...
...
Next Story

మీ వాట్సాప్ సేఫ్​గా ఉందా? అకౌంట్‌ని కాపాడుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా 'ఘోస్ట్ పెయిరింగ్' వంటి కొత్త రకం స్కామ్స్ పెరుగుతున్నాయి. మీ వ్యక్తిగత చాట్స్, ఫోన్ నంబర్, ప్రొఫైల్ ఫోటోలు ఇతరుల చేతికి చిక్కకుండా ఉండాలంటే ఈ 8 కీలక సెక్యూరిటీ ఫీచర్లను వెంటనే ఎనేబుల్ చేసుకోండి..

Published on: Jan 05, 2026 04:02 PM IST
Advertisement

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్న వాట్సాప్ ఇప్పుడు హ్యాకర్లకు మెయిన్ టార్గెట్‌గా మారింది. ముఖ్యంగా 'ఘోస్ట్ పెయిరింగ్' వంటి కొత్త పద్ధతుల ద్వారా యూజర్ల అకౌంట్లను హ్యాకర్లు తమ బ్రౌజర్‌లకు లింక్ చేసుకుంటూ, స్కామ్​లకు పాల్పడుతున్నారని తాజాగా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు, వాట్సాప్ కాంటాక్ట్ డిస్కవరీ టూల్ ద్వారా కోట్ల మంది ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ ఫోటోలు బయటపడే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

వాట్సాప్​ సెక్యూరిటీ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. (REUTERS)
వాట్సాప్​ సెక్యూరిటీ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. (REUTERS)

వాట్సాప్ ఇప్పటికే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, పాస్‌కీ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను ఇస్తున్నప్పటికీ, ప్రతి వాట్సాప్​ వినియోగదారుడు కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఈ నేపథ్యలో మీ వాట్సాప్​ అకౌంట్‌ను మరింత సెక్యూర్​ చేసే 8 మార్గాలను ఇక్కడ తెలుసుకోండి..

వాట్సాప్​ సెక్యూరిటీ ఫీచర్స్​ని ఉపయోగించండి..

1. ప్రైవసీ చెకప్-

ముందుగా మీ వాట్సాప్‌లో Settings > Privacy > Privacy Checkup ఓపెన్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్, 'అబౌట్' సమాచారం ఎవరెవరు చూడవచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు. మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను దాచుకోవడంతో పాటు అపరిచిత కాల్స్ రాకుండా ఇక్కడ నియంత్రించవచ్చు.

2. డిసప్పియరింగ్ మెసేజెస్-

వాట్సాప్​లో మీరు పంపే మెసేజ్‌లు 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజుల తర్వాత దానంతట అదే డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings > Privacy > Default message timer ఆప్షన్‌ను వాడండి. అయితే, ఎదుటివారు మీ మెసేజ్​లను స్క్రీన్‌షాట్ తీసే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.

3. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్-

4. యాప్ లాక్, చాట్ లాక్-

మీ ఫోన్ ఇతరుల చేతికి వెళ్లినా మీ వాట్సాప్ ఓపెన్ కాకుండా ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకోండి. ఇంకా ప్రైవసీ కావాలనుకుంటే, నిర్దిష్ట వ్యక్తులతో చేసే చాట్స్‌ను మాత్రమే లాక్ చేయవచ్చు. సదరు కాంటాక్ట్ ప్రొఫైల్‌లోకి వెళ్లి 'Lock Chat' ఆప్షన్‌ను నొక్కండి.

5. అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ సెట్టింగ్స్-

Privacy > Advanced విభాగంలోకి వెళ్లి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లను బ్లాక్ చేయవచ్చు. అలాగే మీ ఐపీ అడ్రస్ ఇతరులకు తెలియకుండా రక్షణ కల్పించుకోవచ్చు. లింక్ ప్రివ్యూలను డిసేబుల్ చేయడం ద్వారా స్కామ్ లింక్‌ల బారిన పడకుండా ఉండొచ్చు.

6. అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ-

మీ చాట్స్ వాట్సాప్ వెలుపల షేర్ కాకుండా, మీడియా డౌన్‌లోడ్లను నియంత్రించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. గ్రూపుల్లో కూడా మీ అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయలేకుండా 'Group Permissions' ద్వారా నియంత్రించవచ్చు.

7. రీడ్ రిసీప్ట్స్ ఆఫ్ చేయండి-

మీరు మెసేజ్ చదివినట్లు అవతలి వారికి 'బ్లూ టిక్స్' రూపంలో తెలియకూడదంటే Settings > Privacy > Read Receipts ని ఆఫ్ చేయండి. ఇది గ్రూప్ చాట్స్‌కు వర్తించదు.

8. మీడియా డౌన్‌లోడ్ నియంత్రణ-

వాట్సాప్‌లో వచ్చే ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా మీ గ్యాలరీలో సేవ్ కాకూడదంటే Settings > Chats > Save to Photos ని డిసేబుల్ చేయండి. అలాగే, మీరు పంపే ఫోటోలు కేవలం ఒక్కసారి మాత్రమే చూసేలా 'View Once' ఫీచర్‌ను వాడండి.

ఈ చిన్న జాగ్రత్తలు మీ డిజిటల్ ప్రైవసీని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ అకౌంట్‌ను ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe