మచ్ అవైటెడ్ ఐఫోన్ 18 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. భారీ అంచనాలతో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, దీని ధర చూసి యాపిల్ లవర్స్ సైతం షాక్ అయ్యారు! పాత ఐఫోన్ 17 ప్రోతో పోల్చితే.. ఈ కొత్త ఐఫోన్ 18 ప్రో ధర ఏకంగా రూ. 30వేలు ఎక్కువగా ఉంది. ఎందుకు ఇలా? ఐఫోన్ 18 ప్రోకి ఐఫోన్ 17 ప్రోకి మధ్య ఉన్న వ్యత్యాసాలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐఫోన్ 18 ప్రో వర్సెస్ ఐఫోన్ 17 ప్రో- ధర..

గత ఏడాది విడుదలైన ఐఫోన్ 17 ప్రో 256జీబీ ప్రారంభ ధర రూ. 1,34,900 కాగా, 512జీబీ వేరియంట్ ధర రూ. 1,54,900, 1టీబీ వేరియంట్ ధర రూ. 1,74,900గా ఉండేది. అయితే, ఈసారి యాపిల్ ధరల శ్లాబ్‌ను భారీగా పెంచేసింది. కొత్త ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధరను భారత మార్కెట్లో రూ. 1,64,900గా నిర్ణయించింది. అంటే బేస్ మోడల్‌పైనే దాదాపు రూ. 30,000 భారం పెరిగింది!
దిగుమతి సుంకాలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ప్రభావం కూడా ఈ స్థాయిలో ధర పెరగడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సెప్టెంబర్ 12, 2026 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతుండగా, సెప్టెంబర్ 18 నుంచ విక్రయాలు షురూ అవుతాయి.
ఐఫోన్ 18 ప్రో వర్సెస్ ఐఫోన్ 17 ప్రో- డిస్‌ప్లే, డిజైన్..
స్క్రీన్ విషయంలో యాపిల్ పెద్దగా మార్పులు చేయలేదు. రెండింటిలోనూ 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. 120హెచ్‌జెడ్ ప్రోమోషన్, హెచ్డీఆర్10, డాల్బీ విజన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు పాత మోడల్ తరహాలోనే కొనసాగాయి. డిజైన్ విభాగంలో రీడిజైన్ చేసిన 'డైనమిక్ ఐలాండ్' ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది ఒకేసారి మూడు లైవ్ యాక్టివిటీలను స్క్రీన్‌పై చూపించగలదు. ఇక రంగుల విషయానికొస్తే.. పాత సిల్వర్, కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ రంగుల స్థానంలో కొత్తగా బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, బర్గండీ రంగులను ప్రవేశపెట్టారు.
ఐఫోన్ 18 ప్రో వర్సెస్ ఐఫోన్ 17 ప్రో- చిప్‌సెట్, ఏఐ..
ఐఫోన్ 17 ప్రోలో 3ఎన్ఎం ప్రాసెస్‌పై తయారైన ఏ19 ప్రో చిప్‌సెట్ ఉంటుంది. కొత్త ఐఫోన్ 18 ప్రోలో అత్యంత శక్తివంతమైన 2ఎన్ఎం ఏ20 ప్రో చిప్‌సెట్‌ను అమర్చారు. ఇందులో 6-కోర్ సీపీయూ, 40 శాతం వేగవంతమైన 7-కోర్ జిపీయూ ఉన్నాయి. దీనికి 50 శాతం అదనపు మెమరీ బ్యాండ్‌విడ్త్, డ్యూయల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ తోడవ్వడంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాసెసింగ్ సామర్థ్యం రెట్టింపైంది. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు, పాత మోడల్ కంటే ఎక్కువ పరిమాణం ఉన్న రీడిజైన్డ్ 'వేపర్ ఛాంబర్' కూలింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు. ఇది భారీ గేమింగ్ సమయంలో ఫోన్ పనితీరును 40 శాతం వరకు స్థిరంగా ఉంచుతుంది.
ఐఫోన్ 18 ప్రో వర్సెస్ ఐఫోన్ 17 ప్రో- ఫోటోగ్రఫీ..
{{/usCountry}}ఐఫోన్ 17 ప్రోలో 3ఎన్ఎం ప్రాసెస్‌పై తయారైన ఏ19 ప్రో చిప్‌సెట్ ఉంటుంది. కొత్త ఐఫోన్ 18 ప్రోలో అత్యంత శక్తివంతమైన 2ఎన్ఎం ఏ20 ప్రో చిప్‌సెట్‌ను అమర్చారు. ఇందులో 6-కోర్ సీపీయూ, 40 శాతం వేగవంతమైన 7-కోర్ జిపీయూ ఉన్నాయి. దీనికి 50 శాతం అదనపు మెమరీ బ్యాండ్‌విడ్త్, డ్యూయల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ తోడవ్వడంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాసెసింగ్ సామర్థ్యం రెట్టింపైంది. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు, పాత మోడల్ కంటే ఎక్కువ పరిమాణం ఉన్న రీడిజైన్డ్ 'వేపర్ ఛాంబర్' కూలింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు. ఇది భారీ గేమింగ్ సమయంలో ఫోన్ పనితీరును 40 శాతం వరకు స్థిరంగా ఉంచుతుంది.
ఐఫోన్ 18 ప్రో వర్సెస్ ఐఫోన్ 17 ప్రో- ఫోటోగ్రఫీ..
{{/usCountry}}కెమెరా విభాగంలో యాపిల్ సరికొత్త సాంకేతికతను జోడించింది. ఐఫోన్ 17 ప్రోలోని ట్రిపుల్ 48ఎంపీ కెమెరా సెటప్ అద్భుతంగా పనిచేసేది. ఐఫోన్ 18 ప్రోలోని 48ఎంపీ ఫ్యూజన్ మెయిన్ కెమెరాకు ‘వేరియబుల్ అపెర్చర్’ టెక్నాలజీని అమర్చారు. యాపిల్ చరిత్రలోనే ఇది ప్రథమం. ఆరు లేజర్ కట్ బ్లేడ్లతో కూడిన ఈ సిస్టమ్, వెలుతురు ఆధారంగా నాలుగు రకాల అపెర్చర్ సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కోసం అపెర్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్‌ను మ్యాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకునే సదుపాయం ఇచ్చారు. ఫొటో తీసిన తర్వాత ఎడిటింగ్ జరిగిందో లేదో గుర్తించే 'యాపిల్ రిఫరెన్స్ ఇమేజ్' ఫీచర్‌ను కూడా చేర్చారు.
ఐఫోన్ 18 ప్రో వర్సెస్ ఐఫోన్ 17 ప్రో- బ్యాటరీ, ఛార్జింగ్..
బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఐఫోన్ 18 ప్రో మరింత మెరుగైంది. దీని ఈసిమ్ మోడల్ ఏకంగా 36 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుందని సంస్థ ప్రకటించింది. ఛార్జింగ్ వేగం కూడా పెరిగింది. వైర్డ్ ఛార్జింగ్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది (17 ప్రోకి 20 నిమిషాలు పట్టేది). వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా 50 శాతం పూర్తి కావడానికి దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది.