ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన శ్రేణి, శాలరీ స్ట్రక్చర్‌లో మార్పులు తీసుకురావడానికి 8వ కేంద్ర వేతన సంఘం (8th CPC) వివిధ ఉద్యోగ సంఘాలు, వాటాదారులతో చురుగ్గా సంప్రదింపులు జరుపుతోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంలోనే అత్యంత కీలకమైన రైల్వే ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల చిట్టాను కమిషన్ ముందుంచాయి.

గత నెలలో అర్హులైన స్టేక్‌హోల్డర్ల నుంచి వేతన సంఘం ప్రతిపాదనలను (Memorandums) ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA), రైల్వేస్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ (RSCWS) వంటి ప్రధాన ప్రతినిధి సంఘాలు తమ వివరణాత్మక నివేదికలను సమర్పించాయి. లక్షలాది మంది రైల్వే సిబ్బంది, పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘాల సూచనలు రాబోయే రోజుల్లో కమిషన్ నిర్ణయాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ 8వ వేతన సంఘం 2027 మధ్య నాటికి తన తుది నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అంతకంటే ముందే, 7వ వేతన సంఘం పరిధిలోకి వచ్చే లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలిగిస్తూ రైల్వే శాఖ ఈ ఏడాది (2026) జనవరి 1 నుండి అమల్లోకి వచ్చేలా డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ Relief (DR)లను 2% పెంచింది. దీంతో ఈ అలవెన్స్ బేసిక్ పేలో గతంలో ఉన్న 58% నుండి ఇప్పుడు 60%కి చేరింది.
కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై పట్టు
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని రూ. 52,600కు పెంచాలని IRTSA డిమాండ్ చేసింది. మరోవైపు, RSCWS నిర్దిష్ట సంఖ్యను పేర్కొననప్పటికీ, 01.01.2026 నాటి ధరల సూచీ ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాన్ని లెక్కించాలని కోరింది.
{{/usCountry}}ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని రూ. 52,600కు పెంచాలని IRTSA డిమాండ్ చేసింది. మరోవైపు, RSCWS నిర్దిష్ట సంఖ్యను పేర్కొననప్పటికీ, 01.01.2026 నాటి ధరల సూచీ ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాన్ని లెక్కించాలని కోరింది.
{{/usCountry}}"ప్రస్తుత వినియోగ విధానాలు, గృహ వసతి, విద్య, వైద్యం, డిజిటల్ కనెక్టివిటీ ఖర్చులను వాస్తవిక కోణంలో అంచనా వేసి కనీస వేతనాన్ని ఖరారు చేయాలి" అని RSCWS తన నివేదికలో స్పష్టం చేసింది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే, రైల్వే మంత్రిత్వ శాఖలోని లెవెల్ 6, అంతకంటే ఎక్కువ భద్రతా కేటగిరీ (Safety Category) పోస్టులకు అధిక ఇండెక్సింగ్‌ను అనుసరించాలని IRTSA ప్రతిపాదించింది.
- లెవెల్ 1 పోస్టులకు 2.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కేటాయించాలి.
- లెవెల్ 6, 7, 8 పోస్టులకు 3.50 (2.92 x 1.2) వర్తింపజేయాలి.
- లెవెల్ 9 నుండి 12 వరకు గల మధ్యస్థాయి పోస్టులకు 3.80 (2.92 x 1.3) ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలి.
- ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది కేవలం ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికే పరిమితం కాకుండా, ఉద్యోగుల నిజమైన ఆదాయ వృద్ధికి దోహదపడేలా ఉండాలని, గతంలో జరిగిన వేతన నష్టాన్ని భర్తీ చేయాలని RSCWS కోరింది.
పే గ్రేడ్, వార్షిక ఇంక్రిమెంట్ల సవరణ
టెక్నికల్ సూపర్‌వైజర్ల కోసం లెవెల్ 7 నుండి ప్రారంభమయ్యే ఐదు గ్రేడ్‌ల నిర్మాణాన్ని అమలు చేయాలని IRTSA కోరింది. జూనియర్ ఇంజనీర్లు (JE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ల (SSE) బాధ్యతలు, వారు ఎదుర్కొనే ప్రమాదకరమైన పని వాతావరణాన్ని బట్టి వారి వేతన స్థాయిలను పెంచాలని, అలాగే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లకు (SSE) గ్రూప్-బి గెజిటెడ్ హోదా కల్పించాలని డిమాండ్ చేసింది. ఎస్‌ఎస్‌ఈ గ్రేడ్‌లో ఉద్యోగులు ఒకే పదవిలో ఏళ్ల తరబడి ఉండిపోతున్నారని (Stagnation), నేరుగా రిక్రూట్ అయిన గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు సైతం కెరీర్ ఆరంభ గ్రేడ్‌లోనే నిలిచిపోతున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.
వార్షిక ఇంక్రిమెంట్ల విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న బేసిక్ పేలో 3% రేటును పునఃసమీక్షించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (RSCWS) అభిప్రాయపడింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సుదీర్ఘ సేవా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్షిక ఇంక్రిమెంట్‌ను 5%కి పెంచాలని లేదా నిర్ణీత సంవత్సరాల సేవ తర్వాత అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని సూచించింది.
అలవెన్సులు, నిర్ణయ ప్రక్రియ
టెక్నికల్ సూపర్‌వైజర్లకు సంబంధించిన నైట్ డ్యూటీ అలవెన్స్, ఓవర్‌టైమ్ అలవెన్స్, ప్రొడక్షన్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (PCO) అలవెన్సులను పెంచాలని రైల్వే సంఘాలు కోరుతున్నాయి. మెట్రో నగరాలు, జీవన వ్యయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖర్చులు భారీగా పెరిగినందున ఇంటి అద్దె అలవెన్స్ (HRA), రవాణా అలవెన్సులను (Transport Allowance) కూడా ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమం తప్పకుండా సమీక్షించాలని డిమాండ్ చేశాయి.
ప్రస్తుతం ఈ 8వ వేతన సంఘంలో ప్రొఫెసర్ పులక్ ఘోష్ (సభ్యులు), పంకజ్ జైన్ (సభ్య కార్యదర్శి) ఉన్నారు. ఈ కమిషన్ ఈ ఏడాది జూన్ 15 వరకు వాటాదారుల నుండి సలహాలు, ప్రతిపాదనలను స్వీకరించనుంది.
2027 మధ్య నాటికి కమిషన్ తన నివేదికను సమర్పించినప్పటికీ, గత ట్రెండ్స్ ప్రకారం ప్రభుత్వం దీనిని పూర్తి స్థాయిలో రోల్ అవుట్ చేయడానికి మరో రెండేళ్ల నుండి మూడేళ్ల సమయం పట్టవచ్చు. అంటే, 2027లో కొత్త వేతనాల ప్రకటన వచ్చినప్పటికీ, ఉద్యోగులకు పెరిగిన జీతాలు 2029 లేదా 2030 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.