టూ-వీలర్ మార్కెట్‌లో దశాబ్దాలుగా రారాజుగా కొనసాగుతున్న 'బజాజ్ పల్సర్ 150' ఇప్పుడు కొత్త అవతారమెత్తింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బజాజ్ ఆటో ఈ బెస్ట్ సెల్లింగ్ బైక్‌ని మరిన్ని ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. పాత క్లాసిక్ లుక్‌ను అలాగే ఉంచుతూ.. నేటి తరం యువతకు నచ్చేలా కాస్మెటిక్ మార్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ల ప్రారంభ ధర రూ. 1,08,772 (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది.
బజాజ్ పల్సర్ 150- ఏం మారాయి?

ఈ కొత్త అప్‌డేట్‌లో ప్రధానంగా వెలుతురు కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్‌ను ప్రవేశపెట్టారు. దీనితో పాటు ఇండికేటర్లు కూడా ఎల్ఈడీగా మారాయి. రాత్రి వేళ ప్రయాణించే వారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే వెనుక టెయిల్ ల్యాంప్ మాత్రం పాత హాలోజన్ సెటప్‌నే కొనసాగించారు.
ఇక లుక్ పరంగా చూస్తే, సరికొత్త గ్రాఫిక్స్.. బజాజ్ పల్సర్ 150 బైక్‌కి మరింత స్పోర్టీ అప్పీల్‌ను ఇచ్చాయి. ముఖ్యంగా డార్క్ గ్రీన్ రంగుపై ఆరెంజ్ లైన్లతో ఉన్న కొత్త కలర్ ఆప్షన్ పల్సర్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
- రికార్డుల వేటలో టాటా నెక్సాన్ ఈవీ.. లక్ష మైలురాయిని దాటిన తొలి ఎలక్ట్రిక్ కారు! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బజాజ్ పల్సర్ 150- టెక్నాలజీలో టాప్..
ఈసారి బజాజ్ పల్సర్ 150లో డిజిటల్ కన్సోల్‌ను చేర్చారు. ఇప్పటికే పల్సర్ ఎన్150, ఎన్160 మోడల్స్‌లో ఉన్న క్లస్టర్‌నే ఇందులోనూ వాడారు.
ఇందులో గేర్ పొజిషన్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్ వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా 'బజాజ్ రైడ్ కనెక్ట్' యాప్‌ను వాడుకోవచ్చు.
{{/usCountry}}బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా 'బజాజ్ రైడ్ కనెక్ట్' యాప్‌ను వాడుకోవచ్చు.
{{/usCountry}}దీనివల్ల బైక్ నడుపుతున్నప్పుడే కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లను స్క్రీన్ మీద చూసే వీలుంటుంది.
బజాజ్ పల్సర్ 150- ఇంజిన్, పనితీరు..
బైక్ మెకానికల్ ఎలిమెంట్స్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో నమ్మకమైన 149.5సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 13.8 బీహెచ్‌పీ పవర్‌ని, 13.25 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్6 ఫేజ్-2 నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ ఇంజిన్, లీటరుకు సుమారు 47.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.
ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్):
- పల్సర్ 150 సింగిల్ డిస్క్ (ఎస్డీ): రూ. 1,08,772
- పల్సర్ 150 ఎస్డీ యూజీ: రూ. 1,11,669
- పల్సర్ 150 ట్విన్ డిస్క్ (టీడీ యూజీ): రూ. 1,15,481
ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక గ్యాస్ ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్ ప్రయాణాన్ని సాఫీగా చేస్తాయి. సేఫ్టీ కోసం ఫ్రెంట్ డిస్క్ బ్రేక్, హై-ఎండ్ వేరియంట్లలో రేర్ డిస్క్ బ్రేక్ సౌకర్యం ఉంది. స్టైల్, పర్ఫార్మెన్స్, టెక్నాలజీ కలగలిసిన ఈ కొత్త పల్సర్.. మార్కెట్‌లో తన పట్టును మరింత పెంచుకుంటుందని కంపెనీ భావిస్తోంది.
మరి మీరు ఈ బజాజ్ పల్సర్ 150 బైక్‌ని కొంటారా?