Stock market : ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు అలర్ట్- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు సెలవు..

Bakrid 2026 stock market holiday :  బక్రీద్ పండుగ సందర్భంగా నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు. ఏయే సెగ్మెంట్లు పూర్తిగా బంద్ కానున్నాయి, కమోడిటీ మార్కెట్ టైమింగ్స్ ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: May 28, 2026, 07:28:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

stock market holiday today : భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు ముఖ్య గమనిక1 దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్​ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ.. ఈరోజు, గురువారం (28 మే 2026) పనిచేయవు. పవిత్ర ‘బక్రీద్’ పండుగను పురస్కరించుకుని స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటిస్తూ ఎక్స్​ఛేంజీలు నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల ఈ వారం ట్రేడింగ్ సెషన్లు నాలుగు రోజులకు పరిమితమయ్యాయి.

స్టాక్ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..

మే నెలలో స్టాక్ మార్కెట్లకు లభించిన రెండవ సెలవు ఇది. మొదటి సెలవు మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చారు.

బక్రీద్ 2026- ఏయే మార్కెట్లు పూర్తిగా మూతపడతాయి?

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. గురువారం (మే 28) రోజంతా కింది సెగ్మెంట్లలో ఎలాంటి ట్రేడింగ్ జరగదు:

  • ఈక్విటీ సెగ్మెంట్
  • ఈక్విటీ డెలివేటివ్స్
  • కరెన్సీ డెరివేటివ్స్
  • ఎన్​డీఎస్​- ఆర్​ఎస్​టీ. ట్రై పార్టీ రెపో సెగ్మెంట్లు పూర్తిగా క్లోజ్​

బక్రీద్ 2026- కమోడిటీ మార్కెట్ టైమింగ్స్..

మల్టీ కమోడిటీ ఎక్స్​ఛేంజ్ (ఎంసీఎక్స్) లో ట్రేడింగ్ పాక్షికంగా మూసి ఉంటుంది.

మార్నింగ్ సెషన్: బక్రీద్ నేపథ్యంలో ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కమోడిటీ ట్రేడింగ్ పూర్తిగా క్లోజ్​లో ఉంటుంది.

ఈవినింగ్ సెషన్: సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 11:30 లేదా 11:55 గంటల వరకు మార్కెట్ యథావిధిగా తెరుచుకుంటుంది. రాత్రి సెషన్‌లో ఇన్వెస్టర్లు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ వంటి కమోడిటీలలో ట్రేడ్ చేసుకోవచ్చు.

బుధవారం నాటి స్టాక్ మార్కెట్ అప్‌డేట్..

సెలవుకు ముందు రోజైన బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.

దీనితో మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్ : 76,000 పాయింట్ల స్థాయి వద్ద ఊగిసలాడింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 : 23,900 కీలక స్థాయిని కాపాడుకుంది.

బ్యాంక్ నిఫ్టీ : 55,000 మార్కు కంటే పైనే స్థిరపడింది.

మళ్లీ శుక్రవారం (మే 29) ఉదయం 9:15 గంటలకు స్టాక్ మార్కెట్లలో రెగ్యులర్ ట్రేడింగ్ యథావిధిగా ప్రారంభం కానుంది.

ఈద్​ ఉల్​ అజ్హాగా కూడా పిలిచే బక్రీద్​ కారణంగా స్టాక్​ మార్కెట్​లతో పాటు నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులకు కూడా సెలవు లభిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More