Oppo Reno 16 : ఒప్పో నుంచి దుమ్మురేపే కొత్త స్మార్ట్‌ఫోన్స్- ఏకంగా 200ఎంపీ కెమెరాతో!
Oppo Reno 16 pro : ఒప్పో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అవి ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్ ధరలు, ఫీచర్లు సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'ఒప్పో'.. తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. మే 2026 లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో మోడళ్లను కంపెనీ ఆవిష్కరించింది. వీటితో పాటు 'ఒప్పో ప్యాడ్ 6' ట్యాబ్లెట్‌ను కూడా ప్రదర్శించారు. కాగా కొత్త స్మార్ట్‌ఫోన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇవి అల్ట్రా-పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు, ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి సంచలన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చాయి.

ఒప్పో రెనో సిరీస్ ఫోన్లు ఎల్లప్పుడూ ప్రీమియం డిజైన్, కెమెరా పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. ఈసారి కూడా రికార్డు స్థాయి ఫీచర్లతో ఈ ఫోన్లను కంపెనీ లైనప్ చేసింది. చైనాలో మే 29 నుంచి ఇవి అమ్మకానికి రానున్నాయి.
ఈ రెండు సరికొత్త వేరియంట్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఒప్పో రెనో 16 సిరీస్ ధరల వివరాలు..
ఒప్పో రెనో 16: ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ (12GB RAM + 256GB) ధర 3,499 యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ. 49,000)గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ (16GB RAM + 1TB) ధర 4,899 యువాన్లు (సుమారు రూ. 69,000)గా నిర్ణయించారు.
ఒప్పో రెనో 16 ప్రో : దీని బేస్ మోడల్ (12GB RAM + 256GB) ధర 4,499 యువాన్లు (సుమారు రూ. 63,000) నుంచి ప్రారంభమవగా.. టాప్ ఎండ్ మోడల్ (16GB RAM + 512GB) ధర 5,299 యువాన్లు (సుమారు రూ. 74,000) గా ఉంది.
ఒప్పో రెనో 16 సిరీస్- డిస్‌ప్లే, ప్రాసెసర్ సామర్థ్యం..
ఈ రెండు ఒప్పో స్మార్ట్‌ఫోన్స్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. వీటికి దుమ్ము, నీటి నుంచి పూర్తి రక్షణ కోసం గరిష్ట ఐపీ69కే రేటింగ్ ఇచ్చారు.
రెనో 16 ప్రో: ఇందులో 6.78-ఇంచ్ 1.5కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో అల్ట్రా-ఫాస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ ఆక్టా-కోర్ చిప్‌సెట్ అమర్చారు.
రెనో 16: ఇది కొంచెం చిన్నదైన 6.32-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
ఒప్పో రెనో 16- 200ఎంపీ కెమెరాల హవా..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇరు ఫోన్లలోనూ ఒకే రకమైన శక్తివంతమైన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించారు.
ప్రైమరీ కెమెరా: ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ ఉన్న 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా.
సెకండరీ కెమెరాలు: 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యం ఉన్న 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో రీసెట్ చేసిన భారీ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఇచ్చారు. ఈ ఫోన్ల ద్వారా 4కే/60 ఎఫ్‌పీఎస్ క్వాలిటీతో అద్భుతమైన వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
ఒప్పో రెనో 16- బ్యాటరీ అండ్ ఛార్జింగ్..
ఈ ఒప్పో రెనో 16 సిరీస్ అతిపెద్ద బ్యాటరీ బ్యాకప్‌తో వస్తోంది.
రెనో 16 ప్రో మోడల్ ఏకంగా 7,000ఎంఏహెచ్ బ్యాటరీతో రాగా.. రెనో 16 మోడల్ 6,700ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
ఈ రెండు ఫోన్లు 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అయితే, కేవలం ప్రో మోడల్‌కు మాత్రమే అదనంగా 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు.
రక్షణ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌లను అమర్చారు.
ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ సిరీస్ మరికొద్ది వారాల్లోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


