ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మన త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. వియత్నాం రాజధాని హనోయ్‌లో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహించిన 19వ 'ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్' (ఐఓఏఏ) పోటీల్లో భారత బృందం చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. పోటీల్లో పాల్గొన్న ఐదుగురు విద్యార్థులూ పతకాలు సాధించి నూటికి నూరు శాతం విజయశాతాన్ని నమోదు చేశారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో భారత్ ఓవరాల్ పతకాల పట్టికలో ఆతిథ్య వియత్నాంతో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచింది. ఐదేసి స్వర్ణ పతకాలతో ఇరాన్, దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలిచాయి.

ఈ ఘనతలో మన భాగ్యనగర కుర్రాడు ప్రాంజల్ దీక్షిత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హైదరాబాద్‌కి చెందిన ప్రాంజల్ దీక్షిత్ ఖగోళ విజ్ఞానంలో అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి స్వర్ణ పతకం అందించి తెలుగు నేల గర్వపడేలా చేశాడు. ప్రాంజల్‌తో పాటు దిల్లీకి చెందిన సుమంత్ గుప్తా, గుర్గావ్‌కు చెందిన అక్షత్ శ్రీవాస్తవ, ఫరీదాబాద్‌కు చెందిన ఆర్నవ్ సెహ్రావత్ పసిడి పతకాలు కైవసం చేసుకోగా.. వడోదరకు చెందిన హర్షిల్ అమిత్‌కుమార్ పటేల్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.
చరిత్రలోనే అతిపెద్ద ఒలింపియాడ్..!
ఒలింపియాడ్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ పోటీగా నిలిచింది! ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల నుంచి 307 మంది విద్యార్థులు ఈ అంతర్జాతీయ వేదికపై పోటీపడ్డారు. కేవలం సిద్ధాంతపరమైన (థియరీ) ప్రశ్నలకే పరిమితం కాకుండా అభ్యర్థుల ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పరీక్షించేలా ప్రతిభా పరీక్ష సాగింది. మొత్తం మార్కుల్లో థియరీకి 50 శాతం వెయిటేజ్ ఇస్తే, అబ్జర్వేషన్ (ఖగోళ పరిశీలన)కు 25 శాతం, డేటా అనాలిసిస్‌కు 25 శాతం కేటాయించారు. ఖగోళ సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించే సామర్థ్యం ఉన్నవారే ఇక్కడ విజయం సాధించారు.
భారత బృందానికి ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ప్రొఫెసర్ భాస్వతి ముఖర్జీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ సంవేద్ కోలేకర్ మార్గదర్శకత్వం వహించారు. ఐఓఏఏ ప్రస్తుత అధ్యక్షుడు, హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రతినిధి ప్రొఫెసర్ అనికేత్ సూలే కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
సైన్స్ ఒలింపియాడ్స్‌లో భారత్ జైత్రయాత్ర..
ఈ ఏడాది భారత సైన్స్ బృందాలు అంతర్జాతీయ వేదికలపై ప్రభంజనం సృష్టించాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ విభాగాల్లో అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో పాల్గొన్న ప్రతి ఒక్క భారతీయ విద్యార్థి స్వర్ణం లేదా రజత పతకాన్ని గెలుచుకోవడం విశేషం! ఈ ఐదు విభాగాల్లో మొత్తం 24 మంది పోటీపడగా.. 16 మంది స్వర్ణాలు, 8 మంది రజత పతకాలు సాధించారు.
{{/usCountry}}ఈ ఏడాది భారత సైన్స్ బృందాలు అంతర్జాతీయ వేదికలపై ప్రభంజనం సృష్టించాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ విభాగాల్లో అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో పాల్గొన్న ప్రతి ఒక్క భారతీయ విద్యార్థి స్వర్ణం లేదా రజత పతకాన్ని గెలుచుకోవడం విశేషం! ఈ ఐదు విభాగాల్లో మొత్తం 24 మంది పోటీపడగా.. 16 మంది స్వర్ణాలు, 8 మంది రజత పతకాలు సాధించారు.
{{/usCountry}}1999 నుంచి ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లలో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు పాల్గొన్న భారతీయ విద్యార్థుల్లో 49 శాతం మంది స్వర్ణాలు, 35 శాతం మంది రజతాలు, 13 శాతం మంది కాంస్య పతకాలు సాధించారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఆస్ట్రానమీ పోటీలకు వెళ్లిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా స్వర్ణం లేదా రజతం సాధించారు. వారిలో 64 శాతం మంది ఏకంగా పసిడి పతకాలనే ముద్దాడటం మనదేశ విద్యా ప్రమాణాలకు అద్దం పడుతోంది.