...
...
Next Story

Electric Cars : త్వరలో మార్కెట్‌లోకి రానున్న 500 కిలో మీటర్ల రేంజ్ ఇచ్చే 3 ఎలక్ట్రిక్ కార్లు!

Electric Cars : మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 3 ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. 500 కిలోమీటర్ల రేంజ్‌లో వీటిని కంపెనీలు తీసుకురానున్నాయ్.

Published on: Jul 20, 2026, 19:47:47 IST
Advertisement

భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల పట్ల క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. దీనితో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజాలు రాబోయే కొద్ది నెలల్లో తమ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూడు కార్లు వివిధ విభాగాల కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తయారు అవుతున్నాయి. ఈ మోడళ్లు చిన్న కాంపాక్ట్ సైజుల నుండి పెద్ద 7-సీటర్ ఫ్యామిలీ వాహనాల వరకు ఉంటాయి. రాబోయే ఈ మూడు ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి

మారుతి సుజుకి భారత మార్కెట్లో కొత్త మూడు-వరుసల ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ కోసం పనిచేస్తోంది. ఈ వాహనం కంపెనీ రాబోయే 'వైఎంసి' ప్లాట్ ఫామ్ ఆధారంగా ఉంటుంది. ఇందులో వినియోగదారులు 49 kWh, 61 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను పొందవచ్చు. మార్కెట్లో విడుదలైన తరువాత ఇది నేరుగా కియా కారెన్స్ క్లెవిస్ ఈవీతో పోటీ పడనుంది. మారుతి దీని ధర రూ .18 లక్షల నుండి రూ .21 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

హ్యుందాయ్ ఇండియా

హ్యుందాయ్ ఇండియా తన ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియోను బలోపేతం చేయడానికి కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై పనిచేస్తోంది. ఈ కారు సబ్ -4 మీటర్ల విభాగంలో వస్తుంది. ధర పరంగా క్రెటా ఎలక్ట్రిక్ కంటే దిగువన ఉంటుంది. రాబోయే కియా సైరోస్ ఈవీ ప్లాట్ ఫామ్, బ్యాటరీ ప్యాక్‌ను ఇది పంచుకోవచ్చని ఊహాగానాలు జరుగుతున్నాయి. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించనుంది. ఇది భారతదేశంలో హ్యుందాయ్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా మారవచ్చు.

టాటా మోటర్స్

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe