దేశంలోనే అత్యున్నత వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఢిల్లీ ఎయిమ్స్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక సంస్థలో మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో 34 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎంపీ గొల్ల బాబూరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
ఢిల్లీ ఎయిమ్స్‌లో ఖాళీల వివరాలివే..

ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఢిల్లీ ఎయిమ్స్‌లో మొత్తం 1,306 ఫ్యాకల్టీ పోస్టులు మంజూరవ్వగా, ప్రస్తుతం అందులో 446 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సుమారు 34.15 శాతం మేర కీలకమైన డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
కేవలం ఫ్యాకల్టీ మాత్రమే కాదు, ఇతర విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నర్సింగ్ ఆఫీసర్లు, టెక్నికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది వంటి నాన్-ఫ్యాకల్టీ విభాగంలో మొత్తం 13,911 పోస్టులు ఉండగా.. అందులో 2,542 (18 శాతం) ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దేశం నలుమూలల నుంచి రోగులు భారీగా తరలివచ్చే ఈ ఆస్పత్రిపై ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణం కేవలం ఢిల్లీ ఎయిమ్స్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ సంస్థల్లోనూ సిబ్బంది కొరత వేధిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎయిమ్స్ పరిస్థితి పరిశీలిస్తే:
ఎయిమ్స్ మంగళగిరి (ఆంధ్రప్రదేశ్):
ఇక్కడ ఏకంగా 52 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం.
ఎయిమ్స్ బీబీనగర్ (తెలంగాణ):
ఇక్కడ సుమారు 45 శాతం ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.
అదేవిధంగా ఎయిమ్స్ దేవ్‌ఘర్‌లో 50 శాతం, ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 48 శాతం మేర ఫ్యాకల్టీ కొరత ఉందని కేంద్రం వెల్లడించింది. అత్యాధునిక వైద్యం సామాన్యుడికి చేరువ కావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థల్లో నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
{{/usCountry}}అదేవిధంగా ఎయిమ్స్ దేవ్‌ఘర్‌లో 50 శాతం, ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 48 శాతం మేర ఫ్యాకల్టీ కొరత ఉందని కేంద్రం వెల్లడించింది. అత్యాధునిక వైద్యం సామాన్యుడికి చేరువ కావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థల్లో నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
{{/usCountry}}