బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గాలైన హిందువులపై హింసాత్మక ఘటనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా యశోర్ (Jashore) ప్రాంతంలో ఓ హిందూ వ్యాపారవేత్త, జర్నలిస్టును దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. బంగ్లాదేశ్‌లో గత మూడు వారాల వ్యవధిలో హిందూ మతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఎవరీ రాణా ప్రతాప్ బైరాగి?

హత్యకు గురైన రాణా ప్రతాప్ బైరాగి (38) యశోర్ జిల్లా కేశబ్‌పూర్ నివాసి. ఆయన నరైల్ నుంచి వెలువడే ‘దైనిక్ బీడీ ఖబర్’ (Dainik BD Khabar) అనే స్థానిక పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జర్నలిజంతో పాటు ఆయనకు మణిరాంపూర్‌లోని కొపాలియా బజార్‌లో ఒక ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. గతంలో ఆయనపై కేశబ్‌పూర్, అభయ్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కొన్ని కేసులు నమోదై ఉన్నాయి.
హత్య జరిగిందిలా..
సోమవారం సాయంత్రం 5:45 గంటల సమయంలో రాణా ప్రతాప్ తన ఐస్ ఫ్యాక్టరీలో పనిలో ఉండగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయనను బయటకు పిలిచారు.
"దుండగులు రాణాను ఫ్యాక్టరీ బయటకు పిలిచి, మార్కెట్ పశ్చిమ వైపున్న ఒక సందులోకి తీసుకెళ్లారు. అక్కడ వారితో చిన్నపాటి వాగ్వాదం జరిగిన తర్వాత, నిందితులు రాణా తలపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు" అని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు 'ది డైలీ స్టార్' వెల్లడించింది.
కాల్పుల అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో కొపాలియా మార్కెట్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
మతపరమైన కోణం ఉందా?
ఈ హత్యకు మతపరమైన కారణాలు ఉన్నాయా లేదా అన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు. అయితే, దేశంలో వరుసగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. మణిరాంపూర్ పోలీస్ స్టేషన్ అధికారి (OC) మహ్మద్ రాజీవుల్లా ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. "హత్య వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా తెలియలేదు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం" అని తెలిపారు.
{{/usCountry}}ఈ హత్యకు మతపరమైన కారణాలు ఉన్నాయా లేదా అన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు. అయితే, దేశంలో వరుసగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. మణిరాంపూర్ పోలీస్ స్టేషన్ అధికారి (OC) మహ్మద్ రాజీవుల్లా ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. "హత్య వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా తెలియలేదు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం" అని తెలిపారు.
{{/usCountry}}