Electric cars : టాటా సియెర్రా ఈవీ వర్సెస్​ మహీంద్రా బీఈ 6- ఏ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ కొనాలి?

Tata Sierra EV vs Mahindra BE 6 : టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6.. ఏ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ కొనాలి? ఎంందులో రేంజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ? ఫీచర్లు ఎందులో అధికం? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Jul 3, 2026, 17:28:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరల భారం వల్ల వాహనదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రేసులో సరికొత్తగా విడుదలైన ‘టాటా సియెర్రా ఈవీ’, లగ్జరీ లుక్‌తో దూసుకెళుతున్న 'మహీంద్రా బీఈ 6' ఎలక్ట్రిక్ ఎస్​యూవీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6..
టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6..

టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6- బ్యాటరీ ప్యాక్, రేంజ్..

రెండు కార్లు కూడా లాంగ్ డ్రైవ్స్ కోసం పవర్‌ఫుల్ బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

టాటా సియెర్రా ఈవీ-

ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 63 kWh బ్యాటరీ ప్యాక్ (ఆర్​డబ్ల్యూడీ) మోడల్ 234 బీహెచ్​పీ పవర్, 315 ఎన్​ఎం టాక్‌ను ఇస్తుంది. పెద్దదైన 75 kWh బ్యాటరీ ప్యాక్ (ఆర్​డబ్ల్యూడీ) మోడల్ 206.5 బీహెచ్​పీ పవర్, 315 ఎన్​ఎం టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్‌లో ఇదే 75 kWh బ్యాటరీతో డ్యూయల్ మోటార్స్ వస్తాయి.. ఇది గరిష్టంగా 302 బీహెచ్​పీ పవర్, 504 ఎన్​ఎం టాక్‌ను జనరేట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఇది గరిష్టంగా 665 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుంది.

మహీంద్రా బీఈ 6-

మహీంద్రా సైతం రెండు బ్యాటరీ ఆప్షన్లను ఇస్తోంది. 59 kWh బ్యాటరీ వెర్షన్ 228 బీహెచ్​పీ పవర్, 79 kWh బ్యాటరీ వెర్షన్ 282 బీహెచ్​పీ పవర్‌ను ఇస్తాయి. అయితే రెండింటిలోనూ టార్క్ 380 ఎన్​ఎంగానే ఉంటుంది. ఇది కేవలం సింగిల్ మోటార్ రియర్-వీల్ డ్రైవ్​తోనే వస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఇది గరిష్టంగా 683 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుంది.

టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6- ఫీచర్లు..

సాంకేతికత, లగ్జరీ ఫీచర్ల పరంగా రెండు ఎలక్ట్రిక్ ఎస్​యూవీలు కూడా దేనికదే సాటిగా నిలుస్తున్నాయి.

టాటా సియెర్రా ఈవీ-

ఇందులో ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్ (10.24 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచ్ ఇన్‌ఫోటైన్‌మెంట్, 12.3 ఇంచ్ ప్యాసింజర్ డిస్‌ప్లే)

  • ఫ్రంట్ వెంటిలేటెడ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్లు
  • హెడ్స్-అప్ డిస్‌ప్లే
  • టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (6 మోడ్స్)
  • 540-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా
  • వయర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో
  • ముందు ఉండే ప్యాసింజర్ కోసం గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సపోర్ట్

మహీంద్రా బీఈ 6 ఫీచర్లు-

  • డ్యూయల్ 12.3 ఇంచ్ స్క్రీన్స్ (ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్‌ఫోటైన్‌మెంట్)
  • 16-స్పీకర్ల ప్రీమియం హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
  • 16 మిలియన్ కలర్ ఆప్షన్లతో అంబియంట్ లైటింగ్
  • 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్లు
  • గెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్ (డిక్కీ ఆటోమేటిక్ ఓపెనింగ్)
  • డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6- ధరలు..

ధరల విషయంలో రెండు బ్రాండ్లు కూడా కస్టమర్లను ఆకట్టుకునేలా కాంపిటీటివ్ ప్రైసింగ్‌ను అందించాయి.

టాటా సియెర్రా ఈవీ ధర: రూ. 18.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 24.79 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). (ఏడబ్ల్యూడీ ఎడిషన్ రూ. 25.99 లక్షల వరకు ఉంది).

మహీంద్రా బీఈ 6 ధర: రూ. 18.90 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ మోడల్ రూ. 26.90 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్).

టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6- ఎది కొనాలి?

మీకు ఆఫ్-రోడింగ్ సామర్థ్యం ఉన్న ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ), ప్యాసింజర్ కోసం అదనపు స్క్రీన్ కావాలనుకుంటే టాటా సియెర్రా ఈవీ బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా ఫ్యూచరిస్టిక్ డిజైన్, అదిరిపోయే మ్యూజిక్ సిస్టమ్ (16 స్పీకర్లు), అత్యధిక రేంజ్ (683 కిమీ) కావాలనుకుంటే మహీంద్రా బీఈ 6 అద్భుతంగా సరిపోతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More