గత కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సీఈఓ కావ్య మారన్, రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ముచ్చట ఎట్టకేలకు నిజమైంది! ఎలాంటి ముందస్తు ప్రెస్ నోట్లు లేదా పీఆర్ టీమ్‌ల సోషల్ మీడియా పోస్టులు లేకుండానే ఈ వెడ్డింగ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతిమణి కావేరి మారన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. తమ కుమార్తె కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ల వివాహ విందుకు సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ముఖ్యమంత్రి అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు.
"సన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ కళానిధి మారన్, ఆయన సతిమణి శ్రీమతి కావేరి మారన్ జూబ్లీహిల్స్‌లోని మా నివాసంలో నన్ను కలిసి, తమ కుమార్తె కావ్య మారన్ వివాహ విందుకు ఆహ్వానించారు. కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ల వెడ్డింగ్ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనుంది," అని సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రకటనలో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మ్యూజిక్ కింగ్ అనిరుధ్, బిజినెస్ క్వీన్ కావ్య మారన్ సంపదకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ చూసేయండి..
అనిరుధ్ సంపాదన ఎంత?
'వై దిస్ కొలవెరి డి' పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్.. ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు! రజినీకాంత్, విజయ్, అజిత్ వంటి తమిళ అగ్ర హీరోల సినిమాలతో పాటు షారుఖ్ ఖాన్ 'జవాన్' లాంటి పాన్-ఇండియా చిత్రాలకు సంగీతం అందించిన అనిరుధ్ నెట్ వర్త్ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా.
సినిమా సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్‌లు, లైవ్ కన్సర్ట్లు, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అనిరుధ్ భారీగా సంపాదిస్తున్నారు.
{{/usCountry}}సినిమా సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్‌లు, లైవ్ కన్సర్ట్లు, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అనిరుధ్ భారీగా సంపాదిస్తున్నారు.
{{/usCountry}}ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం 'ఏఏ23' కి కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
కావ్య మారన్ సామ్రాజ్యం.. వందల కోట్ల ఆస్తి!
భారతదేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యాల్లో ఒకటైన 'సన్ గ్రూప్' అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ల కుమార్తె ఈ కావ్య మారన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి నేతృత్వం వహిస్తున్న కావ్య మారన్ ఆస్తుల విలువ రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా! సన్ టీవీ నెట్వర్క్, ఐపీఎల్ టీమ్, కంపెనీ వాటాలు, డివిడెండ్ల ద్వారా ఆమెకు భారీగా ఆదాయం వస్తుంది.
ఇక అనిరుద్, కావ్య మారన్ మొత్తం ఆస్తుల విలువ కలిపితే సుమారు రూ. 450 కోట్ల నుంచి రూ. 560 కోట్ల వరకు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్!
1991లో చెన్నైలో జన్మించిన కావ్య మారన్, చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యూకేలోని ప్రసిద్ధ వార్విక్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ విద్యను అభ్యసించారు. సాధారణ కార్పొరేట్ ఉద్యోగాల వైపు వెళ్లకుండా, క్రీడారంగంపై ఉన్న ఆసక్తితో 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.
కలర్‌ఫుల్ బ్రాండింగ్, ప్లేయర్ల ఎంపిక, టీమ్ ఆపరేషన్లలో ఆమె తనదైన ముద్ర వేశారు. 2024 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఫైనల్స్ చేరుకోవడంలో కావ్య మారన్ వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. క్రీడా ప్రపంచంలో సాధించిన విజయాలకు గానూ 'ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్', 'ది హాలీవుడ్ రిపోర్టర్' ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ జాబితాల్లో ఆమె చోటు సంపాదించుకున్నారు.