ఈ ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ కొత్త క్రెడిట్​ కార్డుతో ఫ్లైట్​, హోటల్​ బుకింగ్స్​పై భారీగా డబ్బులు ఆదా..

తరచూ విదేశాలకు వెళ్లే వారి కోసం ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ 'డైమండ్ రిజర్వ్' క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. సున్నా ఫారెక్స్ మార్కప్, ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, హోటల్ బుకింగ్స్‌పై భారీ రివార్డులు ఈ కార్డు ప్రత్యేకత. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jan 09, 2026 10:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లోబల్ ట్రావెలర్లకు, విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడే వారి కోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఒక సరికొత్త కానుకను తీసుకొచ్చింది. 'జీరో-ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్' పేరుతో ప్రీమియం ట్రావెల్ అండ్ లైఫ్‌స్టైల్ కార్డును మార్కెట్లోకి ఇటీవలే విడుదల చేసింది. విదేశీ ప్రయాణాల్లో ఎదురయ్యే అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించడంతో పాటు అద్భుతమైన రివార్డులను అందించడమే ఈ కార్డు ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఈ ఐడీఎఫ్​సీ క్రెడిట్​ కార్డుతో వచ్చే బెనిఫిట్స్​ని ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

ఐడీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు- ఫీజు వివరాలు..

ఈ ఐడీఎఫ్​సీ కొత్త క్రెడిట్​ కార్డు వార్షిక రుసుము రూ. 3,000 (ప్లస్ జీఎస్టీ). అయితే, ఏడాదిలో రూ. 6 లక్షలకు మించి ఖర్చు చేస్తే ఈ ఫీజును బ్యాంక్ రద్దు చేస్తుంది.

ఐడీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు- ముఖ్యమైన ఫీచర్లు, ప్రయోజనాలు:

సున్నా ఫారెక్స్ మార్కప్: అంతర్జాతీయంగా మీరు చేసే ఖర్చులపై ఎటువంటి ఫారెక్స్ మార్కప్ ఛార్జీలు ఉండవు. ఇది విదేశీ ప్రయాణాల్లో మీకు భారీగా ఆదాను ఇస్తుంది.

భారీ రివార్డ్ పాయింట్లు:

యాప్ ద్వారా హోటల్ బుకింగ్స్ చేస్తే ప్రతి రూ. 150 ఖర్చుకు 60 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. అంటే దాదాపు 10% నగదు వెనక్కి వచ్చినట్లే.

ఫ్లైట్ బుకింగ్స్‌పై ప్రతి రూ. 150కి 40 రివార్డ్ పాయింట్లు (6.6% వ్యాల్యూ బ్యాక్) వస్తాయి.

నెలవారీ ఇతర ఖర్చులపై ప్రతి రూ. 150కి 10 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.

లాంజ్ అండ్​ గోల్ఫ్ యాక్సెస్: ప్రతి మూడు నెలలకు రెండు డొమెస్టిక్, రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ విజిట్​లు ఉచితం. అలాగే నెలలో రెండుసార్లు ఉచిత గోల్ఫ్ రౌండ్లు లేదా లెసన్స్ పొందవచ్చు.

సినిమా ఆఫర్లు: ప్రతి నెలా "ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం" ఆఫర్ కింద మూవీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఐటీసీ హోటల్స్ ఆఫర్: రెండు రాత్రులు బుక్ చేసుకుంటే మూడొవ రాత్రి స్టే ఉచితంగా లభిస్తుంది.

ఐడీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు- ఇన్సూరెన్స్ కవరేజీ..

ప్రయాణికుల భద్రత కోసం ఈ క్రెడిట్​ కార్డు ద్వారా రూ. 1 కోటి ఎయిర్ యాక్సిడెంట్ కవర్, రూ. 10 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లభిస్తుంది. ప్రయాణం రద్దయితే రూ. 25,000 వరకు రీయింబర్స్‌మెంట్, అలాగే లగేజీ పోయినా లేదా ఫ్లైట్ ఆలస్యమైనా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్​ ఉంటుంది!

ఐడీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు- మరిన్ని ప్రత్యేకతలు..

"అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి డైమండ్ రిజర్వ్ కార్డ్ ఒక వరం లాంటిది. ఇది భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది," అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ విభాగం హెడ్ శిరీష్ భండారి తెలిపారు.

నగదు ఉపసంహరణ: ప్రపంచవ్యాప్తంగా ఏ ఏటీఎం నుంచి నగదు తీసినా పేమెంట్ గడువు వరకు వడ్డీ ఉండదు. అయితే ప్రతి విత్ డ్రాయల్‌కు రూ. 199 ఛార్జీ పడుతుంది.

ఎక్స్‌పైరీ లేని రివార్డులు: మీరు సంపాదించిన రివార్డ్ పాయింట్లు లైఫ్​టైవ్​ వాలిడిటీతో వస్తాయి. వీటిని ఏ ఈ-కామర్స్ సైట్‌లోనైనా వాడుకోవచ్చు.

తక్కువ వడ్డీ రేటు: ఏటా 8.5% నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి.

నెలకు రూ. 20,000 కంటే ఎక్కువ ఖర్చు చేసే వారి కోసం 10 రెట్లు రివార్డ్ పాయింట్ల సౌకర్యం కూడా ఉంది.

విదేశీ ప్రయాణాల్లో కరెన్సీ మార్పిడి తలనొప్పులు లేకుండా, ఖర్చు చేసిన ప్రతి పైసాకు తగిన రివార్డులు కోరుకునే వారికి ఈ కార్డ్ ఒక ఉత్తమ ఎంపిక.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. క్రెడిట్​ కార్డు వినియోగం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.)