7600ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 200ఎంపీ కెమెరాతో iQOO Z11 Turbo లాంచ్- ధర ఎంతంటే..
ఐకూ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఐక్యూ జెడ్11 టర్బో’ని విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ గ్యాడ్జెట్ ధర సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త ‘ఐక్యూ జెడ్11 టర్బో’ని సంస్థ తాజాగా చైనా మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. తన ‘జెడ్’ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా దీనిని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చైనాలోని కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో, ఐదు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

ఐక్యూ జెడ్11 టర్బో- ధర, లభ్యత..
చైనా మార్కెట్లో ఈ ఐక్యూ జెడ్11 టర్బో స్మార్ట్‌ఫోన్ ధరలు బేస్ వేరియంట్ (12GB+256GB) దాదాపు రూ. 35,999 (2,699 యువాన్లు) నుంచి ప్రారంభమవుతున్నాయి. హై-ఎండ్ మోడల్ అయిన 16GB+1TB వేరియంట్ ధర సుమారు రూ. 52,000 (3,999 యువాన్లు)గా ఉంది.
పోలార్ నైట్ బ్లాక్, స్కైలైట్ వైట్ వంటి సరికొత్త రంగుల్లో ఈ ఫోన్ వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా లభిస్తోంది.
భారత్‌లో ఈ ఐక్యూ జెడ్11 టర్బో లాంచ్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఈ మోడల్ త్వరలోనే లాంచ్ అవుతుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ఐక్యూ జెడ్11 టర్బో- ఫీచర్లు..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరా, బ్యాటరీ అని చెప్పొచ్చు. ఐక్యూ తన ‘జెడ్’ సిరీస్‌లో తొలిసారిగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను (శాంసంగ్ హెచ్‌పీ5 సెన్సార్) పరిచయం చేసింది. దీనికి తోడు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
ఇక బ్యాటరీ విషయానికొస్తే, ఇది నిజంగా ఒక ‘మాన్స్టర్’ అని చెప్పాలి. ఏకంగా 7600ఎంఏహెచ్ బడా భారీ బ్యాటరీతో పాటు 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 23 రోజుల పాటు స్టాండ్‌బై టైమ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సెమీ-సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ఎండలో లేదా చలిలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని అంటోంది.
ఇతర ఫీచర్లు-
డిస్ప్లే: ఈ ఐక్యూ జెడ్11 టర్బో 6.59 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది కళ్లకు ఇబ్బంది కలగకుండా 4,320హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్: క్వాల్కమ్ సరికొత్త 3ఎన్ఎం ‘స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5’ చిప్‌సెట్‌తో అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా ‘క్యూ3’ చిప్‌ను కూడా ఇందులో వాడారు.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది.
ఐపీ68+ఐపీ69 రేటింగ్‌తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఇన్-డిస్ప్లే 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వై-ఫై 7, 5జీ కనెక్టివిటీ ఉన్నాయి.
చూడడానికి స్టైలిష్‌గా, చేతిలో పట్టుకుంటే ప్రీమియం అనుభూతినిచ్చేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయంలో రాజీపడని వారు, ముఖ్యంగా గేమర్స్, ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ ఐక్యూ జెడ్11 టర్బో ఒక వరమని చెప్పవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


