Renault Duster : రెనాల్ట్ డస్టర్‌లో కొత్త ఆటోమేటిక్ వేరియంట్! తక్కువ ధరకే..
Renault Duster price : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ శ్రేణిని మరింత విస్తరించడానికి కంపెనీ సిద్ధమైంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా బడ్జెట్ ధరలోనే సరికొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ను తీసుకరానుందని సమాచారం.
భారతదేశానికి ఎస్‌యూవీ ట్రెండ్‌ని పరిచయం చేసిన ఐకానిక్ మోడల్ ‘రెనాల్ట్ డస్టర్’.. జనరేషన్ వర్షెన్‌తో ఇటీవలే మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చి, సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు భారతీయ కస్టమర్లను మరింత ఆకట్టుకునేందుకు ఈ ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ జనరేషన్ డస్టర్ సిరీస్‌లో మరింత తక్కువ ధరకే లభించే సరికొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ను ప్రవేశపెట్టడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మ్యాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మధ్య ఉన్న భారీ ధరల వ్యత్యాసాన్ని తగ్గించడంతో పాటు, నగరాల్లో ఆటోమేటిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడమే లక్ష్యంగా రెనాల్ట్ ఈ అడుగు వేస్తోందని ఆటోకార్ ఇండియా నివేదిక వెల్లడించింది.

మార్కెట్లో రెనాల్ట్ డస్టర్ హవా.. హైబ్రిడ్‌కు ఫుల్ క్రేజ్!
ఈ ఏడాది మార్చిలో రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైన కొత్త రెనాల్ట్ డస్టర్.. తీవ్రమైన పోటీ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అడుగుపెడుతూనే తన మార్క్ చూపించింది. అతి తక్కువ కాలంలోనే ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ఎస్‌యూవీల జాబితాలో ఇది స్థానం సంపాదించుకోవడం విశేషం. దీనికి తోడు, ఈ ఏడాది చివర్లో సరికొత్త ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’ వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి రెనాల్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ హైబ్రిడ్ మోడల్‌కు కస్టమర్ల నుంచి ఎంతలా రెస్పాన్స్ వచ్చిందంటే.. 2026 సంవత్సరానికి గానూ ఈ కారు బుకింగ్స్ అప్పుడే పూర్తిగా క్లోజ్ (సోల్డ్ అవుట్) అయిపోయాయి.
రెనాల్ట్ డస్టర్- ప్రస్తుత మోడళ్ల ఇంజన్ సామర్థ్యం, ధరలు..
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న డస్టర్ కారు రెండు రకాల టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది. ఇందులో మొదటిదైన 1.0-లీటర్ ఇంజన్ కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇక మరింత శక్తివంతమైన 1.3-లీటర్ ఇంజన్ వేరియంట్ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్‌తో పాటు ఈ-షిఫ్టర్‌తో కూడిన 6-స్పీడ్ డ్యుయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.
ధరల విషయానికి వస్తే.. ఎంట్రీ లెవెల్ 'అథెంటిక్' మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ. 10.49 లక్షలుగా ఉంటే, 1.0-లీటర్ విభాగంలో టాప్ ఎండ్ మోడల్ అయిన 'టెక్నో' ట్రిమ్ ధర రూ. 13.49 లక్షల వరకు ఉంది. అయితే, ఆటోమేటిక్ కార్లు మాత్రం కేవలం మిడ్-లెవెల్ ‘ఎవల్యూషన్’ వేరియంట్ నుంచి మాత్రమే లభిస్తున్నాయి. దీని ప్రారంభ ధర రూ. 14.49 లక్షలుగా ఉంది. దీనివల్ల మ్యాన్యువల్ కారు కొనాలనుకునే వారికి, ఆటోమేటిక్ కారు కావాలనుకునే వారికి మధ్య ధరల్లో దాదాపు ఒక లక్ష రూపాయలకు పైగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇది బడ్జెట్ పరిమితులు ఉన్న కస్టమర్లకు కొంత ఇబ్బందిగా మారింది.
తక్కువ ధరలో ఆటోమేటిక్ వేరియంట్ ఎలా ఉండబోతోంది?
కొత్తగా రాబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆటోమేటిక్ వేరియంట్‌కు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆటోమొబైల్ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే ఆటోమేటిక్ వేరియంట్లో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. మొదటిది.. ప్రస్తుతం కేవలం మ్యాన్యువల్‌గా మాత్రమే ఉన్న 1.0-లీటర్ ఇంజన్‌కు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేయడం. రెండోది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.3-లీటర్ ఆటోమేటిక్ వర్షన్‌ను బేస్ వేరియంట్ అయిన 'అథెంటిక్' ట్రిమ్‌లోకి కూడా తీసుకురావడం. ఈ రెండింటిలో ఏది జరిగినప్పటికీ కస్టమర్లకు తక్కువ ధరలోనే ఆటోమేటిక్ డస్టర్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
మార్కెట్లో ఎలాంటి ప్రభావం చూపించనుంది?
తక్కువ ధరలోనే ఆటోమేటిక్ ఆప్షన్‌ను తీసుకురావడం ద్వారా డస్టర్ అమ్మకాలు మరింత పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఆటోమేటిక్ ఎస్‌యూవీ కార్లను ఇష్టపడే మధ్యతరగతి వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. రాబోయే పండుగ సీజన్‌లో సరికొత్త హైబ్రిడ్ మోడల్ లాంచ్‌కు ముందే, ఈ కొత్త వేరియంట్ మార్కెట్లోకి రావడం వల్ల హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి గట్టి పోటీదారులకు రెనాల్ట్ డస్టర్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


