రూ. 14,999 విలువ చేసే స్మార్ట్‌వాచ్.. రూ. 1,999కే! అమెజాన్ సేల్‌లో వీటిపై భారీ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 కొనసాగుతోంది. రెడ్‌మీ, బోట్, నోయిస్ వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అదనపు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కొత్త ఏడాదిలో సరికొత్త స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం. ‘అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’లో వందలాది ఉత్పత్తులపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మీ, బోట్, నోయిస్, అమేజ్‌ఫిట్ వంటి దిగ్గజ బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లను వాటి అసలు ధర కంటే చాలా తక్కువకే సొంతం చేసుకోవచ్చు. అధునాతన ఫిట్‌నెస్ ట్రాకింగ్, సెన్సార్లు, స్టైలిష్ డిజైన్లతో కూడిన ప్రీమియం వాచీలపై అమెజాన్ ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో తగ్గింపు ధరకు లభిస్తున్న స్మార్ట్‌వాచ్‌ల వివరాలను ఇక్కడ చూసేయండి..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026- ఈ స్మార్ట్‌వాచ్‌లపై ఆఫర్లు..
ఈ సేల్‌లో అందరి దృష్టి బడ్జెట్ ధరలో దొరికే స్మార్ట్‌వాచ్‌లపైనే ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం:
అమేజ్‌ఫిట్ బిప్ 6: దీని అసలు ధర రూ. 14,999 కాగా, ప్రస్తుతం సేల్‌లో కేవలం రూ. 6,499కే లభిస్తోంది. ఇందులో అమోలెడ్ స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉండటం విశేషం.
రెడ్‌మీ వాచ్ 5 లైట్: రూ. 6,999 విలువైన ఈ వాచ్‌ను ఇప్పుడు కేవలం రూ. 3,299కే కొనుగోలు చేయవచ్చు.
నాయిస్ ఎండీవర్ ప్రో: రూ. 10,999 విలువైన ఈ స్మార్ట్‌వాచ్‌ని ఇప్పుడు రూ. 9,999కి కొనుక్కోవచ్చు.
ఫైర్-బోల్ట్ టాక్: రూ. 14,999 ధరతో వచ్చే ఈ వాచ్ ఇప్పుడు రూ. 1,199కే సొంతం చేసుకోవచ్చు.
క్రాస్‌బీట్స్ ఎవరెస్ట్ 2.0: ఈ స్మార్ట్‌వాచ్ వాస్తవ ధర రూ. 9,999. అమెజాన్ సేల్‌లో రూ. 3,299కి పొందొచ్చు.
నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3: ఈ స్మార్ట్‌వాచ్ వాస్తవ ధర రూ. 6,999. అమెజాన్ సేల్‌లో రూ. 1,099కి పొందొచ్చు.
ఈ వాచీలు మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడమే కాకుండా, స్లీప్ ట్రాకింగ్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్నాయి.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్- బ్యాంక్ ఆఫర్లు..
ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో డిస్కౌంట్లతో పాటు అమెజాన్ మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తోంది:
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ ద్వారా పేమెంట్ చేసే వారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం వరకు ఫిక్స్‌డ్ క్యాష్‌బ్యాక్ ఉంటుంది.
ఇవే కాకుండా నో-కాస్ట్ ఈఎమ్‌ఐ, కూపన్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్‌వాచ్‌లతో పాటు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, అమెజాన్ ఎకో డివైజ్‌లపై కూడా భారీ డీల్స్ ఉన్నాయి. స్టాక్ ముగిసేలోపే మీకిష్టమైన గ్యాడ్జెట్‌లను తక్కువ ధరకే ఆర్డర్ చేసుకోండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


