...
...
Next Story

ఒక్క ఓటీపీతో మీ ఖాతా ఖాళీ! క్రెడిట్ కార్డు మోసాలకు ఇలా దూరంగా ఉండండి..

ఇటీవలి కాలంలో ఆర్థిక మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా క్రెడిట్​ కార్డు చుట్టూ అనేక ఫ్రాడ్స్​ జరుగుతున్నాయి. వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ఎలా? ముఖ్యమైన టిప్స్​ని ఇక్కడ తెలుసుకుని జాగ్రత్తపడండి..

Published on: Oct 18, 2025, 11:20:03 IST
Advertisement

క్రెడిట్ కార్డును ఉపయోగించడం మనలో చాలా మంది రోజువారీ ఖర్చుల అలవాటులో భాగమైంది. అయితే మనం ఈ కార్డులను అతిగా, అజాగ్రత్తగా ఉపయోగించడం మొదలుపెడితే, క్రెడిట్ కార్డు మోసాలకు బాధితులుగా మారే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, ఎవరైనా మీకు వచ్చిన ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్)ని ఏదో ఒక నమ్మదగిన సాకు చెప్పి అడిగితే, మీరు దాన్ని పంచుకుంటే – అప్పుడు మీరు ఖచ్చితంగా మోసానికి గురైనట్లే.

క్రెడిట్​ కార్డు వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి..
క్రెడిట్​ కార్డు వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి..

క్రెడిట్ కార్డు మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను ఇక్కడ తెలుసుకోండి..

క్రెడిట్​ కార్డు మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే చిట్కాలు..

1. మీ ఓటీపీని ఎప్పుడూ షేర్ చేయవద్దు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ, కొంతమంది కార్డు వినియోగదారులు ఇప్పటికీ ఈ వలలో చిక్కుకుంటున్నారు! ఫోన్ చేసిన వ్యక్తి మిమ్మల్ని నమ్మించి ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) చెప్పేలా ఒప్పిస్తాడు. తమను తాము బ్యాంక్ ఉద్యోగులుగా పరిచయం చేసుకున్న వ్యక్తులు కార్డుదారులను ఒప్పించి, ఫోన్ కాల్ ద్వారా ఓటీపీలను రాబట్టిన కేసులు చాలా ఉన్నాయి.

గుర్తుంచుకోండి: బ్యాంకు ఉద్యోగులు కూడా ఎప్పుడూ ఓటీపీలను అడగకూడదు. అడగరు.

2. క్రెడిట్ కార్డు వివరాల గోప్యత

కార్డుదారులు తమ క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ముఖ్యంగా కార్డుపై ఉండే గడువు తేదీ (డేట్​ ఆఫ్​ ఎక్స్​పైరీ, సీవీవీ నంబర్‌ను ఎప్పుడూ చెప్పకూడదు. ఈ వివరాలు చాలా సున్నితమైనవి.

3. కస్టమర్ కేర్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి

కొన్నిసార్లు, తమను తాము బ్యాంక్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లుగా చెప్పుకునే వ్యక్తుల నుంచి మీకు కాల్ వస్తుంది. ఇటీవల, గురుగ్రామ్‌లో ఒక కాల్ సెంటర్‌ను నడుపుతున్న మోసగాళ్ల బృందం, 350 మంది ఎస్బీఐ కస్టమర్ల నుంచి రూ. 2.6 కోట్లు కాజేసిన పెద్ద క్రెడిట్ కార్డు మోసం వెలుగులోకి వచ్చింది!

4. అనుమానం వస్తే వెంటనే చర్య తీసుకోవాలి

మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపించిన వెంటనే, మీరు తక్షణమే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. ఆలస్యం చేయకుండా వెంటనే మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాలి. తద్వారా తదుపరి నష్టాన్ని నివారించవచ్చు.

ఈ టిప్స్​ పాటించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఆర్థికంగా సురక్షితంగా ఉండండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks