Toyota Innova Hycross : టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది! సరికొత్త లుక్, గ్రేట్ మైలేజ్..
భారత ఎంపీవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతార్‌లో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆకర్షణీయమైన రీ-డిజైన్, అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు, సురక్షితమైన అడాస్ టెక్నాలజీతో రానున్న ఈ ఎంపీవీ పూర్తి వివరాలు ఇవే..
భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కుటుంబ వాహనాల విభాగంలో 'ఇన్నోవా' బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో లాంగ్ డ్రైవ్‌లు, ఫ్యామిలీ ట్రిప్పులు అనగానే ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక ఇన్నోవానే! ఈ క్రమంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ తన పాపులర్ 3-రో ఎంపీవీ ‘ఇన్నోవా హైక్రాస్’ను సరికొత్త అప్‌డేట్‌తో మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రస్తుతం భారత రహదారులపై టెస్టింగ్ జరుపుకుంటోంది. ఈ కారు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో అధికారికంగా రోడ్డెక్కే అవకాశముంది. మార్కెట్లో గట్టి పోటీని తట్టుకుంటూ, కస్టమర్ల సరికొత్త కోరికలకు అనుగుణంగా డిజైన్, ఫీచర్లలో టయోటా కీలక మార్పులు చేస్తోంది. వాటి గురించి ఇక్కడ చూసేయండి..
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- అగ్రెసివ్ డిజైన్, స్పోర్టీ లుక్..
ఇది పూర్తిగా కొత్త తరం కారు కానప్పటికీ, మిడ్-సైజ్ అప్‌డేట్‌గా వస్తున్నందున ఎక్స్టీరియర్లో ముఖ్యమైన మార్పులు ఉంటాయి. ప్రత్యేకించి ముందు భాగం పూర్తిగా సరికొత్తగా మారనుంది.
ఫ్రంట్ గ్రిల్ అండ్ లైటింగ్: కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, మరింత పదునైన ఫుల్-ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, డైనమిక్ టర్న్ ఇండికేటర్లను ఇందులో జతచేస్తున్నారు.
అల్లాయ్ వీల్స్: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్‌కు ప్రీమియం శైలిని ఇచ్చేందుకు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను సరికొత్త డిజైన్‌లో అందిస్తున్నారు.
కారు ప్రాథమిక 3-రో సీటింగ్ లేఅవుట్, బాడీ నిర్మాణం ప్రస్తుత మోడల్ లాగే ఉన్నప్పటికీ, వెనుక భాగంలో చిన్నపాటి ఎల్‌ఈడీ టెయిల్ లాంప్ మార్పులు ఉండే అవకాశముంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- ఇంటీరియర్, టెక్నాలజీ..
ఇన్నోవా ఎంపీవీ అనగానే ప్రయాణికుల కంఫర్ట్ ప్రధాన అంశం. ఇక ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో క్యాబిన్ అనుభవాన్ని మరింత విలాసవంతంగా మార్చడానికి టయోటా శ్రీకారం చుట్టింది.
సరికొత్త ఇంటీరియర్స్: కొత్త సీట్ అప్‌హోల్‌స్టరీ, ఆహ్లాదకరమైన అంబియంట్ లైటింగ్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.
కనెక్టివిటీ: ప్రస్తుత 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను వేగవంతమైన సోఫ్‌వేర్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో సవరించనున్నారు.
వెనుక సీట్ల కంఫర్ట్: ప్రయాణాలను ఇష్టపడే వారి కోసం వెనుక సీట్లలో అదనపు ఛార్జింగ్ పోర్టులు, కంట్రోల్స్, మెరుగైన లెగ్‌రూమ్ సౌకర్యాలను కల్పించనున్నారు.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- అడాస్..
ప్రస్తుత మోడల్‌లోనే అడాస్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నప్పటికీ, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో దానిని మరింత కచ్చితత్వంతో సవరించనున్నారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీఎంపీఎస్) యథాతథంగా ఉంటాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్, మైలేజ్..
మెకానికల్‌గా టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ విభాగంలో ఎలాంటి మార్పులూ చేయడం లేదు! భారతీయ కస్టమర్లు ఎంతగానో ఇష్టపడే పవర్‌ఫుల్ 2.0-లీటర్ పెట్రోల్, 2.0-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్లు కొనసాగుతాయి.
ప్యూర్ పెట్రోల్: సాధారణ పెట్రోల్ డ్రైవింగ్ కోరుకునే వారి కోసం 2.0ఎల్ నేచురల్లీ యాస్పిరేటెడ్ 4-సిలిండర్ ఇంజిన్ లభిస్తుంది.
స్ట్రాంగ్ హైబ్రిడ్: ఎలక్ట్రిక్ మోటార్, ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో వచ్చే 2.0ఎల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ మోడల్ లీటరుకు 23 కిలోమీటర్లకు పైగా మైలేజ్ అందిస్తూ ఇంధన పొదుపులో అత్యుత్తమంగా నిలుస్తుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- లాంచ్ టైమ్‌లైన్, ధర (అంచనా)..
ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ ధరలు ఎక్స్-షోరూమ్‌లో రూ. 20 లక్షల నుంచి రూ. 33 లక్షల పరిధిలో ఉండే అవకాశం ఉంది.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. టయోటా తన పాపులర్ ఎస్‌యూవీ 'న్యూ జనరేషన్ ఫార్చ్యూనర్' ను డిసెంబర్ 1, 2026న గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఆ తర్వాత 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.
ఈ రెండు మోడళ్లు భారత ప్రీమియం వాహన మార్కెట్లో టోయోట ఆధిపత్యాన్ని మరింత బలపరచనున్నాయి!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


