భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ప్రీమియం స్కూటర్లకు పేరుగాంచిన ఏథర్ ఎనర్జీ.. కుటుంబ వాహనదారులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ‘కోనార్క్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 99,999గా నిర్ణయించారు. సంస్థ గతేడాది ప్రకటించిన విప్లవాత్మక ‘ఈఎల్ ప్లాట్‌ఫామ్’పై రూపుదిద్దుకున్న తొలి మోడల్ ఇదే కావడం విశేషం.

పటిష్టమైన స్టీల్ యూనిబాడీ ఛాసిస్, పూర్తి మెటల్ బాడీతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, కఠినమైన రోడ్డు పరిస్థితులను తట్టుకునేలా అత్యంత దృఢంగా ఉంటుంది. 1,352 ఎంఎం వీల్‌బేస్‌తో డిజైన్ చేసిన ఈ వాహనం, ప్రస్తుతం భారత మార్కెట్లోని ఏ ఇతర స్కూటర్లోనూ లేని సుదీర్ఘ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. దీనికి తోడు ముందు వైపు 14 అంగుళాలు, వెనుక వైపు 12 అంగుళాల పెద్ద చక్రాలు, 31 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్ (బూట్ స్పేస్) ఇచ్చారు.
ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- వేరియంట్లు, ధరలు..
ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కస్టమర్ల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా విభిన్న బ్యాటరీ ఆప్షన్లలో ప్రవేశపెట్టారు:
{{/usCountry}}ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కస్టమర్ల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా విభిన్న బ్యాటరీ ఆప్షన్లలో ప్రవేశపెట్టారు:
{{/usCountry}}కోనార్క్ ఎస్ (100 కి,మీ రేంజ్ - 2.1 kWh బ్యాటరీ): ప్రారంభ ధర రూ. 99,999. దీని డెలివరీలు 2027 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి.
కోనార్క్ ఎస్ (125 కి.మీ రేంజ్ - 2.7 kWh బ్యాటరీ): ధర రూ. 1,21,999. డెలివరీలు సెప్టెంబర్ 2026 నుంచి మొదలవుతాయి.
కోనార్క్ ఎస్ (161 కి.మీ రేంజ్ - 3.5 kWh బ్యాటరీ): ధర రూ. 1,44,999. డెలివరీలు సెప్టెంబర్ 2026 నుంచి అందుబాటులోకి వస్తాయి.
భవిష్యత్తులో ఏకంగా 200 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే మరో వర్షన్‌ను 2027 మూడో త్రైమాసికంలో తెచ్చేందుకు ఏథర్ సన్నాహాలు చేస్తోంది. వీటితో పాటు 'కోనార్క్ జెడ్' శ్రేణిని కూడా ఆవిష్కరించారు, వీటి ధరలను త్వరలోనే ప్రకటించనున్నారు.
ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- పవర్, స్పీడ్..
ఈ స్కూటర్లలో ఐపీ67 వాటర్ ప్రూఫ్ రేటింగ్ కలిగిన పవర్ ఫుల్ పీఏఎంఎస్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఎంట్రీ-లెవెల్ మోడల్ 4 కేడబ్ల్యూ పీక్ పవర్, 16 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగా, మిగతా రెండు మోడళ్లు 4.7 కేడబ్ల్యూ పవర్, 16 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తాయి. అన్ని వేరియంట్ల గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లుగా ఉంటుంది. 125 కి.మీ, 161 కి.మీ వేరియంట్లు కేవలం 4.7 సెకన్లలోనే 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటాయి.
రోజువారీ వాస్తవిక ప్రయాణాల్లో 'స్మార్ట్ ఎకో' మోడ్ ఆధారంగా చూస్తే.. 100 కి.మీ మోడల్ 80 కి.మీ, 125 కి.మీ మోడల్ 100 కి.మీ, 161 కి.మీ మోడల్ 130 కి.మీ 'ట్రూ రేంజ్' ఇస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- భద్రతా సాంకేతికత..
ఏథర్ తన కోనార్క్ స్కూటర్ ద్వారా 'అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్' (ఏఈబీఎస్)ను తొలిసారిగా వాహన ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సాంకేతికత బ్రేకింగ్ సామర్థ్యాన్ని 20 శాతం పెంచడమే కాకుండా, అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు వెనుక చక్రం స్కిడ్ అవ్వకుండా లేదా లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. మిగతా మోడళ్లలో ముందు భాగంలో 220 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ అందించారు. వీటితో పాటు ఆటోహోల్డ్, ఫాల్ సేఫ్, ఎయిర్ వాక్, మ్యాజిక్ ట్విస్ట్, పార్క్ అసిస్ట్ (రివర్స్ మోడ్) వంటి అదనపు సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- ఛార్జింగ్ సమయం, హైటెక్ ఫీచర్లు..
సాధారణ 450డబ్ల్యూ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో స్కూటర్ 0-80 శాతం ఛార్జ్ కావడానికి బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి 4 గంటల నుంచి 5 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. అయితే కాంబో ఛార్జర్ ఆప్షన్ ద్వారా ఈ ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్న కేవలం 2 గంటల నుంచి 3 గంటల 10 నిమిషాల్లోనే ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 13 నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చు.
టాప్ వేరియంట్లలో 7 ఇంచుల 'డీప్‌వ్యూ' డిజిటల్ స్క్రీన్, బ్లూటూత్, ఇన్-బిల్ట్ సిమ్ కనెక్టివిటీ, ఓటీఏ అప్‌డేట్లను చేర్చారు. మూడేళ్ల పాటు ఉచితంగా లభించే 'ఏథర్ కనెక్ట్' ద్వారా స్కూటర్ లైవ్ ఛార్జింగ్ స్టేటస్, యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్, ఫైండ్ మై స్కూటర్ వంటి సేవలను పొందవచ్చు. టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ హోల్డర్ సౌకర్యం కూడా ఉంది.
ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- 10 ఏళ్ల వరకు బ్యాటరీ వారంటీ!
వాహనానికి, బ్యాటరీకి సాధారణంగా 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. అయితే 'ఏథర్‌స్టాక్ ప్రో' ప్యాకేజీ ద్వారా వినియోగదారులు తమ అవసరానికి తగినట్లుగా ఈ ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ వారంటీని 5 ఏళ్లు/60 వేల కి.మీ, 8 ఏళ్లు/80 వేల కి.మీ లేదా ఏకంగా 10 ఏళ్లు/1 లక్ష కిలోమీటర్ల వరకు పెంచుకునే గొప్ప వెసులుబాటును ఏథర్ కల్పించింది.