8th Pay Commission : 8వ వేతన సంఘం కీలక భేటీ- ఉద్యోగుల డిమాండ్లు ఏంటి?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాల సవరణపై 8వ వేతన సంఘం వేగం పెంచింది. అక్టోబర్ 7 నుంచి బెంగళూరులో వివిధ ఉద్యోగ సంఘాలతో కీలక సంప్రదింపులు ప్రారంభం కానున్నాయి. రూ. 52,600 కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ సంస్కరణలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.

Published on: Oct 6, 2026, 09:10:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కీలక ఘట్టానికి చేరుకుంది. వివిధ ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, ఇతర భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేస్తూ బుధవారం (అక్టోబర్ 7, 2026) నుంచి బెంగళూరులో వరుస సమావేశాలు నిర్వహించనుంది.

బెంగళూరులో 8వ వేతన సంఘం కీలక చర్చలు..
బెంగళూరులో 8వ వేతన సంఘం కీలక చర్చలు..

అజెండాలో ప్రధానాంశాలు - జీతాల పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్..

బెంగళూరులో జరిగే సమావేశానికి నిర్ణీత అజెండాను పే కమిషన్ ప్యానెల్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, గత కొన్ని నెలలుగా వివిధ ఉద్యోగ సంఘాలు సమర్పించిన వినతిపత్రాల ఆధారంగా చర్చలు సాగనున్నాయి. ప్రధానంగా కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అదనపు అలొవెన్సులు, పెన్షన్ సంస్కరణలు, కెరీర్ ప్రమోషన్ల అంశాలపైనే ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. బెంగళూరు భేటీ అనంతరం ముంబైలోనూ ఇదే తరహా సంప్రదింపుల సమావేశాలు నిర్వహించేందుకు పే కమిషన్ సిద్ధమవుతోంది.

ఐఆర్‌టీఎస్‌ఏ డిమాండ్లు: రూ. 52,600 కనీస వేతనం

రైల్వే ఉద్యోగుల పక్షాన ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (ఐఆర్​టీఎస్​ఏ) స్పష్టమైన ప్రతిపాదనలను కమిషన్‌కు అందించింది. సాంకేతిక విభాగంలో పనిచేసే ఉద్యోగుల వేతన నిర్మాణం, పదోన్నతుల్లో మార్పులు చేయాలని పట్టుబడుతోంది.

"ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనాన్ని రూ. 52,600గా నిర్ణయించాలి," అని ఐఆర్‌టీఎస్‌ఏ తమ మెమోరాండంలో విజ్ఞప్తి చేసింది. వివిధ పే లెవెల్స్‌కు భిన్నమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను అమలు చేయాలని, జూనియర్ ఇంజనీర్లు (జేఈ), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ల (ఎస్​ఎస్​ఈ) పదోన్నతులను వేగవంతం చేయాలని, సవాలుతో కూడిన విధుల్లో పనిచేసే వారికి ప్రత్యేక అలొవెన్సులు ఇవ్వాలని కోరింది.

కీలక విషయాలు

ఐఆర్​టీఎస్​ఏ డిమాండ్లు

ఆర్​ఎస్​సీడబ్ల్యూఎస్ డిమాండ్లు

బేసిక్ పేరూ. 52,600రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ని బలోపేతం చేసేందుకు బేసిక్​ పేకు అధిక ప్రధాన్యత ఇవ్వాలి
ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్2.92 లెవల్ 1–5; 3.50 లెవల్ 6–8; 3.80 లెవల్ 9–12; 4.09 లెవల్ 13–16; 4.38 లెవల్ 17–18బేసిక్ పే కాంపోనెంట్​ని బలోపేతం చేయాలి
వార్షిక ఇంక్రిమెంట్5% ప్రత్యేకంగా హైలైట్ చేయలేదు
అలొవెన్స్​లునైట్ డ్యూటీ రివ్యూ, ఓవర్​టైమ్, రిస్క్- హైర్డ్​షిప్ అలొవెన్స్హెచ్​ఆర్​ఏ, టీఏని ఎప్పటికప్పుడు రివైజ్ చేయాలి. బేసిక్ పేని, అలొవెన్స్​లను బ్యాలెన్స్​ చేయాలి
కెరీర్ పురోగతిమెరుగైన ప్రమోషన్లు, ఎంఏసీపీఎస్​లో మార్పులు, జేఈ, ఎస్​ఎస్​ఈలకు రివైజ్డ్​ కెరీర్ స్ట్రక్చర్ప్రత్యేకంగా హైలైట్ చేయలేదు
పెన్షన్/రిటైర్మెంట్ఉద్యోగులకు మద్దతిచ్చే విధంగా పే, కెరీర్ స్ట్రక్చర్ ఉండాలిరిటైర్మెంట్​ సెక్యూరిటీ కోసం అర్థవంతమైన బసిక్ పే పెంపు
ద్రవ్యోల్బణంప్రత్యేకంగా హైలైట్ చేయలేదుకీలకమైన అలొవెన్సు రివిజన్లను ద్రవ్యోల్బణానికి ముడిపెట్టాలి

ఆర్ఎస్​సీడబ్ల్యూఎస్ దృష్టి: పింఛనుదారులకు ఆర్థిక భద్రత

మరొక ప్రముఖ సంఘం రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ పింఛనుదారుల రిటైర్‌మెంట్ భద్రతపై ప్రాధాన్యం ఇచ్చింది. ఉద్యోగుల మొత్తం వేతనంలో అలవెన్సుల కంటే బేసిక్ పే శాతాన్ని పెంచాలని సూచించింది. దీనివల్ల రిటైర్‌మెంట్ తర్వాత లభించే పెన్షన్ ప్రాథమిక లెక్కింపు మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా అలవెన్సులను క్రమం తప్పకుండా సమీక్షించాలని విజ్ఞప్తి చేసింది.

రిటైర్‌మెంట్ తర్వాత వైద్యం, ఇళ్ల అద్దెలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నందున, విశ్రాంత ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోకుండా బలమైన ఆర్థిక రక్షణ కల్పించాలని ఆర్ఎస్​సీడబ్ల్యూఎస్ ప్యానెల్‌‌ను కోరింది.

8వ వేతన సంఘం తుది నివేదిక ఎప్పుడు రానుంది?

ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు ప్రతిపాదిస్తున్న డిమాండ్లు తుది నిర్ణయాలు కావు. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే 8వ వేతన సంఘం తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. 2025 నవంబర్ 3న ఏర్పడిన ఈ 8వ వేతన సంఘం, సుమారు 18 నెలల కాలపరిమితితో 2027 మే లేదా జూన్ నాటికి తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More