అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ షురూ- తక్కువ ధరకే.. ఈ ప్రీమయం స్మార్ట్‌ఫోన్స్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌పై మంచి డీల్స్ లభిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
షాపింగ్ ప్రియులకు అసలైన పండగ వచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. తన 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026'ను దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాదిలో అమెజాన్ అందిస్తున్న తొలి అతిపెద్ద సేల్ ఇదే కావడం విశేషం. జనవరి 16న మొదలైన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, వేరబుల్స్, కిచెన్ అప్లయెన్సెస్, స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు, భారీ ధరల తగ్గింపులను సంస్థ ప్రకటించింది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్- ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్..
మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నారా? అయితే ఈ సేల్ మీకు సరైన అవకాశం. యాపిల్, వన్‌ప్లస్, శాంసంగ్, ఐక్యూ వంటి దిగ్గజ బ్రాండ్ల లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లు ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా: లాంచ్ ధర రూ. 1,29,999 కాగా, ఈ సేల్‌లో కేవలం రూ. 1,19,999కే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్: అసలు ధర రూ. 1,49,400 ఉండగా, అమెజాన్ డీల్‌లో భాగంగా రూ. 1,40,400కు లభిస్తోంది.
ఐక్యూ 15: ఈ స్మార్ట్‌ఫోన్ వాస్తవ ధర రూ. 76,999. కానీ అమెజాన్ సేల్‌లో ఇది రూ. 65,999కే వస్తోంది.
వన్‌ప్లస్ 15: ఈ మొబైల్ వాస్త ధర రూ. 76,999. సేల్‌లో ధర రూ. 68,999.
ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో- రూ. 1,09,999గా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ సేల్‌లో రూ. 98,999కే దక్కుతోంది.
వివో ఎక్స్300 5జీ- రూ. 83,999గా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లో రూ. 75,999కే లభిస్తోంది.
- 7600ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 200ఎంపీ కెమెరాతో iQOO Z11 Turbo లాంచ్- ధరకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాంక్ ఆఫర్లు, అదనపు ప్రయోజనాలు..
కేవలం ధరల తగ్గింపు మాత్రమే కాకుండా, కొనుగోలుదారుల కోసం మరిన్ని వెసులుబాటులను అమెజాన్ కల్పించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్రెడిట్ కార్డ్ వినియోగదారులు లేదా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే వారికి 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ వాడే వారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ సౌకర్యం ఉంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అదుర్స్! మీ దగ్గర ఉన్న పాత ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను మార్చుకుని కొత్తవి కొనుగోలు చేసేందుకు ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీ పాత డివైజ్ కండిషన్‌ను బట్టి మంచి ధర పొందే వీలుంది. వీటితో పాటు నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్లు, డిస్కౌంట్ కూపన్లతో షాపింగ్‌ను మరింత సులభతరం చేసింది. ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకే ఉంటాయి కాబట్టి, మీకు నచ్చిన వస్తువును వెంటనే ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


