ఈ స్మార్ట్​ఫోన్స్..​ ఐఫోన్​ 17కి ప్రత్యామ్నాయం- ధర మాత్రం చాలా తక్కువ

యాపిల్ ఐఫోన్ 17కి సరసమైన ప్రత్యామ్నాయాలు తెలుసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 20, 2025, 10:30:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత నెలలో యాపిల్ సంస్థ ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. పాత మోడల్స్‌తో పోలిస్తే ఇందులో గణనీయమైన పర్ఫార్మెన్స్​, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లను ఆవిష్కరించింది. శక్తివంతమైన చిప్‌సెట్, 120హెచ్​జెడ్​ డిస్‌ప్లే, రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో ఐఫోన్ 17 ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, అటువంటి అనుభవాన్ని అందించే అనేక ఇతర ఫోన్‌లు, చాలా తక్కువ ధరకే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి! మీరు ఒక నిర్దిష్ట బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, మంచి పనితీరు, మంచి కెమెరా క్వాలిటీ, ఎక్కువసేపు ఉండే బ్యాటరీని కోరుకునే ఆల్-రౌండర్ స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, యాపిల్ ఐఫోన్ 17కు బదులుగా మీరు కొనుగోలు చేయదగిన 5 సరసమైన గ్యాడ్జెట్స్​ జాబితాను మేము ఇక్కడ అందిస్తున్నాము.

ఐఫోన్​ 17కి ఇవి ప్రత్యామ్నాయం.. (Ayushmann Chawla)
ఐఫోన్​ 17కి ఇవి ప్రత్యామ్నాయం.. (Ayushmann Chawla)

ఐఫోన్ 17కు చవకైన ప్రత్యామ్నాయాలు..

వన్​ప్లస్ 13ఎస్- ఈ స్మార్ట్​ఫోన్‌ను చాలా మంది కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్​గా పరిగణిస్తారు. ఇది శక్తివంతమైన ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలతో వస్తుంది. వన్​ప్లస్ 13ఎస్ పనితీరు కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. స్క్రీన్ సైజ్ కేవలం 6.32 ఇంచ్​ ఉన్నప్పటికీ, ఇది డ్యూయెల్ 50ఎంపీ కెమెరా, 5860ఎంఏహెచ్​ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 51వేల వరకు ఉంది.

2. గూగుల్ పిక్సెల్ 9ఏ- పరిగణించదగిన మరో సరసమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్​ ఈ గూగుల్ పిక్సెల్ 9ఏ. ఇది కెమెరా బంప్ లేని కొత్త డిజైన్‌తో వస్తుంది. ఇందులో టెన్సార్ జీ4 చిప్‌ను అమర్చారు. ఇది అత్యంత వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్‌లో 48ఎంపీ మెయిన్ కెమెరా ,13ఎంపీ రేర్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అదనంగా, ఇది శక్తివంతమైన 5100ఎంఏహెచ్​ బ్యాటరీని కూడా అందిస్తుంది. అమెజాన్​లో ధర రూ. 41,550గా ఉంది.

3. ఒప్పో రెనో 14 ప్రో- మంచి ఆల్-రౌండ్ పనితీరును అందించడంలో ఒప్పో రెనో 14 ప్రో ముందుంది. అయితే, ఇది ప్రధానంగా దాని అద్భుతమైన కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలకు పేరుపడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్ ఉంది. దీనికి 6200ఎంఏహెచ్​ బ్యాటరీ మద్దతు ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఇది ట్రిపుల్ 50ఎంపీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్లిప్​కార్ట్​లో ధర రూ. 54,999గా ఉంది.

4. నథింగ్ ఫోన్ 3ఏ ప్రో- ఐఫోన్ 17కి ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేయదగిన మరో ఫోన్ ఈ నథింగ్ ఫోన్ 3ఏ ప్రో. ఇది ప్రత్యేకమైన డిజైన్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్​ 3 ప్రాసెసర్ శక్తినిస్తుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముఖ్యంగా 3ఎక్స్​ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండటం విశేషం. ఫ్లిప్​కార్ట్​లో దీని ధర రూ. 29,999గా ఉంది.

5. వివో ఎక్స్​200 ఎఫ్ఈ- ఈ జాబితాలో చివరిగా ఉన్న స్మార్ట్​ఫోన్​ వివో X200 ఎఫ్ఈ. ఇది 12జీబీ ర్యామ్‌తో జత చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ వివరాలతో కూడిన చిత్రాలను తీయడంతో పాటు ఏఐ-ఆధారిత కెమెరా ఫీచర్లను అందిస్తుంది. అంతేకాకుండా, 6500ఎంఏహెచ్​ బ్యాటరీతో ఇది మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అమెజాన్​లో ఈ గ్యాడ్జెట్​ ధర రూ. 54,998గా ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More