...
...
Next Story

సీజేపీ నేత అభిజీత్ దిప్కే దేశవ్యాప్త ప్రచారం ‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రారంభం

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి 'క్యా బోల్తీ పబ్లిక్' (Kya bolti public) అనే దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రకటించారు. దేశంలో భరించలేని విధంగా మారిన విద్యా వ్యవస్థ సంస్కరణలే ఈ ప్రచారం యొక్క మొదటి ప్రధాన అజెండా అని ఆయన వెల్లడించారు.

Published on: Aug 6, 2026, 14:38:22 IST
Advertisement

ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ ఇబ్బందులు, వాస్తవ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే గురువారం రోజున 'క్యా బోల్తీ పబ్లిక్' పేరుతో కొత్త దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సీజేపీ నేత అభిజీత్ దీప్కే దేశవ్యాప్త ప్రచారం ‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రారంభం (HT_PRINT)
సీజేపీ నేత అభిజీత్ దీప్కే దేశవ్యాప్త ప్రచారం ‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రారంభం (HT_PRINT)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రచారంలో 'విద్యా సంస్కరణలు' (Education Reforms) అనే అంశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో విద్య అనేది సామాన్యుడికి అందుబాటులో లేకుండా, అత్యంత ఖరీదైనదిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యా రంగాన్ని వ్యాపారంగా మార్చారు: అభిజీత్ దిప్కే

ఈ సందర్భంగా విద్యా విధానం, ఫీజుల దోపిడీపై అభిజీత్ దిప్కే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

భారీ పాఠశాల ఫీజులు: "మొదటి తరగతి (Class 1) చదివించేందుకే ఏటా దాదాపు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా డొనేషన్ల పేరిట అదనపు బాదుడు కొనసాగుతోంది. అంత ఆదాయం లేని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఈ డబ్బును ఎక్కడి నుంచి తెస్తాయి?" అని ఆయన ప్రశ్నించారు.

అప్పుల ఊబిలో కుటుంబాలు: కాలేజీ ఫీజులు, కోచింగ్ సెంటర్ల రుసుములు ఆకాశాన్ని తాకుతుండటంతో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు భారీగా అప్పులపాలు అవుతున్నారన్నారు. ఈ ఆర్థిక భారం నుంచి కుటుంబాలను విముక్తి చేయడమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

రాజ్యాంగ హక్కు - వ్యాపారంగా మార్పు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగంలో విద్యను ఒక ప్రాథమిక హక్కుగా (Fundamental Right) అందించారని, కానీ గత కొన్నేళ్లుగా విద్యను కేవలం లాభాలు గడించే ఒక పెద్ద వ్యాపారంగా (Fundamental Business) మార్చేశారని విమర్శించారు.

పిల్లలకు ఉన్నత విద్యను అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని, విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా సమగ్ర మార్పులు తేవడమే తమ ‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రచారం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నామని దిప్కే పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe