యాపిల్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ 'ఐఫోన్ డ్యుయో' ఇటీవలే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్భాటంగా విడుదలైంది. అయితే, భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 3లక్షల భారీ ప్రారంభ ధర కలిగిన ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే వినియోగదారులకు మైండ్ బ్లాంకింగ్ షాక్ తగిలింది! ఫోన్ లోపలి భాగంలో ఉండే మెయిన్ డిస్ప్లే హింజ్ (మడత కీలు) వద్ద నిలువుగా పగుళ్లు (క్రాక్స్) వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ ప్రారంభమైంది.

సాధారణంగా ఫస్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లలో డిస్ప్లే సంబంధిత సమస్యలు రావడం సహజమే అయినా, ఫోన్ కొనుగోలు చేసిన కేవలం 6 గంటల వ్యవధిలోనే స్క్రీన్ విరిగిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
20 సార్లు మడతపెట్టేసరికే డిస్ప్లే ధ్వంసం!
రెడ్డిట్ వేదికగా 'Midnight_Slump' అనే ఆస్ట్రేలియాకు చెందిన వినియోగదారుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. ఐఫోన్ డ్యుయో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ డెలివరీ తీసుకున్న ఆరు గంటల వ్యవధిలోనే లోపలి ప్రైమరీ స్క్రీన్ విరిగిపోయిందని ఆయన పేర్కొన్నారు. డేటా రికవరీ పూర్తయ్యాక తన స్నేహితుడికి ఫోన్ చూపిద్దామని ఓపెన్ చేస్తుండగా, హింజ్ లోపలి భాగం నుంచి చిన్నగా చప్పుడు (క్రాక్ సౌండ్) వినిపించిందని, చూసేసరికి మడత మధ్య భాగంలో స్క్రీన్ క్రాక్ అయి సరిగ్గా పనిచేయకుండా పోయిందని వాపోయారు. తాను అప్పటికి 20 సార్లు కంటే తక్కువే ఫోన్ను మడతపెట్టానని ఆయన వెల్లడించారు.
వెంటనే ఆయన సమీపంలోని యాపిల్ స్టోర్కు వెళ్లగా, ప్రతినిధులు క్షమాపణలు చెప్పి వెంటనే కొత్త ఫోన్ను రిప్లేస్ చేసి ఇచ్చినట్లు తెలిపారు. ఇతను ఒక్కడే కాకుండా చైనాలోని ప్రముఖ డిజిటల్ కమ్యూనిటీల నుంచి సేకరించిన అనేక ఫోటోలను 'Bitter_Offer7123' అనే మరొక యూజర్ షేర్ చేశారు. వాటిలో కూడా సరిగ్గా హింజ్ భాగంలోనే డిస్ప్లే క్రాక్ అయి పచ్చటి, తెల్లటి లైన్లు కనిపిస్తున్నాయి.
డిజైన్ లోపమా? లేదా తయారీ లోపమా?
ధ్వంసమైన డ్యుయో ఫోన్లను ప్రస్తుతం యాపిల్ ఇంజనీరింగ్ బృందం స్వాధీనం చేసుకుని లోతుగా విశ్లేషిస్తోంది. ఇది కేవలం ప్రారంభ బ్యాచ్లో జరిగిన తయారీ లోపమా లేక హింజ్ డిజైన్లో ఉన్న ప్రధాన బలహీనతా (డిజైన్ ఫ్లా) అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
{{/usCountry}}ధ్వంసమైన డ్యుయో ఫోన్లను ప్రస్తుతం యాపిల్ ఇంజనీరింగ్ బృందం స్వాధీనం చేసుకుని లోతుగా విశ్లేషిస్తోంది. ఇది కేవలం ప్రారంభ బ్యాచ్లో జరిగిన తయారీ లోపమా లేక హింజ్ డిజైన్లో ఉన్న ప్రధాన బలహీనతా (డిజైన్ ఫ్లా) అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
{{/usCountry}}టెక్ యూట్యూబర్లు ‘టిమ్ పాన్’, విలేకరి 'జోనా స్టెర్న్' వంటివారు లాంచ్కు ముందు నిర్వహించిన డ్యూరబిలిటీ టెస్టుల్లో వేలాది సార్లు మడతపెట్టినా స్క్రీన్లు ఏమాత్రం పాడవలేదు! అయితే సాధారణ వినియోగదారులు చేతిలోకి వచ్చాక వస్తున్న ఫిర్యాదులు యాపిల్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో శాంసంగ్ కూడా తన మొదటి తరం 'గెలాక్సీ ఫోల్డ్' తెచ్చినప్పుడు ఇలాంటి ఎదురుదెబ్బలే తగిలాయి! ఇప్పుడు యాపిల్ కూడా సరిగ్గా అదే రకమైన ‘క్రాక్గేట్’ సమస్యను ఎదుర్కొంటోంది. బాధితులకు యాపిల్ స్టోర్లు వెంటనే కొత్త ఫోన్లు అందిస్తున్నప్పటికీ, ఈ సమస్య విస్తరిస్తే రిప్లేస్మెంట్ స్టాక్ కొరత ఏర్పడే ప్రమాదముంది.