Oppo Find X9 Ultra : ఇండియాలోకి ఒప్పో మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్! కళ్లు చెదిరే కెమెరా ఫీచర్స్‌తో..
Oppo Find X9s : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి బిగ్ అప్డేట్! ఒప్పో సంస్థ తన ఫైండ్ ఎక్స్9 సిరీస్‌లో భాగంగా రెండు క్రేజీ మోడల్స్‌ని ఇండియాలో లాంచ్ చేసిది. అవి ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, ఎక్స్9ఎస్. ఈ నేపథ్యంలో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్లు, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Oppo Find X9 Ultra India launch : స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ అల్ట్రా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను ఒప్పో సంస్థ భారతదేశంలో విడుదల చేసింది. కెమెరా టెక్నాలజీలో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసేలా ‘ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా’ , ‘ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్’ మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. మే 30 నుంచి ఈ ఫోన్ల సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా ఫీచర్లు..
ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం, టాప్-ఎండ్ మోడల్‌గా ‘ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా’ నిలిచింది.
డిస్‌ప్లే అండ్ ప్రాసెసర్: ఈ ఫోన్ 6.82-ఇంచ్ భారీ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో క్వాల్కమ్ అత్యంత లేటెస్ట్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్‌తో జత చేశారు.
హాసెల్‌బ్లాడ్ క్వాడ్ కెమెరా: ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ దీని కెమెరా సెటప్! ఇందులో హాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన క్వాడ్ (నాలుగు) బ్యాక్ కెమెరాలను అందించారు. ఇందులో డ్యూయల్ 200ఎంపీ సెన్సార్లతో పాటు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అధునాతన ఏఐ ఫోటోగ్రఫీ, లో-లైట్ వీడియో రికార్డింగ్ దీని ప్రత్యేకత.
భారీ బ్యాటరీ: స్లిమ్ డిజైన్ ఉన్నప్పటికీ ఇందులో ఏకంగా 7,050ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ని ప్యాక్ చేశారు. దీనికి 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్ ఫీచర్లు..
కొంచెం కాంపాక్ట్ సైజ్, తక్కువ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ అనుభూతిని కోరుకునే వారి కోసం ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్ స్మార్ట్‌ఫోన్‌ని సంస్థ తీసుకొచ్చింది.
డిస్‌ప్లే అండ్ ప్రాసెసర్: ఇది 6.59-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉండి, మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
కెమెరా అండ్ వీడియో: ఇందులో హాసెల్‌బ్లాడ్ భాగస్వామ్యంతో రూపొందించిన ట్రిపుల్ 50ఎంపీ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 4కే డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రెయిట్, నైట్ ఫోటోగ్రఫీ కోసం ఇందులో ఇమేజ్ ప్రాసెసింగ్‌ను మరింత మెరుగుపరిచారు.
బ్యాటరీ: ఈ ఫోన్ స్లిమ్ ప్రొఫైల్ కలిగి ఉన్నప్పటికీ, ఇందులో 7,025ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించడం విశేషం.
ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్స్- ధరలు, లభ్యత..
భారతదేశంలో ఈ రెండు ఫోన్ల ధరలు కింది విధంగా ఉన్నాయి:
ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్ ధర: రూ. 79,999 (ప్రారంభ ధర)
ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా ధర: రూ. 1,69,999
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో అధికారిక ఆన్‌లైన్ స్టోర్లలో మే 30 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. లాంచ్ ఆఫర్ల కింద అర్హులైన కస్టమర్లకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలను కూడా ఒప్పో ప్రకటించింది.
మరి ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో మీరు ఏది కొంటున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


