హైదరాబాద్, మార్చి 18, 2026: భారతదేశంలోనే అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా ఎదిగి, త్వరలో 'యూనివర్సల్ బ్యాంక్'గా మారేందుకు ఆర్బీఐ నుంచి ప్రాథమిక అనుమతి పొందిన ఏకైక సంస్థ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU SFB). తాజాగా ఈ బ్యాంక్ తెలంగాణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని హుజూరాబాద్, ఖమ్మం, వేములవాడ ప్రాంతాల్లో తన ప్రత్యేక గోల్డ్ లోన్ బ్రాంచ్‌లను ప్రారంభించడం ద్వారా దక్షిణ భారత దేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది.

ఇటీవల గుజరాత్‌లో సక్సెస్‌ఫుల్‌గా బ్రాంచ్‌లను ప్రారంభించిన తర్వాత, బ్యాంక్ తన తదుపరి అడుగును తెలంగాణ వైపు వేసింది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి ప్రజల్లో ఉన్న అధిక బంగారం నిల్వలు మరియు తక్షణ నగదు అవసరాల (లిక్విడిటీ) కోసం పెరిగిన డిమాండ్.
తెలంగాణపైనే ఎందుకు గురి?
జనవరి 2026 నాటి గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో అక్షరాలా రూ. 15.6 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడు ఏయూ బ్యాంక్ ఈ కింది కీలక ప్రాంతాలను ఎంచుకుంది.
- హుజూరాబాద్: ఇక్కడ వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలు ఎక్కువ. పెట్టుబడి కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకునే సంస్కృతి ఇక్కడ మెండుగా ఉంది.
- వేములవాడ: ప్రముఖ దేవాలయ పట్టణం కావడంతో పండుగలు, వివాహాలు మరియు నగల వ్యాపారం ఇక్కడ నిరంతరం చురుగ్గా ఉంటాయి.
- ఖమ్మం: ఇక్కడ ఎంఎస్‌ఎంఈలు (MSME), వాణిజ్య సంస్థలు పెద్ద మొత్తంలో బంగారు రుణాలను ఆశ్రయిస్తుంటాయి.
ఏయూ బ్యాంక్ గోల్డ్ లోన్ ప్రత్యేకతలు:
ఈ ప్రత్యేక బ్రాంచ్‌లలో కేవలం బంగారు రుణాలపైనే సిబ్బంది దృష్టి సారిస్తారు. ఆభరణాల విలువను వేగంగా నిర్ధారించడం, పోటీ వడ్డీ రేట్లు అందించడం, ఆర్బీఐ నిబంధనల ప్రకారం గరిష్ట రుణ విలువ (LTV) కల్పించడం వంటి సేవలు ఇక్కడ లభిస్తాయి. ముఖ్యంగా అసంఘటిత రంగం లేదా వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి ఇబ్బంది పడే చిన్న వ్యాపారులు, రైతులకు ఈ బ్రాంచ్‌లు ఒక వరంలా మారనున్నాయి.
“భారతీయ కుటుంబాల్లో, ముఖ్యంగా తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక ఆర్థిక భద్రత. స్థానిక ఆర్థిక వ్యవస్థలో బంగారు రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మా ప్రత్యేక బ్రాంచ్‌ల ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ భద్రత, పారదర్శకమైన విలువ నిర్ధారణ, వేగవంతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తున్నాం. కేవలం ఎన్‌బీఎఫ్‌సీలకే పరిమితం కాకుండా, కస్టమర్లకు కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడమే మా లక్ష్యం” అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ సీఈఓ ఉత్తమ్ తిబ్రేవాల్ వివరించారు.
{{/usCountry}}“భారతీయ కుటుంబాల్లో, ముఖ్యంగా తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక ఆర్థిక భద్రత. స్థానిక ఆర్థిక వ్యవస్థలో బంగారు రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మా ప్రత్యేక బ్రాంచ్‌ల ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ భద్రత, పారదర్శకమైన విలువ నిర్ధారణ, వేగవంతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తున్నాం. కేవలం ఎన్‌బీఎఫ్‌సీలకే పరిమితం కాకుండా, కస్టమర్లకు కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడమే మా లక్ష్యం” అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ సీఈఓ ఉత్తమ్ తిబ్రేవాల్ వివరించారు.
{{/usCountry}}ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిగా ఉన్న సమయంలో బంగారం ఎప్పుడూ సురక్షితమైన ఆస్తిగా నిలుస్తుంది. ఈ వ్యూహంతోనే ఏయూ బ్యాంక్ ఈ నెలాఖరు నాటికి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మరిన్ని బ్రాంచ్‌లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.