పండుగల సీజన్‌లో బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లే వినియోగదారులకు కీలక అలర్ట్. దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన్ పూజ, విశ్వకర్మ జయంతి పర్వదినాలను పురస్కరించుకుని నవంబర్ 9 సోమవారం రోజున దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ఉంటుంది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం శని, ఆదివారాలు, ప్రాంతీయ పండుగలతో కలిపి నవంబర్ నెలలో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవు లభించనుంది.
నవంబర్ 9న ఏ నగరాల్లో బ్యాంకులు బంద్?
నవంబర్ 9 సోమవారం రోజున అగర్తల, భోపాల్, చండీగఢ్, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంపాల్, జైపూర్, కాన్పూర్, లక్నో నగరాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సహా అన్ని బ్యాంకుల శాఖలు మూతపడతాయి.
అయితే, మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో నవంబర్ 9న బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
ముంబై నగరం, ముంబై సబర్బన్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ 9న స్థానిక సెలవుగా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇది కేవలం ఆయా ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాగా, ప్రైవేట్ సంస్థలు, ఇతర వ్యవస్థలు సాధారణంగానే పనిచేస్తాయి.
నవంబర్ నెలలో కీలక బ్యాంక్ సెలవుల క్యాలెండర్
ఆర్బీఐ అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో మిగిలిన ప్రధాన బ్యాంక్ సెలవులు ఇవే:
నవంబర్ 10 (మంగళవారం): అహ్మదాబాద్, బెంగళూరు, డెహ్రాడూన్, ముంబై, నాగ్‌పూర్ నగరాల్లో బలిపాడ్యమి, విక్రమ్ సంపత్ నూతన సంవత్సరం సందర్భంగా సెలవు.
{{/usCountry}}నవంబర్ 10 (మంగళవారం): అహ్మదాబాద్, బెంగళూరు, డెహ్రాడూన్, ముంబై, నాగ్‌పూర్ నగరాల్లో బలిపాడ్యమి, విక్రమ్ సంపత్ నూతన సంవత్సరం సందర్భంగా సెలవు.
{{/usCountry}}నవంబర్ 11 (బుధవారం): కోల్‌కతా, లక్నో, సిమ్లా, గ్యాంగ్‌టక్ నగరాల్లో భాయ్ దూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా బ్యాంకులు బంద్.
నవంబర్ 13 (శుక్రవారం): వాంగల పండుగకు షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 14 (రెండో శనివారం), నవంబర్ 15 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి.
నవంబర్ 15 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
నవంబర్ 16 (సోమవారం): పట్నా, రాంచీ నగరాల్లో ఛత్ పూజ సందర్భంగా సెలవు.
నవంబర్ 20 (శుక్రవారం): ఇగాస్-బగ్వాల్ నేపథ్యంలో డెహ్రాడూన్‌లోని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 22 (ఆదివరం): అన్ని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 24 (మంగళవారం): హైదరాబాద్, దిల్లీ, ముంబై, కోల్‌కతా సహా అనేక నగరాల్లో కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా సెలవు.
నవంబర్ 27 (శుక్రవారం): కనకదాస జయంతికి బెంగళూరులోని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 28 (నాలుగో శనివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు హాలీడే.
నవంబర్ 29 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథాతథం!
బ్యాంకు శాఖలు మూతపడినప్పటికీ డిజిటల్ సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ (గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం), ఏటీఎం యంత్రాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.
ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ ఆన్‌లైన్ నిధుల బదిలీ సేవలు ఆన్‌లైన్‌లో నిరంతరాయంగా పనిచేస్తాయి. అత్యవసర నగదు ఉపసంహరణలు, ఆన్‌లైన్ పేమెంట్ల కోసం బ్యాంక్ యాప్‌లను ఉపయోగించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.