Aye Finance IPO : రేపటి నుంచి కొత్త ఐపీఓ సబ్స్క్రిప్షన్- జీఎంపీ ఎంత? 10 ముఖ్యాంశాలు..
ఎంఎస్ఎంఈలకు రుణాలందించే ఎన్బీఎఫ్సీ సంస్థ 'అయే ఫైనాన్స్' తన ఐపీఓను సోమవారం ప్రారంభించనుంది. రూ. 122 నుంచి రూ. 129 ప్రైజ్ బ్యాండ్‌తో వస్తున్న ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1010 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ప్రైమరీ మార్కెట్‌లో కొద్దిపాటి విరామం తర్వాత మళ్లీ వేగం పుంజుకుంటోంది. 'అయే ఫైనాన్స్' ఐపీఓ రేపు, ఫిబ్రవరి 9న సబ్‌స్క్రిప్షన్‌కి ఓపెన్కానుంది ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్బీఎఫ్సీ), తన షేర్ల విక్రయం కోసం ఒక్కో షేరుకు రూ. 122 నుంచి రూ. 129 ధరను ప్రైజ్ బ్యాండ్‌గా నిర్ణయించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ స్థాయి ఎంఎస్ఎంఈలకు వారి వర్కింగ్ క్యాపిటల్, వ్యాపార విస్తరణ అవసరాల కోసం రుణాలను అందిస్తుంది. తయారీ, వాణిజ్యం, సర్వీస్, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వినియోగదారులకు ఇది చిన్న తరహా వ్యాపార రుణాలను అందిస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ అయే ఫైనాన్స్ ఐపీఓకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అయే ఫైనాన్స్ ఐపీఓ- 10 ముఖ్య విషయాలు..
ఐపీఓ తేదీలు: అయే ఫైనాన్స్ ఐపీఓ ఫిబ్రవరి 9న ప్రారంభమై, ఫిబ్రవరి 11న ముగుస్తుంది. యాంకర్ బుక్ ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. షేర్ల కేటాయింపు ఫిబ్రవరి 12న జరుగుతుంది, ఫిబ్రవరి 16న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఐపీఓ పరిమాణం: ఇది రూ. 710 కోట్ల విలువైన కొత్త షేర్ల విక్రయం, రూ. 300 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కలయిక. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద కంపెనీ మొత్తం రూ. 1010 కోట్లు సేకరించాలని చూస్తోంది.
వాటాలను విక్రయిస్తున్న వారు: ఆల్ఫా వేవ్ ఇండియా, ఎంఏజే ఇన్వెస్ట్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఫండ్, ఎల్జీటీ క్యాపిటల్, కాపిటా జీఎల్‌పీ, విక్రమ్ జెట్లీ వంటి కార్పొరేట్, వ్యక్తిగత వాటాదారులు తమ వాటాలను విక్రయిస్తున్నారు.
ఐపీఓ టార్గెట్: అయే ఫైనాన్స్ ఐపీఓ ద్వారా కొత్త షేర్లను విక్రయించి, ఆ వచ్చే నిధులను సంస్థ మూలధన పునాదిని బలోపేతం చేయడానికి, భవిష్యత్తు వ్యాపార విస్తరణ అవసరాల కోసం వినియోగించనున్నారు.
లాట్ సైజ్: రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 116 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవాలి. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద కనీస పెట్టుబడి రూ. 14,964 అవుతుంది.
కేటాయింపులు: ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ కోసం 75శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ) కోసం 15శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10శాతం కేటాయించారు.
జీఎంపీ: అయే ఫైనాన్స్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఫిబ్రవరి 8న సున్నాగా ఉంది. అంటే ఎలాంటి లాభాలు, నష్టాలు లేవని అర్థం. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఐపీఓ జీఎంపీ భారీగా తగ్గింది. గతంలో రూ. 5గా ఉండగా, శుక్రవారం రూ. 1కి పడిపోయింది. ఇప్పుడు 0కి చేరింది.
అయితే.. కేవలం జీఎంపీ చూసి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం సరికాదని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
పోటీ సంస్థలు: కంపెనీ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ) ప్రకారం.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఈ అయే ఫైనాన్స్‌కి ప్రధాన లిస్టెడ్ పోటీదారులు.
ఆర్థిక వివరాలు: 2025 ఆర్థిక సంవత్సరంలో అయే ఫైనాన్స్ రూ. 175.3 కోట్ల లాభాన్ని నమోదు చేసింది (క్రితం ఏడాది రూ. 171.7 కోట్లు). నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) ఏడాది ప్రాతిపదికన 37.9% వృద్ధితో రూ. 858 కోట్లకు చేరుకుంది.
లీడ్ మేనేజర్లు: యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉండగా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా ఉంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












