ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టెక్ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న యాపిల్ మెగా ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది! సెప్టెంబర్ 9, బుధవారం రోజున ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ పేరుతో సంస్థ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. యాపిల్ కొత్త ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి అతిపెద్ద ప్రాడక్ట్ లాంచ్ ఈవెంట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ ఈవెంట్‌లో ప్రధానంగా అత్యంత శక్తివంతమైన ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా వస్తున్న ఫోల్డబుల్ ‘ఐఫోన్ అల్ట్రా’, యాపిల్ వాచ్ సిరీస్ 12, ఎయిర్‌పాడ్స్ 5, నెక్ట్స్-జెన్ హోమ్‌పాడ్ మినీలను ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది.
కాగా ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లాంచ్ అవుతాయని, స్టాండర్డ్ ఐఫోన్ 18 మోడల్ వచ్చే ఏడాది విడుదల అవుతుందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాత్రి జరగనున్న లాంచ్ ఈవెంట్‌తో దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది.
ఐఫోన్ 18 సిరీస్ లాంచ్- భారత్‌లో ఎప్పుడు, ఎలా చూడాలి?
అమెరికా కాలిఫోర్నియాలోని కుపర్టినోలో ఉన్న యాపిల్ పార్క్ క్యాంపస్‌లో ఈ ఈవెంట్ ఘనంగా జరగనుంది.
తేదీ, సమయం: అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటలకు, అంటే మన భారతీయ కాలమానం (ఐఎస్టీ) ప్రకారం సెప్టెంబర్ 9 రాత్రి 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
లైవ్ స్ట్రీమింగ్: తెలుగు టెక్ ప్రియులు యాపిల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, యాపిల్ టీవీ యాప్ లేదా యాపిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ లాంచ్ ఈవెంట్‌ను లైవ్‌లో వీక్షించవచ్చు.
ఐఫోన్ 18 ప్రో ధర ఎంత ఉండొచ్చు?
భారత మార్కెట్‌లో ఐఫోన్ల ధరలపై ఎప్పుడూ ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇక లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది రాబోయే ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర భారతదేశంలో రూ. 1,39,900 వరకు ఉండే అవకాశం ఉంది. గతేడాది విడుదలైన యాపిల్ ఐఫోన్ 17 ప్రో (రూ. 1,34,900)తో పోలిస్తే ఇది సుమారు రూ. 5,000 వరకు ప్రిమియంగా మారనుంది.
{{/usCountry}}భారత మార్కెట్‌లో ఐఫోన్ల ధరలపై ఎప్పుడూ ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇక లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది రాబోయే ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర భారతదేశంలో రూ. 1,39,900 వరకు ఉండే అవకాశం ఉంది. గతేడాది విడుదలైన యాపిల్ ఐఫోన్ 17 ప్రో (రూ. 1,34,900)తో పోలిస్తే ఇది సుమారు రూ. 5,000 వరకు ప్రిమియంగా మారనుంది.
{{/usCountry}}రూపాయి మారకం విలువ, దిగుమతి సుంకాల ప్రభావం కూడా ఈ ధరల మార్పుపై ప్రతిబింబించే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా.
ఐఫోన్ 18 సిరీస్ కొత్త డిజైన్.. అదిరిపోయే కలర్స్!
గతేడాది ఐఫోన్ 17 ప్రో మోడల్స్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్ రంగుల్లో లభించగా, ఈసారి ఐఫోన్ 18 ప్రో సరికొత్త లుక్‌తో మెరిసిపోనుంది.
కలర్ వేరియంట్లు: స్కై బ్లూ, బర్గండి, క్లాసిక్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ కానుందని సమాచారం.
స్క్రీన్ డిజైన్: డిజైన్ పరంగా ఐఫోన్ 17 ప్రో శైలినే పోలి ఉన్నప్పటికీ, స్క్రీన్‌పై ఉండే 'డైనమిక్ ఐలాండ్' సైజును మరింత చిన్నదిగా చేసారని తెలుస్తోంది.
కెమెరా అప్‌గ్రేడ్: సెల్ఫీ ప్రియుల కోసం ఫ్రంట్ కెమెరాను ఏకంగా 24 మెగాపిక్సెల్‌కి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐఫోన్ 18 సిరీస్- పవర్ ఫుల్ ప్రాసెసర్, కెమెరా ఫీచర్లు
సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వస్తే, ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ అత్యాధునిక 2-నానోమీటర్ ఏ20 ప్రో చిప్‌సెట్తో నడవనున్నాయి. దీనివల్ల ఫోన్ పనితీరు వేగవంతమవ్వడమే కాకుండా బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. అంతేకాకుండా యాపిల్ సొంతంగా తయారుచేసిన కొత్త 'సీ2 మోడెమ్'ను కూడా ఇందులో పరిచయం చేయబోతున్నారు.
ప్రో మ్యాక్స్ మోడల్‌లో ప్రైమరీ కెమెరాకు 'వేరియబుల్ అపెర్చర్' ఫీచర్‌తో పాటు మెరుగైన ఆప్టికల్ జూమ్ సామర్థ్యాన్ని, భారీ బ్యాటరీని అందించనున్నారు.
ఐఫోన్ 18 సిరీస్- అమ్మకాలు ఎప్పటి నుంచి?
యాపిల్ ఆనవాయితీ ప్రకారం ఈవెంట్ జరిగిన మరుసటి వారం వచ్చే శుక్రవారం నుంచి కొత్త ఫోన్లు విక్రయానికి వస్తాయి. ఆ నిబంధన ప్రకారం సెప్టెంబర్ 18 నుంచి ఐఫోన్ 18 ప్రో మోడల్స్ గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి రావచ్చు.
అయితే టైమ్ జోన్ల వ్యత్యాసం వల్ల ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు అందరికంటే ముందుగా ఫోన్లు చేతికి అందుతాయి.
సెప్టెంబర్ 9న జరిగే ప్రధాన ఈవెంట్‌లోనే విక్రయ తేదీలపై కంపెనీ అధికారిక ప్రకటన చేయనుంది.