మిచిగన్ సెనేట్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన డెమోక్రటిక్ నేత అబ్దుల్ ఎల్-సయేద్.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రిపబ్లికన్లు నడిపిన ద్వేషపూరిత, కక్షపూరిత ప్రచారాన్ని మిచిగన్ ఓటర్లు తిప్పికొట్టారని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం డెట్రాయిట్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ప్రత్యర్థులపై విసిరిన పంచ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
'జెడ్డీ హబీబీ' అంటూ చురకలు

వచ్చే జనవరిలో అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వెన్స్ తనతో సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేయించాల్సి రావడంపై ఎల్-సయేద్ సరదాగా స్పందించారు. "జెడ్డీ, హబీబీ.. రాజ్యాంగబద్ధంగా నువ్వు వచ్చే జనవరిలో నాతో ప్రమాణ స్వీకారం చేయించక తప్పదు. ఇది నిజంగా ఒక సరదా సన్నివేశం" అని చురకలంటించారు. అరబిక్ భాషలో 'హబీబీ' అంటే ఆప్యాయంగా పిలుచుకునే పదం.
అంతేకాకుండా, తన ముస్లిం పేరును పదేపదే ఎగతాళి చేసిన డోనాల్డ్ ట్రంప్‌ను కూడా ఎల్-సయేద్ వదల్లేదు. "డోనాల్డ్, నా పేరు పలకడానికి నువ్వు పడే ఇబ్బంది నాకు తెలుసు. జేడీ నాతో ప్రమాణం చేయించిన తర్వాత నన్ను నేరుగా 'సెనేటర్' అని పిలుచుకోవచ్చు" అని సెటైర్ వేశారు.
గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్-సయేద్‌ను జేడీ వాన్స్ "అత్యంత దుర్మార్గుడు" అని వ్యాఖ్యానించగా, ట్రంప్ ఆయనను "జిహాదీ", "కమ్యూనిస్టు" అంటూ సంబోధించారు.
ద్వేషపూరిత ప్రచారాన్ని తిరస్కరించిన ఓటర్లు
తన ముస్లిం గుర్తింపునే లక్ష్యంగా చేసుకుని రిపబ్లికన్లు నెలల తరబడి దాడులు చేశారని ఎల్-సయేద్ విమర్శించారు. "మిచిగన్ ప్రజలు ఎంత విశాల హృదయులో నిరూపించుకున్నారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి కేవలం నా పేరు, నా ముఖాన్ని చూపిస్తూ నడిపిన ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రతి కౌంటీలోనూ ఓటర్లు తిరస్కరించారు" అని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అద్భుత విజయం వెనుక సుదీర్ఘ ప్రయాణం
ఈ విజయం తన ఇద్దరు కుమార్తెలకు ఒక చారిత్రక ఘట్టమని, భవిష్యత్తులో వారు దీనిని చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటారని సయేద్ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలోనే సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లింగా ఆయన సరికొత్త అధ్యాయం లిఖించారు.
{{/usCountry}}ఈ విజయం తన ఇద్దరు కుమార్తెలకు ఒక చారిత్రక ఘట్టమని, భవిష్యత్తులో వారు దీనిని చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటారని సయేద్ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలోనే సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లింగా ఆయన సరికొత్త అధ్యాయం లిఖించారు.
{{/usCountry}}మొత్తం 97 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ట్రంప్ మద్దతు తెలిపిన రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌పై ఎల్-సయేద్ 7 శాతం ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈజిప్ట్ నుంచి అమెరికాకు వలస వచ్చిన దంపతులకు జన్మించిన అబ్దుల్ ఎల్-సయేద్, ఎనిమిదేళ్ల క్రితం మిచిగన్ గవర్నర్ ప్రైమరీ పోటీలో దారుణంగా ఓడిపోయారు. కానీ ఈసారి ఎంతో తక్కువ ప్రచార వ్యయంతోనే ఘన విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.