ఐకానిక్ డస్టర్‌ని రెనాల్ట్ సంస్థ ఈ ఏడాది తొలినాళ్లల్లో ఇండియాలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. ఇదే డస్టర్ ఆధారంగా ఒక ప్రీమియం 7-సీటర్ ఎస్‌యూవీని కంపెనీ డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం ఈ కారు భారత రోడ్లపై భారీ కామోఫ్లేజ్తో ముమ్మరంగా టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరాలకు చిక్కింది. 2027లో మార్కెట్లోకి రానున్న ఈ 7-సీటర్ కారు.. మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్‌లతో పాటు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, టయోటా నుంచి రాబోయే 7-సీటర్ మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.

ఈ నేపథ్యంలో ఈ 7 సీటర్ డస్టర్ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
7 సీటర్ డస్టర్- డిజైన్, డైమెన్షన్స్..
స్పై షాట్స్ ఆధారంగా ఈ 7-సీటర్ డస్టర్.. స్టాండర్డ్ 5-సీటర్ మోడల్ కంటే పెద్ద క్వార్టర్ గ్లాస్, పొడవైన రూఫ్‌లైన్, పొడిగించిన వెనుక భాగాన్ని కలిగి ఉండనుంది. దీని ఓవరాల్ డిజైన్ గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన ‘రెనాల్ట్ బోరియల్’ను పోలి ఉంటుంది.
ముఖ్యమైన డిజైన్ ఎలిమెంట్స్: ఐబ్రో స్టైల్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, సిగ్నేచర్ గ్రిల్, సీ-పిల్లర్‌పై అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్స్, బాడీ క్లాడింగ్, లైట్ బార్‌తో కనెక్ట్ చేసిన ట్రయాంగిల్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్ ఇందులో ఉండనున్నాయి.
సైజ్: ఈ త్రీ రో ఎస్యూవీ దాదాపు రెనాల్ట్ బోరియల్ కొలతలను కలిగి ఉంటుంది. అంటే 4,556ఎంఎం పొడవు, 1,841ఎంఎం వెడల్పు, 1,650ఎంఎం ఎత్తుతో వస్తుంది. దీని వీల్‌బేస్ 2,702ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ అత్యధికంగా 213ఎంఎంగా ఉండే అవకాశం ఉంది.
7 సీటర్ డస్టర్- ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు..
ఈ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని రెనో సంస్థకు చెందిన అధునాతన ‘ఆర్‌జీఎంపీ’ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్నారు. ఇది అదనపు సీట్ల వరుసను అమర్చడానికి వీలుగా డిజైన్ చేసి ఉంది.
క్యాబిన్ లోపల లభించే హంగులు:
{{/usCountry}}క్యాబిన్ లోపల లభించే హంగులు:
{{/usCountry}}వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్
సేఫ్టీ పరంగా లెవెల్ 2 అడాస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు.
7 సీటర్ డస్టర్- స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో పాటు మూడు ఇంజన్ ఆప్షన్లు!
ఈ 7-సీటర్ మోడల్ తన ఇంజన్ ఆప్షన్లను 5-సీటర్ డస్టర్ నుంచి పంచుకోనుంది. ఇందులో కస్టమర్ల కోసం మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను రెనో అందించనుంది:
1.0ఎల్ టర్బో పెట్రోల్: ఇది 100bhp పవర్, 160Nm టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.3ఎల్ టర్బో పెట్రోల్: ఇది శక్తివంతమైన 163bhp పవర్, 280Nm టాక్‌ను జనరేట్ చేస్తుంది.
1.8ఎల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ : మైలేజ్ ప్రియుల కోసం ఈ ఆప్షన్ రానుంది. ఇందులో 109bhp పెట్రోల్ ఇంజన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు 1.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఇవి కలిసి సంయుక్తంగా 160bhp పవర్, 172Nm టాక్‌ను అందిస్తాయి.
ఈ కార్లలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉంటాయి.
ఈ 7 సీటర్ డస్టర్ ఎస్యూవీ పేరు, లాంచ్ సహా ఇతర వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.