...
...
Next Story

Goa : గోవా నైట్​క్లబ్​లో ఘోర అగ్నిప్రమాదం- 23 మంది మృతి!

గోవాలోని ఓ రెస్టారెంట్​-కమ్​- నైట్​క్లబ్​లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23 మంది మృతి! వీరిలో చాలా వరకు క్లబ్​లోని కిచెన్​ స్టాఫ్​ ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురు, నలుగురు పర్యాటకులు సైతం ప్రాణాలు కోల్పోయారు.

Published on: Dec 7, 2025, 05:34:50 IST
Advertisement

పర్యాటకుల డిసెంబర్​ డెస్టినేషన్​ అయిన గోవాలో అత్యంత ఘోర, విషాదకర సంఘటన చోటుచేసుకుంది! అర్పోరాలోని ఓ రెస్టారెంట్​-కమ్​- నైట్​క్లబ్​లో శనివారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

గోవా రెస్టారెంట్​లో ఘోర అగ్నిప్రమాదం (Pixabay)
గోవా రెస్టారెంట్​లో ఘోర అగ్నిప్రమాదం (Pixabay)

మృతి చెందిన 23 మందిలో ముగ్గురు తీవ్రమైన కాలిన గాయాల కారణంగా చనిపోగా, మిగిలిన వారంతా ఊపిరాడక మరణించారు. మృతుల్లో చాలా మంది క్లబ్​కి చెందిన కిచెన్​ స్టాఫ్​ ఉన్నారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని, కాగా మరో ముగ్గురు, నలుగురు పర్యాటకులు కూడా ఉన్నారు.

గోవాల అగ్నిప్రమాదానికి కారణం ఏంటి?

గోవా రాజధాని పణాజీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్పోరా గ్రామంలో ఈ క్లబ్ గత ఏడాదే ప్రారంభమైంది. అయితే, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బిర్చ్ బై రోమియో లేన్ అనే ఈ ప్రముఖ పార్టీ వేదికలో మంటలు చెలరేగాయి.

అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్​ని కొనసాగించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు రాత్రంతా శ్రమించారు.

ఈ అగ్నిప్రమాదం సిలిండర్ పేలుడు కారణంగా జరిగిందని గోవా పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ తెలిపారు.

"ఆర్పోరాలోని ఒక రెస్టారెంట్-కమ్-క్లబ్‌లో దురదృష్టకర సంఘటన జరిగింది. సరిగ్గా 12.04కు కంట్రోల్ రూమ్‌కి మంటల గురించి సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులను, ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపించాము," అని డీజీపీ వివరించారు.

గోవా సీఎం ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు.

అగ్నిమాపక భద్రతా నిబంధనలను ఈ నైట్‌క్లబ్ పాటించలేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

"పర్యాటక ప్రాంతమైన గోవాలో పర్యాటక సీజన్ ఊపందుకున్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మేము దీనిపై సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం," అని ఆయన పునరుద్ఘాటించారు.

"23 మృతదేహాలను క్లబ్ ప్రాంగణం నుంచి వెలికితీసి, బంబోలిమ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించాము," అని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో వెల్లడించారు.

ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, గోవాలోని అన్ని క్లబ్‌లలో అగ్నిమాపక భద్రతా ఆడిట్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే లోబో తెలిపారు. అవసరమైతే అనుమతులు లేని క్లబ్‌ల లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే లోబో స్పష్టం చేశారు.

ఈ సోమవారం రోజున కలంగూట్ పంచాయితీ అన్ని నైట్‌క్లబ్‌లకు నోటీసులు జారీ చేయనుంది. అగ్నిమాపక భద్రతకు సంబంధించిన అనుమతులను సమర్పించాల్సిందిగా ఆ నోటీసులలో కోరనున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks