5ఏళ్లల్లో 900శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్​! ఇప్పుడు బిగ్​ అప్డేట్​..

5ఏళ్లల్లో 900శాతం కన్నా ఎక్కువ పెరిగిన షేర్​ ఇండియా సెక్యూరిటీస్ స్టాక్​ శుక్రవారం ఫోకస్​లో ఉండనుంది! ఈ కంపెనీ​ నుంచి బిగ్​ అప్డేట్​ అందడం ఇందుకు కారణం. ఈ స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసిన వారు కచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాలి..

Published on: Oct 31, 2025, 06:01:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మల్టీబ్యాగర్​ షేర్​ ఇండియా సెక్యూరిసీట్​ స్టాక్​ నుంచి బిగ్​ అప్డేట్​! జులై-సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలతో పాటు రెండో మధ్యంతర డివిడెండ్‌, కొత్త అనుబంధ సంస్థ ఏర్పాటు వంటి ముఖ్యమైన ప్రకటనలు చేసింది ఈ కంపెనీ. ఈ కారణంగా శుక్రవారం, అక్టోబర్ 31, 2025న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల దృష్టి ఈ షేర్లపైనే కేంద్రీకృతం కానుంది.

షేర్​ ఇండియా సెక్యూరిటీస్​ స్టాక్​ అలర్ట్​! (Pixabay)
షేర్​ ఇండియా సెక్యూరిటీస్​ స్టాక్​ అలర్ట్​! (Pixabay)

షేర్ ఇండియా సెక్యూరిటీస్​ క్యూ2 ఫలితాలు..

జులై- సెప్టెంబర్ 2025 వరకు ఉన్న త్రైమాసిక ఫలితాలను షేర్ ఇండియా కంపెనీ సెక్యూరిటీస్​ గురువారం (అక్టోబర్ 30, 2025) ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2025-26 రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం దాదాపు 25% తగ్గి రూ. 93.22 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 124.26 కోట్లుగా ఉంది.

అంతేకాకుండా, కంపెనీ ప్రధాన కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఈ రెండో త్రైమాసికంలో 24.6% తగ్గి రూ. 340.95 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఈ ఆదాయం రూ. 452.75 కోట్లుగా ఉంది.

మధ్యంతర డివిడెండ్ ప్రకటన..

షేర్ ఇండియా సెక్యూరిటీస్​ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమ ఇన్వెస్టర్ల కోసం ఒక్కో షేరుకు రూ. 0.40 పైసల డివిడెండ్‌ను ప్రకటించింది. అంటే, అర్హులైన ప్రతి వాటాదారునికి వారు కలిగి ఉన్న ప్రతి షేరుకు 40 పైసల చొప్పున డివిడెండ్ చెల్లింపు లభిస్తుంది!

"రెండు రూపాయల ఫేస్​ వాల్యూ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 0.40/- (నలభై పైసలు మాత్రమే) చొప్పున రెండవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించాము," అని కంపెనీ స్టాక్ ఎక్స్​ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో తెలియజేసింది.

కొత్త అనుబంధ సంస్థ ఏర్పాటు..

కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. షేర్ ఇండియా గ్రేహిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో కొత్త సబ్సిడరీ సంస్థను సైతం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ రూ. 6 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

ఈ పెట్టుబడిని ఒకేసారి కాకుండా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు ఫైలింగ్ డేటా చెబుతోంది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత, ఆ సంస్థ షేర్ ఇండియా సెక్యూరిటీస్‌కు అనుబంధ సంస్థ అవుతుంది.

షేర్​ ఇండియా సెక్యూరిటీస్​ స్టాక్ ప్రైజ్​ ట్రెండ్​..

గురువారం నాటి స్టాక్ మార్కెట్ ముగింపు సమయంలో షేర్ ఇండియా సెక్యూరిటీస్​ స్టాక్ ధర 0.76% పెరిగి రూ. 199.60 వద్ద ముగిసింది. అంతకుముందు మార్కెట్ సెషన్‌లో ఇది రూ. 198.10 వద్ద ఉంది. అయితే, కంపెనీ ఈ క్వార్టర్ ఫలితాలు, మధ్యంతర డివిడెండ్, అనుబంధ సంస్థ ఏర్పాటు నిర్ణయాన్ని అక్టోబర్ 30, 2025న మార్కెట్ ముగిసిన తర్వాత ప్రకటించింది.

గత ఐదేళ్ల కాలంలో, ఈ షేర్​ ఇండియా సెక్యూరిటీస్​ షేర్లు తమ ఇన్వెస్టర్లకు 912% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. ఫలితంగా ఇదొక మల్టీబ్యాగర్​ స్టాక్​గా నిలిచింది.

కానీ, గడిచిన ఒక్క సంవత్సరంలో ఈ షేర్లు 31% వరకు పడిపోయాయి!

ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చూస్తే, షేర్ ఇండియా సెక్యూరిటీస్ స్టాక్ 2025లో 33.45% నష్టపోయింది. అయితే, గత ఒక్క నెల కాలంలో మాత్రం 55.96% లాభాన్ని నమోదు చేసింది! గత ఐదు మార్కెట్ సెషన్లలో ఈ షేర్లు ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో 0.99% లాభంతో ట్రేడవుతున్నాయి.

బీఎస్ఈ వెబ్‌సైట్ డేటా ప్రకారం, డిసెంబర్ 26, 2024న షేర్ ఇండియా సెక్యూరిటీస్ స్టాక్ రూ. 325 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. సెప్టెంబర్ 30, 2025న రూ. 127.70 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం, అక్టోబర్ 30, 2025 నాటికి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,367.76 కోట్లుగా ఉంది.

(గమనిక- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​తో సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More