డ్యూయల్-టోన్ థీమ్‌ను కొనసాగించినప్పటికీ, ఎగ్జిక్యూషన్ మరింత సాఫ్ట్, లగ్జరీగా ఉంది. డ్యాష్‌బోర్డ్ పైభాగంలో ప్రీమియం ఫ్యాబ్రిక్ ర్యాప్ చేయడం వల్ల కారు లోపల రిచ్ ఫీల్ వస్తుంది.
4. డ్యూయల్ ఫ్లోటింగ్ స్క్రీన్స్..
టెక్నాలజీ పరంగా కారులో రెండు పెద్ద స్క్రీన్లను అమర్చారు:
మొదటిది 10.25-ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కాగా, రెండోది డ్రైవర్ కోసం ప్రత్యేక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.
ఈ ఫ్లోటింగ్ డిజైన్ వల్ల సెంటర్ కన్సోల్ కింద వైర్‌లెస్ ఛార్జింగ్ ట్రేలు, ఛార్జింగ్ పోర్టులు అమర్చడానికి ఎక్కువ స్పేస్ దొరికింది. అలాగే, స్టీరింగ్ వీల్‌పై పాత లోగో స్థానంలో వెలిగే 'Tata.ev' ఇల్యూమినేటెడ్ లోగోను చేర్చారు.
5. ఫ్యాబ్రిక్ అప్‌హోలిస్ట్రీ అండ్ రియర్ ఏసీ వెంట్స్..
సీట్లు: పాత మోడల్ టాప్ వేరియంట్లలో లెథరెట్ సీట్లు ఉండగా, కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో క్యాబిన్ అంతటా తేలికపాటి డ్యూయల్-టోన్ ఫ్యాబ్రిక్ సీట్లను ఉపయోగించారు.
కంఫర్ట్: వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రియర్ ఏసీ వెంట్స్, మొబైల్ ఛార్జింగ్ పోర్టులను కొత్తగా జోడించారు.
6. 360-డిగ్రీ కెమెరా (సెగ్మెంట్ ఫస్ట్ సేఫ్టీ)
డ్రైవింగ్ సులువుగా చేయడానికి, సేఫ్టీ పెంచడానికి కొత్త టియాగో ఈవీలో 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌ను అందించారు. భారతదేశంలో ఈ బడ్జెట్ ధరలో 360-డిగ్రీ కెమెరాతో వస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా టియాగో ఈవీ నిలవనుంది.
మార్కెట్లో ఉన్న మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఎంజీ కామెట్ ఈవీ వంటి కార్లకు ఈ సరికొత్త ఫీచర్లతో టాటా టియాగో ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది. మే 28న దీని ధరలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


