...
...
Next Story

Mahindra SUVs : మహీంద్రా నుంచి ఎస్​యూవీల ధమాకా! లాంచ్​కి రెడీ అవుతున్న 4 కార్లు ఇవే..

భారత మార్కెట్లో తన దూకుడును కొనసాగించేందుకు మహీంద్రా సిద్ధమైంది. అప్‌డేటెడ్ థార్‌తో పాటు సరికొత్త ఎలక్ట్రిక్, ఐసీఈ ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. వాటిపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Aug 22, 2026, 12:20:25 IST
Advertisement

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తిరుగులేని ఆధీనంలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా.. రాబోయే నెలల్లో వరుస ఎస్‌యూవీ లాంచ్​లతో దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ జరుగుతున్న వాహనాలు, కాన్సెప్ట్ మోడల్స్ చూస్తుంటే కంపెనీ వ్యూహం ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. అప్‌డేటెడ్ ఫీచర్లతో త్రీ-డోర్ థార్ మొదలుకొని అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్ల వరకు మహీంద్రా ప్రణాళికలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాము..

త్రీ-డోర్ థార్‌కి మేజర్ అప్‌డేట్..

మహీంద్రా కొత్త కార్లు ఇవే..
మహీంద్రా కొత్త కార్లు ఇవే..

ప్రస్తుతం ఉన్న త్రీ-డోర్ మహీంద్రా థార్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి తొలిసారిగా భారీ అప్‌డేట్ రాబోతోంది. 'థార్ రాక్స్' స్ఫూర్తితో దీని డిజైన్‌లో మార్పులు చేస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ముందు భాగంలో కొత్త లైటింగ్, రీ-డిజైన్ చేసిన బంపర్ ఉండనున్నాయి. ఇక క్యాబిన్ లోపల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 5 డోర్ల ఎస్‌యూవీలో ఉన్న మరికొన్ని అధునాతన ఫీచర్లు ఇందులో చోటుచేసుకోనున్నాయి.

ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, స్కార్పియో ఎన్ మధ్యలో విజన్ ఎస్..

మహీంద్రా మరో కాంపిటేటివ్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. 'విజన్ ఎస్' ఆధారంగా తయారవుతున్న ఈ కొత్త ఎస్‌యూవీ 2027 ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది. కంపెనీ లైనప్‌లో ఇది ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, స్కార్పియో ఎన్ మధ్యలో నిలవనుంది. న్యూ-ఐక్యూ (NU_IQ) ఆర్కిటెక్చర్​పై రూపుదిద్దుకుంటున్న ఈ కారులో, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో ఉన్న టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల ఆప్షన్లే లభించే అవకాశం ఉంది.

విజన్​ ఎస్​కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ శ్రేణిలో 'బీఈ 07'..

2027 నాటికి ప్రీమియం ఎలక్ట్రిక్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎస్‌యూవీని లాంచ్ చేయాలని మహీంద్రా ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత 'విజన్ టీ' కన్సెప్ట్ ఆధారంగా మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రానుంది. బాక్సీ డిజైన్‌తో ఆఫ్-రోడింగ్ ప్రియులను ఆకట్టుకునేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. థార్ రాక్స్ డిజైన్ ఎలిమెంట్స్ దీనికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ మోడల్స్ అన్నీ కూడా వేర్వేరు కస్టమర్లను టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి వస్తుండటంతో, ఆటోమొబైల్ ప్రియులకు రాబోయే రోజుల్లో నిజంగానే మంచి ట్రీట్ దక్కనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe