భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ల పోటీ తారాస్థాయికి చేరింది. ఓలా, టీవీఎస్ వంటి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు బజాజ్ ఆటో తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. తాజాగా తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. ఇకపై ఈ స్కూటర్లు ‘C సిరీస్’ పేరుతో కొత్త గుర్తింపును పొందనున్నాయి. కేవలం పేర్లు మార్చడమే కాకుండా, పర్ఫార్మెన్స్, కనెక్టివిటీ, వినియోగదారుల సౌకర్యం పరంగా కీలక మార్పులు చేపట్టింది.
కొత్త పేర్లు.. కొత్త గుర్తింపు..

బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను వాటి సామర్థ్యం ఆధారంగా మూడు రకాలుగా విభజించింది. ఇకపై వీటిని సీ 35, సీ 30, సీ 25 సిరీస్‌లుగా పిలుస్తారు. వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా సరైన మోడల్‌ను ఎంచుకోవడానికి ఈ కొత్త నామకరణం సులభతరం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇందులో సీ 35 శ్రేణి అగ్రస్థానంలో ఉండబోతోంది.
గూగుల్ మ్యాప్స్‌తో తిరుగులేని నావిగేషన్..
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు చాలా కాలంగా కోరుకుంటున్న ఫీచర్‌ను బజాజ్ ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. టాప్-ఎండ్ మోడల్ అయిన సీ 35 01లో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ను నేరుగా చేతక్ యాప్ ద్వారా ఇంటిగ్రేట్ చేశారు. దీనివల్ల ప్రయాణ సమయంలో ఫోన్ వైపు పదే పదే చూడాల్సిన అవసరం లేకుండా, స్కూటర్ డిస్‌ప్లే పైనే రూట్ మ్యాప్‌ను స్పష్టంగా చూడవచ్చు. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ అప్‌డేట్ ఎంతో దోహదపడుతుంది.
పెరిగిన వేగం.. మెరుగైన పవర్..
స్పీడ్ విషయంలోనూ బజాజ్ రాజీ పడలేదు. ఈ కొత్త అప్‌డేట్‌తో అన్ని మోడళ్ల గరిష్ట వేగాన్ని పెంచింది:
సీ 35 01 అండ్ సీ 35 02: వీటి టాప్ స్పీడ్ గంటకు 73 కి.మీ నుంచి 80 కి.మీకి పెరిగింది.
{{/usCountry}}సీ 35 01 అండ్ సీ 35 02: వీటి టాప్ స్పీడ్ గంటకు 73 కి.మీ నుంచి 80 కి.మీకి పెరిగింది.
{{/usCountry}}సీ 35 03 అండ్ సీ 30 01: ఇవి ఇప్పుడు గంటకు 70 కి.మీ వేగంతో దూసుకెళ్తాయి.
సీ 25 01: దీని వేగం గంటకు 55 కి.మీ నుంచి 60 కి.మీకి చేరుకుంది.
మోటార్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, ఫ్లాగ్‌షిప్ మోడల్ సామర్థ్యాన్ని 4.5 కేడబ్ల్యూ నుంచి 4.8 కేడబ్ల్యూ (సుమారు 6.4 బీహెచ్పీ) కు పెంచారు. దీనివల్ల ఈ బజాజ్ ఈ-స్కూటర్ పికప్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
ఛార్జింగ్ సమయం తగ్గింపు.. ఫీచర్లు ఇప్పుడు ఉచితం!
వినియోగదారులకు మరో శుభవార్త ఏమిటంటే, గతంలో డబ్బులు చెల్లిస్తేనే లభించే కొన్ని ప్రీమియం ఫీచర్లు ఇప్పుడు బజాచ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్టాండర్డ్‌గా అందిస్తోంది!
రైడ్ మోడ్స్: స్పోర్ట్స్, ఎకో మోడ్స్ ఇకపై సీ 35, సీ 30 సిరీస్ స్కూటర్లలో బిల్ట్-ఇన్ ఫీచర్లుగా వస్తాయి.
హిల్ హోల్డ్ అసిస్ట్: ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై స్కూటర్ వెనక్కి జారిపోకుండా ఆపే ఈ ఫీచర్‌ను కూడా ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నారు.
ఛార్జింగ్: సీ 30 01 మోడల్ ఛార్జింగ్ సమయాన్ని తగ్గించారు. ఇప్పుడు ఇది కేవలం 2 గంటల 55 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. గతంలో దీనికి దాదాపు 4 గంటల సమయం పట్టేది.
"సీ సిరీస్ అనేది చేతక్ ప్రయాణంలో ఒక పరిణామం. మా శ్రేణి అంతటా అర్థవంతమైన అప్‌గ్రేడ్‌లను తీసుకువచ్చాం," అని బజాజ్ ఆటో ప్రతినిధి ఎరిక్ వాస్ తెలిపారు. గూగుల్ మ్యాప్స్, ఓటీఏ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు వినియోగదారులకు మరింత విలువను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.