Tata Electric Cars : సియెర్రా ఈవీ వచ్చేసింది- దీపావళికి ఇంకో 2 ఎలక్ట్రిక్ కార్లు! టాటా క్రేజీ ప్లాన్..

Electric cars in India : టాటా సియెర్రా ఈవీ సంచలన లాంచ్ తర్వాత.. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఈవీ లైనప్‌ను మరింత విస్తరించడానికి సిద్ధమైంది. ఈ ఏడాది చివరినాటికి మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త 'సఫారీ ఈవీ', 'టిగోర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్' వివరాలు ఇక్కడ చూద్దాము.

Published on: Jul 2, 2026, 06:05:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్.. ఇటీవల లాంచ్ చేసిన సియెర్రా ఈవీతో మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించింది. అయితే టాటా ఇక్కడితోనే ఆగడం లేదు. ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకున్న ఎలక్ట్రిక్ సెడాన్ 'టిగోర్ ఈవీ' సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో పాటు లగ్జరీ ఎస్‌యూవీ ప్రియుల కోసం మోస్ట్ ఎవైటెడ్ ‘సఫారీ ఈవీ’ని లాంచ్ చేయడానికి కంపెనీ లైన్ క్లియర్ చేసింది.

టాటా సఫారీ ఈవీ..
టాటా సఫారీ ఈవీ..

రాబోయే ఈ రెండు క్రేజీ ఈవీల కీలక వివరాలు, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ఓసారి పరిశీలిద్దాము..

1. టాటా టిగోర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్..

టాటా మోటార్స్ తన పాపులర్ సెడాన్ కారు టిగోర్‌ను సరికొత్త మోడ్రన్ లుక్‌లోకి మారుస్తోంది. ఇటీవల లీకైన పేటెంట్ చిత్రాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు ముందు భాగంలో (ఫ్రంట్ ఫాసియా) కొత్త క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, కింద పెద్ద ఎయిర్ డ్యామ్‌తో కూడిన సరికొత్త బంపర్ ఉండనున్నాయి. వీటికి తోడు టియాగో స్టైల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు బ్లాక్ ట్రిమ్‌తో కనెక్ట్ చేసిన సరికొత్త ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఈ కారుకు సరికొత్త స్పోర్టీ లుక్‌ను తీసుకురానున్నాయి.

ఇంటీరియర్ పరంగా చూస్తే, కొత్త టాటా టిగోర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో మరింత పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు మరికొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించనున్నారు.

పవర్‌ట్రెయిన్, రేంజ్: ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో పాత ఇంజన్/బ్యాటరీ సెటప్‌నే టాటా కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌లో 26కేడబ్ల్యూహెచ్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 73.7 బీహెచ్​పీ పవర్, 170ఎన్​ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చే ఈ కారు.. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల (ఏఆర్​ఏఐ సర్టిఫైడ్) రేంజ్ ఇస్తుంది.

2. టాటా సఫారీ ఈవీ..

ఆటోమొబైల్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'సఫారీ ఈవీ' ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది! ఇటీవల టెస్టింగ్ సమయంలో దొరికిన స్పై షాట్స్ ప్రకారం.. ఈ భారీ ఎస్‌యూవీలో హారియర్ ఈవీ తరహాలోనే ఇండిపెండెంట్ మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్ సిస్టమ్‌ను అందించబోతున్నారు.

కంపెనీ దీనిని అత్యాధునిక 'Acti.ev+' ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తోంది. ఇది హారియర్ ఈవీతో బ్యాటరీ, డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్లను పంచుకోనుంది. ప్రస్తుతం హారియర్ ఈవీలో ఉన్నట్లే.. ఇందులో కూడా మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. అవి:

65కేడబ్ల్యూహెచ్ సింగిల్-మోటార్ ఆర్​డబ్ల్యూడీ (రియర్ వీల్ డ్రైవ్)

75కేడబ్ల్యూహెచ్ సింగిల్-మోటార్ ఆర్​డబ్ల్యూడీ

75కేడబ్ల్యూహెచ్ డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ (ఆల్ వీల్ డ్రైవ్)

ఎక్స్‌టీరియర్, హైటెక్ ఫీచర్లు: సఫారీ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ వెలుపల క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, కొత్త డిజైన్ బంపర్లు, ఈవీ స్పెషల్ బ్యాడ్జింగ్‌లతో పాటు ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. ఇక కారు లోపల టాటా ఇంటెలిజెంట్ డిజిటల్ ఆర్కిటెక్చర్ లేయర్ టెక్నాలజీని వాడుతున్నారు. దీని ద్వారా ఆటో పార్క్ అసిస్ట్, ఓటీఏ అప్‌డేట్స్, కార్ సమన్ మోడ్, కారు నుంచే నేరుగా యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే సదుపాయం, లో-స్పీడ్ క్రూయిజ్ కంట్రోల్, 540-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా వంటి మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు ఈ కారు సొంతం కానున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More