...
...
Next Story

Ather Konarc : ఏథర్​ నుంచి బడ్జెట్​ ఎలక్ట్రిక్ స్కూటర్- ‘కోనార్క్' లాంచ్ డేట్ ఫిక్స్..

ఏథర్ ఎనర్జీ తన సరికొత్త EL01 ప్లాట్‌ఫారమ్ ఈవీ స్కూటర్‌కు 'కోనార్క్' అని పేరు పెట్టింది. సీఈఓ తరుణ్ మెహతా దీని టీజర్‌ను విడుదల చేశారు. ఆగస్టు 29న మార్కెట్లోకి రానున్న ఈ బడ్జెట్ ఈవీ స్కూటర్ విశేషాలివే!

Published on: Aug 5, 2026, 19:15:13 IST
Advertisement

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ.. ఈఎల్​01 ప్లాట్‌ఫారమ్ ఆధారిత ఎలక్ట్రిక్​ స్కూటర్​ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ను సంస్థ తాజాగా పంచుకుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్‌ను సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో పంచుకున్నారు. ఈ వీడియో ద్వారా కంపెనీ ఈ వాహనానికి ‘కోనార్క్’ అని నామకరణం చేసినట్లు స్పష్టమైంది.

ఏథర్​ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్ (Tarun Mehta/X)
ఏథర్​ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్ (Tarun Mehta/X)

ప్రతి ఏటా ఏథర్ నిర్వహించే ‘ఏథర్ కమ్యూనిటీ డే’ ఈవెంట్‌లో భాగంగా ఆగస్టు 29, 2026న ఈ సరికొత్త ఈ-స్కూటర్‌ను సంస్థ అధికారికంగా మార్కెట్లోకి ఆవిష్కరించనున్నారు.

తాజాగా విడుదలైన ఈ టీజర్ వీడియోలో.. ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన కీలక ఎక్స్​టీరియర్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ముందు- వెనుక భాగాల్లో యూ-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ముందు వైపు డిస్క్ బ్రేక్, ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఈ స్కూటర్‌లో 14-ఇంచ్ సైజు కలిగిన 90/90 సెక్షన్ టైరును ఉపయోగించినట్లు తెలుస్తోంది.

వినూత్నమైన కొత్త ప్లాట్‌ఫారమ్..

గత ఏడాది కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఏథర్ తొలిసారిగా ఈఎల్01 కాన్సెప్ట్ స్కూటర్‌ను ప్రదర్శించింది. స్మూత్ బాడీ ప్యానెల్స్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, ప్రయాణికులకు అనువుగా ఉండేలా వెనుక వైపు కాస్త ఎత్తుగా ఉండే పొడవైన సింగిల్-పీస్ సీట్‌తో ఇది లభించనుంది.

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత ఉండొచ్చు?

ఈఎల్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతున్న ఈ ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సంస్థ లైనప్‌లోనే అత్యంత సరసమైన (బడ్జెట్ ఫ్రెండ్లీ) మోడల్‌గా నిలవనుంది. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఏథర్‌కు ఇది కీలకమైన అడుగు అని చెప్పవచ్చు.

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- హార్డ్‌వేర్, ఇతర ఫీచర్లు..

కంపెనీ ఇంకా పూర్తి సాంకేతిక వివరాలను ధ్రువీకరించనప్పటికీ, రోడ్డుపై పరీక్షల సమయంలో కనిపించిన స్పెసిఫికేషన్ల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు వైపు 14-ఇంచ్, వెనుక వైపు 12-ఇంచ్ అలాయ్ వీల్స్ ఉండే అవకాశం ఉంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ కాంబినేషన్‌ను ఖరారు చేశారు. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, ఇతర స్మార్ట్ ఫీచర్లను సపోర్ట్ చేసే 7-ఇంచ్ టీఎఫ్‌టీ డిస్​ప్లేని కూడా ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe