8th Pay Commission : 8వ వేతన సంఘం జాప్యంతో ఉద్యోగులకు భారీ నష్టం.. అలవెన్సుల బకాయిలు రావు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలులో జాప్యం జరిగితే ఉద్యోగులు అలవెన్సుల రూపంలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది1 సవరించిన బేసిక్ పేపై మాత్రమే బకాయిలు వస్తాయని, అలవెన్సులకు పాత బకాయిలు చెల్లించరని తెలుస్తోంది.

Published on: Oct 3, 2026, 17:01:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న 50 లక్షలకు పైగా ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 2025 నాటికి కమిషన్ ఏర్పాటైంది. అక్కడ నుంచి 18 నెలల కాలవ్యవధిలో నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అయితే, ఈ కమిషన్ నివేదిక సమర్పించడంలో గానీ, ప్రభుత్వం దానిని అధికారికంగా నోటిఫై చేయడంలో గానీ ఆలస్యం జరిగితే కేంద్ర ఉద్యోగుల జేబులకు చిల్లు పడక తప్పదు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

8వ వేతన సంఘం జాప్యంతో ఉద్యోగులకు భారీ నష్టం? (Pixabay)
8వ వేతన సంఘం జాప్యంతో ఉద్యోగులకు భారీ నష్టం? (Pixabay)

ముఖ్యంగా ఈ జాప్యం వల్ల ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల్లో భారీ కోత పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వేతన సవరణ అమలు నిబంధనలే. పాత తేదీల నుంచి కొత్త వేతనాలు అమలు చేసినప్పుడు, సవరించిన బేసిక్ పేపై మాత్రమే ఉద్యోగులకు బకాయిలు లభిస్తాయి. కానీ డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్​ఆర్​ఏ), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టీపీటీఏ) వంటి ఇతర అలవెన్సులకు వెనుకటి తేదీల నుంచి బకాయిలు చెల్లించే సదుపాయం ఉండదు!

8వ వేతన సంఘం జాప్యం వల్ల ఎందుకు నష్టం జరుగుతుంది?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యం పెరుగుతుంది. ఈ డీఏ అనేది బేసిక్ పే ఆధారంగా శాతంలో లెక్కిస్తారు. కొత్త పే కమిషన్ అమలులోకి వచ్చినప్పుడు ఉద్యోగుల బేసిక్ పే గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల పెరిగిన బేసిక్ పే ఆధారంగా వచ్చే డీఏ, హెచ్‌ఆర్‌ఏ మొత్తం కూడా పెరుగుతుంది.

7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025తో ముగియడంతో, ఎనిమిదో వేతన సంఘం కింద సవరించిన బేసిక్ జీతాలు జనవరి 1, 2026 నుంచి వర్తిస్తాయి. ఒకవేళ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంలో 17 నెలలు, 20 నెలలు లేదా 25 నెలల జాప్యం చేస్తే, అంతకాలం పాటు పెరిగిన బేసిక్ పే ఆధారంగా రావాల్సిన అధిక అలవెన్సుల మొత్తాన్ని ఉద్యోగులు శాశ్వతంగా కోల్పోతారు.

వేతనంప్రస్తుత నెలవారీ అమౌంట్8వ వేతన సంఘం ఫిగర్స ()అంచనాఏరియర్ నష్టం (అంచనా)
Basic salary ₹44,900 ₹ 94,290 ₹ 49,390
HRA (At 24% of basic) ₹ 10,776 ₹ 22,630 ₹ 11,854
TPTA rate ₹ 3,600 ₹ 7,560 ₹ 3,960
TPTA (At 65% DA) ₹ 5,940 ₹ 7,560
HRA+TPTA (at 65% DA) ₹ 16,716 ₹ 30,190 ₹ 13,474
TPTA (At 67% DA) ₹ 6,012 ₹ 7,560
HRA+TPTA (at 67% DA) ₹ 16,788 ₹ 30,190 ₹ 13,402
TPTA (At 70% DA) ₹ 6,120 ₹ 7,560 ₹ 13,680
HRA+TPTA (at 70% DA) ₹ 16,896 ₹ 30,190 ₹ 13,294

సోర్సు: ఎకనామిక్ టైమ్స్

లెవెల్ 7 ఉద్యోగుల నష్టం ఎంత ఉండవచ్చు?

నివేదికల ప్రకారం.. ఒకవేళ 8వ వేతన సంఘం నివేదిక మే 2027, ఆగస్టు 2027 లేదా జనవరి 2028లో అమలైతే, లెవెల్ 7 హోదాలోని ఉద్యోగులు వరసగా 17 నెలలు, 20 నెలలు, 25 నెలల అలవెన్స్ బకాయిలను కోల్పోవాల్సి వస్తుంది.

ఉదాహరణకు 7వ వేతన సంఘం ప్రకారం లెవెల్ 7 ఉద్యోగి ప్రారంభ బేసిక్ పే రూ. 44,900గా ఉంది. 8వ పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫాక్టర్ 2.1గా అంచనా వేస్తే, బేసిక్ జీతంతో పాటు అలవెన్సులు కూడా 2.1 రెట్లు పెరుగుతాయి. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఉద్యోగులకు పాత అలవెన్సులే అందుతాయి. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం బేసిక్ పే బకాయిలు మాత్రమే చేతికి వస్తాయి తప్ప, అలవెన్సుల తేడా మొత్తాన్ని వెనుకటి తేదీల నుంచి ఇచ్చే అలవాటు లేదు. దీనివల్ల ప్రతి ఉద్యోగి వేలల్లో, కొందరు లక్షల్లో అలవెన్స్ ఆదాయాన్ని నష్టపోతారు.

నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?

నవంబర్ 3, 2025న పే కమిషన్ ఏర్పాటు జరిగిందనుకుంటే, 18 నెలల గడువు ప్రకారం మే 2027 నాటికి నివేదిక ప్రభుత్వానికి చేరుతుంది. తొందరగా వస్తే ఫిబ్రవరి లేదా ఏప్రిల్ 2027లో సిఫార్సులు వెలువడవచ్చు. నివేదిక అందిన తర్వాత మంత్రుల బృందం దీనిపై సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటుంది. గత ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, కమిషన్ సిఫార్సులు చేసిన తర్వాత అవి పూర్తిగా అమలులోకి రావడానికి మరో రెండేళ్ల నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. అంటే 2027లో ప్రకటించిన సవరణలు ఉద్యోగుల చేతికి పూర్తిగా అందేసరికి 2029 లేదా 2030 వరకు వేచి చూడాల్సి రావచ్చు!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More