ప్రభుత్వాధినేతలు, ప్రజాప్రతినిధులు ప్రజలు ఇచ్చే పన్నుల సొమ్ముకు జవాబుదారీగా ఉండాలనేది ప్రజాస్వామ్య సూత్రం. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు తమ సౌందర్య పోషణకు, అలంకరణకు పెట్టిన ఖర్చులు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 2019 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు.. అంటే దాదాపు ఏడేళ్ల కాలంలో ప్రధానుల హెయిర్ స్టైలింగ్, మేకప్, అధికారిక ప్రాతినిధ్య ఖర్చుల కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏకంగా 4,70,000 డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 4.49 కోట్లు) వెచ్చించింది. ఇందులో ఏకంగా 90 శాతానికి పైగా నిధులు ఒక్క నెతన్యాహు దంపతుల కోసమే ఖర్చవడం గమనార్హం.
కోర్టు మెట్లు ఎక్కితే తప్ప బయటపడని నిజాలు!

సమాచార హక్కు ఉద్యమ సంస్థ తరఫున న్యాయవాది యారా వింక్లర్ షాలిట్ 2025 డిసెంబర్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగాక, ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఈ సంచలన గణాంకాలను విడుదల చేసింది. ప్రజాధనం ఖర్చుపై ప్రభుత్వం తరచూ పారదర్శకత లోపిస్తోందని, కోర్టు దావాలు వేస్తే తప్ప నిజాలు వెల్లడించడం లేదని ఆ సంస్థ సీఈవో హిద్దాయ్ నెగెవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజల సొమ్మును తమ సొంత ఆస్తిలా భావించకూడదని ఆయన అన్నారు.
యుద్ధం జరుగుతున్నా తగ్గని మేకప్ పిచ్చి!
ఈ నివేదికలోని లెక్కలు ఇజ్రాయెల్ ప్రజలను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2022లో నఫ్తాలి బెన్నెట్, యాకిర్ లాపిడ్ ప్రధానులుగా ఉన్నప్పుడు ఏడాది మొత్తం మీద హెయిర్, మేకప్ ఖర్చు 84,000 షెకెళ్లు (సుమారు రూ. 26.34 లక్షలు) మాత్రమే ఉండేది. కానీ 2023లో నెతన్యాహు తిరిగి అధికారంలోకి రాగానే ఇది ఒక్కసారిగా 3,11,000 షెకెళ్లకు (రూ. 97.52 లక్షలు) చేరింది. ఇక 2025 నాటికి ఈ ఖర్చు అత్యధికంగా 1.11 లక్షల డాలర్లకు (రూ. 1.06 కోట్లు) చేరింది.
2023 అక్టోబర్‌లో గాజా యుద్ధం తీవ్రస్థాయిలో ప్రారంభమైన సమయంలోనూ ప్రధాని తన అలంకరణను పక్కన పెట్టలేదు. 2023 సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య నెతన్యాహు హెయిర్ స్టైలింగ్ కోసం 2,600 డాలర్లు (రూ. 2.48 లక్షలు), మేకప్ కోసం 1,580 డాలర్లు (రూ. 1.51 లక్షలు) ఖర్చు చేశారు. ఒక్క అక్టోబర్ నెలలోనే జుట్టు దువ్వుకోవడానికి రూ. 77,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి.
విదేశీ పర్యటనల్లోనూ విలాసాలు..
{{/usCountry}}2023 అక్టోబర్‌లో గాజా యుద్ధం తీవ్రస్థాయిలో ప్రారంభమైన సమయంలోనూ ప్రధాని తన అలంకరణను పక్కన పెట్టలేదు. 2023 సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య నెతన్యాహు హెయిర్ స్టైలింగ్ కోసం 2,600 డాలర్లు (రూ. 2.48 లక్షలు), మేకప్ కోసం 1,580 డాలర్లు (రూ. 1.51 లక్షలు) ఖర్చు చేశారు. ఒక్క అక్టోబర్ నెలలోనే జుట్టు దువ్వుకోవడానికి రూ. 77,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి.
విదేశీ పర్యటనల్లోనూ విలాసాలు..
{{/usCountry}}దేశీయంగానే కాకుండా విదేశీ పర్యటనల్లోనూ ఈ దంపతుల అలంకరణ ఖర్చులు తారాస్థాయికి చేరాయి. 2025 ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో జరిగిన 4 రోజుల పర్యటనలో ప్రధాని దంపతుల హెయిర్, మేకప్‌కే ఏకంగా 13,500 డాలర్లు (సుమారు రూ. 12.9 లక్షలు) ఖర్చయ్యాయి. అంతకుముందు 2024 జూలై వాషింగ్టన్ పర్యటనలోనూ 11,500 డాలర్లు (రూ. 10.99 లక్షలు) వెచ్చించారు.
అలాగే అధికారిక దుస్తులు, వేడుకల నిర్వహణ పేరుతో నెతన్యాహు రూ. 1.28 కోట్లు ఖర్చు చేయగా, నఫ్తాలి బెన్నెట్ రూ. 18.15 లక్షలు, యాకిర్ లాపిడ్ రూ. 2.48 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. అయితే ప్రధానికి సేవలు అందించిన హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టుల పేర్లను మాత్రం 'దేశ భద్రత' కారణాల దృష్ట్యా ప్రభుత్వం బయటపెట్టలేదు.
ప్రపంచవ్యాప్తంగా నాయకుల విలాసాలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని ఖర్చుల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.