Toyota Glanza facelift : పండుగ సీజన్‌కు కొత్త కారు కొనాలా? టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లాంచ్- రూ. 6.99లక్షలకే!
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ రూ. 6.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో 'గ్లాంజా ఫేస్‌లిఫ్ట్' హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. సరికొత్త డిజైన్, లెవెల్-2 అడాస్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, పెట్రోల్-సీఎన్జీ ఆప్షన్లతో ఈ కారు అందుబాటులోకి వచ్చింది.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పట్టు సాధించేందుకు 'టయోటా కిర్లోస్కర్ మోటార్' తమ పాపులర్ మోడల్ ‘గ్లాంజా ఫేస్‌లిఫ్ట్’ను బుధవారం దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరను రూ. 6.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ ప్లాట్‌ఫామ్‌పైనే దీనిని రూపొందించినప్పటికీ, టయోటా గ్లోబల్ డిజైన్ శైలికి అనుగుణంగా ప్రత్యేకమైన మార్పులు చేసి లగ్జరీ లుక్‌ను అందించారు.

ఈ నేపథ్యంలో ఈ టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ విశేషాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్- స్పోర్టీ ఎక్స్టీరియర్ డిజైన్..
టయాటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో సరికొత్త రీ-డిజైన్డ్ ఫ్రంట్ ప్రొఫైల్ కనిపిస్తుంది. హెడ్లైట్ల ఆకారాన్ని పాత మోడల్ తరహాలోనే ఉంచినప్పటికీ, రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌ను టయోటా గ్లోబల్ స్టైలింగ్ ఆధారంగా అప్డేట్ చేశారు. కారు పక్క భాగంలో గ్లాసీ ఫినిషింగ్‌తో కూడిన సైడ్ స్కిర్ట్స్ ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. వెనుక భాగంలో పెద్దగా మార్పులు చేయకుండా పాత డిజైన్‌నే కొనసాగించారు.
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కారును ఈ, ఎస్, జీ, వీ అనే నాలుగు విభిన్న ట్రిమ్‌లలో అందుబాటులోకి తెచ్చారు. రంగుల విషయానికొస్తే.. కేఫ్ వైట్, ఎంటిసింగ్ సిల్వర్, గేమింగ్ గ్రే, ఇన్‌స్టా బ్లూ, స్పోర్టిన్ రెడ్ అనే ఐదు పాత రంగులతో పాటు 'బ్లూయిష్ బ్లాక్', 'డిజిటల్ టీల్ గ్రీన్' అనే రెండు సరికొత్త కలర్ ఆప్షన్లతో కలిపి మొత్తంగా 7 రంగుల్లో ఈ హ్యాచ్‌బ్యాక్ లభిస్తుంది.
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లెవెల్-2 అడాస్, అధునాతన ఫీచర్లు..
క్యాబిన్ లోపల పెద్దగా మార్పులు లేకపోయినా, సాంకేతికత, సౌకర్యాల పరంగా బలెనో ఫేస్‌లిఫ్ట్ స్థాయిలో అనేక నూతన ఫీచర్లను జోడించారు. ఈ కారు టాప్-ఎండ్ వర్షన్లో హ్యాచ్‌బ్యాక్ విభాగంలోనే తొలిసారిగా 'లెవెల్-2 అడాస్' (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్స్) సేఫ్టీ సూట్‌ను అందించడం విశేషం.
ప్రయాణికుల సౌకర్యం కోసం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ డాక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), అప్డేటెడ్ అప్హోల్స్టరీని పొందుపరిచారు. ఇవి కాకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ప్రామాణికంగా లభిస్తాయి.
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్, ఇంధన ఆప్షన్లు..
సాంకేతిక వివరాలు పరిశీలిస్తే.. మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్‌లో ఉపయోగించిన సరికొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్నే గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లోనూ అమర్చారు. ఇంధన పొదుపు కోసం ఆటో స్టార్ట్-స్టాప్ ఫంక్షన్‌ను అందించారు. ఈ కారు పెట్రోల్ వర్షన్‌తో పాటు కంపెనీ ఫిట్టెడ్ పెట్రోల్-సీఎన్జీ ఆప్షన్లోనూ లభిస్తుంది.
గేర్‌బాక్స్ ఎంపికల విషయానికి వస్తే 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (ఏఎంటీ) యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పెట్రోల్, సీఎన్జీ రెండింటిలోనూ టయోటా అందించడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో నిత్యం ప్రయాణించే ఉద్యోగులకు, అధిక మైలేజ్, భద్రత కోరుకునే కుటుంబాలకు ఈ కారు ఉత్తమ ఎంపికగా నిలవనుంది.
ఇక దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ బలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ కార్లకు ఈ టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ ప్రధాన పోటీదారుగా నిలవనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


